దేశ ఆర్థిక వేత్తల్లో ఆందోళనలు.. అసమానతల తగ్గింపుకు కొత్త ట్యాక్స్?
: దేశంలో నెలకొన్న అసమానతలపై సర్వత్రా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆర్థికవేత్తలు తమ గళం వినిపిస్తున్నారు. ధనికులు మరింత సంపద వెనకేసుకుంటూ ఉండగా.. పేదవారు ఇంకా అలానే ఉంటున్నారని ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశ ఆర్థిక అసమానత చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ ఆందోళన వెలిబుచ్చారు. ధనవంతులపై వారసత్వపు పన్ను విధించాలని సిఫార్సు చేశారు. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న ధనికుల నుంచి 2 శాతం పన్నుతో పాటు 33 శాతం వారసత్వ పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం స్థూల దేశీయోత్పత్తిలో (GDP)లో 2.73 శాతం భారీ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆర్జించగలదని అంచనా వేశారు. Next Stay 10 కోట్లకు పైగా సంపద ఉన్నవారిపై ప్రతిపాదిత పన్ను విధిస్తే.. చాలా కొద్ది మంది మాత్రమే ప్రభావం చూపుతుందని పికెట్టీ పేర్కొన్నారు. 99.96 శాతం మంది ప్ర జలు ఈ రెండు ప్రతిపాదిత పన్నుల బారిన పడరని వెల్లడించారు. ఎందుకంటే 2022-23 నాటికి దేశంలోని ధనవంతుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉండటమే ఇందుకు కారణమన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, USAతో సహా అనేక దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment