Thursday, 30 May 2024

10లోగా రుతుపవనాలు.. 11 నాటికి తెలంగాణ అంతటా నైరుతి విస్తరణ

 


 10లోగా రుతుపవనాలు.. 11 నాటికి తెలంగాణ అంతటా నైరుతి విస్తరణ

 

నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్‌సూన్‌ లక్షద్వీప్‌ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్‌ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.

  • చల్లని కబురు చెప్పిన భారత వాతావరణశాఖ
  • జూన్‌ 1 -3 మధ్య వివిధ జిల్లాలకు వర్షసూచన

            నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్‌సూన్‌ లక్షద్వీప్‌ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్‌ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. అంతకుముందే జూన్‌ 1 నుంచి మూడు రోజులపాటు పలుజిల్లాల్లో వర్షాలు పడుతాయని తెలిపింది.

                         హైదరాబాద్‌,: రాష్ట్ర రైతులకు, ప్రజలకు హైదరాబాద్‌ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్‌ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొన్నది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. లక్షద్వీప్‌ మీదుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని చెప్పింది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం,పశ్చిమ బెంగాల్‌, సికింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండు మూడు రోజుల్లోనే విస్తరిస్తాయని వాతావరణశాఖ పేర్కొన్నది. నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు, జూన్‌ 10 లోగా తెలంగాణకు రుతుపవనాలు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి డాక్టర్‌ శ్రావణి తెలిపారు. జూన్‌ 11 వరకు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేరొన్నారు.

కేరళతో పాటు ఈశాన్య రాష్ర్టాలకూ…

కేరళతో పాటు ఈశాన్య రాష్ర్టాలకు కూడా రుతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా జూన్‌ 1న కేరళను రుతుపవనాలు తాకుతాయి. తర్వాత జూన్‌ 5న ఈశాన్య రాష్ర్టాలకు విస్తరిస్తాయి. అయితే, రుతుపవనాలు వచ్చే సమయంలోనే బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెమాల్‌ తుఫాను ప్రభావంతో ఈశాన్య రాష్ర్టాలకు ముందుగానే రుతుపవనాలు చేరాయి. ఇలా ఒకేసారి కేరళకు, ఈశాన్యానికి రుతుపవనాలు రావడం అరుదుగా జరుగుతుంది. ఇంతకుముందు 1991, 1995, 1997, 2017లో ఇలా జరిగింది.

ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!


 

algonda: ముగ్గురు తహసీల్దార్లు అరెస్టు!                                     అసైన్డ్‌ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు.నల్లగొండ జిల్లాలో అసైన్డ్‌ కేటాయింపులో అక్రమాలు


అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్‌.. తర్వాత రిమాండ్‌

నిడమనూరు, మే 29: అసైన్డ్‌ భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని నల్లగొండ జిల్లా నిడమనూరులో పనిచేసిన ముగ్గురు తహసీల్దార్లు, ఓ వీఆర్‌వోను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిడమనూరు మండలం తుమ్మడం శివారులోని 9 ఎకరాల ప్రభుత్వ భూములను అసైన్‌మెంట్‌ కమిటీ తీర్మానం లేకుండానే గతంలో పలువురికి పట్టాలు చేశారు. ఇందులో అప్పటి వీఆర్వో వద్ద బినామీగా ఉన్న వ్యక్తి భార్య, తండ్రి పేరిట అక్రమంగా పట్టా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. మార్తివారిగూడేనికి చెందిన పలువురు ప్రభుత్వ భూములను పట్టాలు చేయించుకున్నారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో మార్తివారిగూడెం వాసి, న్యాయవాది మార్తి వెంకట్‌రెడ్డి రెండేళ్ల క్రితం హైకోర్టులో పిల్‌ వేశారు.


స్పందించిన కోర్టు సమగ్ర విచారణ చేసి వివరాలు సమర్పించాలని కోరింది. కాగా, అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ విచారణకు ఆదేశించారు. 2022లో నిడమనూరు పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం నల్లగొండకు బదిలీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సమగ్రంగా విచారించా రు. నిడమనూరులో అప్పట్లో పనిచేసిన మందడి నాగార్జునరెడ్డి (ప్రస్తుతం హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌), గుగులోతు దేశ్యానాయక్‌, ఏఆర్‌ నాగరాజు అనే ముగ్గురు తహసీల్దార్లతో పాటు తుమ్మడం వీఆర్‌వోగా ఉన్న ముదిగొండ సుమన్‌, అక్రమంగా భూములు పొందిన నలుగురిని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిసింది

Tuesday, 28 May 2024

Rto కార్యాలయంలో ఏసీబీ సోదాలు

 




రవాణా శాఖలో జూన్ 1 నుంచి కొత్త రూల్స్..*

 

రవాణా శాఖలో


జూన్ 1 నుంచి కొత్త రూల్స్..
*

*మైనర్లు పట్టుబడితే 25,000 జరిమానా..*

జూన్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానుండగా, భారీగా జరిమానాలు విధించనున్నారు. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 1000 నుంచి రూ.2000వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా వేస్తారు.

మైనర్ వాహనం నడిపితే రూ.25వేలు ఫైన్ వేస్తారు.

దాంతో పాటు మైనర్కి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధిస్తారు

Monday, 27 May 2024

తండ్రి, అమ్మ, తాతగారి పేరు మీద పహాణీ ఉన్నవారికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రకటన


 

తండ్రి, అమ్మ, తాతగారి పేరు మీద పహాణీ ఉన్నవారికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రకటన

ఆర్టీసీ రూల్స్: తండ్రి, అమ్మ, తాతగారి పేరు మీద పహాణీ (ఆర్టీసీ) ఉన్నవారికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రకటన

RTC బదిలీ:  రాష్ట్ర రెవెన్యూ మంత్రి రాష్ట్ర రైతులందరికీ తీపి వార్త అందించారు, నేటికీ రాష్ట్ర రైతులు తమ తల్లిదండ్రులు లేదా తాతల పేరు మీద పహాణీ భూములను విక్రయిస్తున్నారని, అలాంటి రైతులు ఒక మార్గం ప్రకటించారు. చాలా సులభంగా వారి పేరు మీద పహానీ పొందండి.

మా భూమికి సంబంధించిన దస్తావేజు తల్లిదండ్రులు లేదా తాతయ్యల పేరు మీద ఉండి, దానిని మా పేరుకు బదిలీ చేయడానికి (కాడాస్ట్రల్ ట్రాన్స్‌ఫర్) పత్రాలు లేకుంటే లేదా ఆస్తికి సంబంధించిన వ్యక్తి మరణిస్తే, దానిని మా పేరుకు ఎలా బదిలీ చేస్తారు? వివరాలు తెలుసుకోండి.రైతులకు ప్రభుత్వం నుంచి బంపర్ సహకారం


రైతులందరికీ కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణభైరగౌడ బంపర్ గిఫ్ట్ ఇచ్చారు. రైతు భూమి గుండా గోవులు వెళ్లే రోడ్డు, నీటి కాపలా, వాగు, కంచె, భూమిలో ఉన్న చెట్లు నా భూమికి వస్తాయని, ఇది నా వాటా అని రైతులు గొడవకు దిగిన సందర్భాలు అనేకం. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతులందరి భూ పత్రాల ధ్రువీకరణ పత్రాలను డిజిటలైజేషన్‌ చేయాలని రెవెన్యూ మంత్రి నిర్ణయించారు.భూ సర్వే ఇక నుంచి డిజిటల్‌ రూపంలో ఉంటుంది


భూమి విరాళం, కొనుగోలు, విభజన రూపంలో లేదా పౌతి ఖాతాలో వారసత్వం రూపంలో ఒక రైతు నుండి మరొకరికి ఆస్తి మార్పు ఉంది. ఇంతకుముందు ఈ సమాచారం అంతా పేపర్ రూపంలోనే ఉంచారు కానీ ఎవరికి ఎంత భూమి ఇస్తారనేది కచ్చితంగా పేర్కొనలేదు. అందుకే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాడాస్ట్రల్ రిజిస్టర్‌ను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది.ఈ పత్రంతో పహానీని సులభంగా బదిలీ చేయండి!


భూమి యజమాని తన భూమికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మొబైల్ ఫోన్‌లో తెలుసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక సేవను అందిస్తోంది. తద్వారా రైతుల భూముల సమాచారం, కొలతలను డిజిటల్‌ రూపంలో స్కాన్‌ చేసి భద్రపరచాలని రెవెన్యూ శాఖ యోచిస్తోందని, ఈ ప్రక్రియను 2024 నాటికి పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.



ఇక నుంచి రాష్ట్రంలోని రైతులందరి భూముల సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ పనిని అమలు చేశామని, రైతుల భూములను డిజిటల్‌గా స్కాన్ చేసి పత్రాల సేకరణ జరుగుతుందన్నారు. రైతులు తమ మొబైల్‌లో భూమికి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకునేలా మరియు పహాణీ మీ తండ్రి లేదా తాత పేరు మీద ఉంది, వారు మరణిస్తే మరణ ధృవీకరణ పత్రాన్ని అందించడం ద్వారా సులభంగా మీ పేరుకు బదిలీ చేయవచ్చు.

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.

 

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. 


 *రూ.250 కోట్ల స్కాం

లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ.*


సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య ను అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట డిఎస్పీ రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సి.ఎం.ఆర్ బియ్యం ను ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్లు విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారని తిరుమలగిరి పోలీసు స్టేషన్ లో పౌర సరఫరా శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు ఇమ్మడి సోమనర్సయ్య కు చెందిన మూడు మిల్లులలో అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో సుమారు రూ.250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్టు నెల క్రితం అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇమ్మడి సోమనర్సయ్య ను, ఇమ్మడి సోమనర్సయ్యను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు సూర్యాపేట డిఎస్పీ తెలియజేశారు

Saturday, 25 May 2024

దేశ ఆర్థిక వేత్తల్లో ఆందోళనలు.. అసమానతల తగ్గింపుకు కొత్త ట్యాక్స్?

 దేశ ఆర్థిక వేత్తల్లో ఆందోళనలు.. అసమానతల తగ్గింపుకు కొత్త ట్యాక్స్? 


     : దేశంలో నెలకొన్న అసమానతలపై సర్వత్రా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆర్థికవేత్తలు తమ గళం వినిపిస్తున్నారు. ధనికులు మరింత సంపద వెనకేసుకుంటూ ఉండగా.. పేదవారు ఇంకా అలానే ఉంటున్నారని ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశ ఆర్థిక అసమానత చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రముఖ ఆర్థికవేత్త థామస్ పికెట్టీ ఆందోళన వెలిబుచ్చారు. ధనవంతులపై వారసత్వపు పన్ను విధించాలని సిఫార్సు చేశారు. 10 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులున్న ధనికుల నుంచి 2 శాతం పన్నుతో పాటు 33 శాతం వారసత్వ పన్ను వసూలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

         తద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ నిర్ణయం స్థూల దేశీయోత్పత్తిలో (GDP)లో 2.73 శాతం భారీ ఆదాయాన్ని ప్రభుత్వానికి ఆర్జించగలదని అంచనా వేశారు. Next Stay 10 కోట్లకు పైగా సంపద ఉన్నవారిపై ప్రతిపాదిత పన్ను విధిస్తే.. చాలా కొద్ది మంది మాత్రమే ప్రభావం చూపుతుందని పికెట్టీ పేర్కొన్నారు. 99.96 శాతం మంది ప్ర జలు ఈ రెండు ప్రతిపాదిత పన్నుల బారిన పడరని వెల్లడించారు. ఎందుకంటే 2022-23 నాటికి దేశంలోని ధనవంతుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే మొత్తం సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉండటమే ఇందుకు కారణమన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్, USAతో సహా అనేక దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ నిష్పత్తి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

మంత్రివర్గం నుంచి సీతక్క ఔట్ - కీలక పదవి, రేవంత్ ఛాయిస్..!?

 మంత్రివర్గం నుంచి సీతక్క ఔట్ - కీలక పదవి, రేవంత్ ఛాయిస్..!? 

 Chaitanya 

 తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తరువాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ, పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్..సీఎంగా రేవంత్ ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఇక..ఎన్నికలు పూర్తి కావటంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైంది. నూతన పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ..ప్రభుత్వంలో రేవంత్ మార్క్ నిర్ణయాలు అమలు అవుతున్నాయి. రేవంత్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ సీఎం అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతోంది. రేవంత్ సీఎం అయిన తరువాత పీసీసీ చీఫ్ గా మరొకరికి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్ కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావటంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పైన కసరత్తు మొదలైంది. రేవంత్ ను సీఎంగా చేసే సమయంలో భట్టికి డిప్యూటీ సీఎం తో పాటుగా పీసీసీ చీఫ్ పదవి పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసి కట్టుగా పని చేస్తోంది.                                             


    సీతక్కకు పార్టీ పగ్గాలు..? ఇక..పీసీసీ చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకే అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీలు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, అనూహ్యంగా రేవంత్ ఛాయిస్ గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించటం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. సీతక్క పైన పార్టీలో అందరికి సదభిప్రాయం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తారనే నమ్మకంతో పాటుగా రేవంత్ కు నమ్మినబంటుగా పేరుంది. హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ ఓపెన్: ఇది కింగ్ ఆహ్వానం రేవంత్ ఛాయిస్ ఏంటి దీంతో..ఇతరుల నుంచి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుంచి తొలిగించి పీసీసీ చీఫ్ బాద్యతలు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, మంత్రిగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ పదవి అప్పగించేలా మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాల తరువాత ముందుగా పీసీసీ చీఫ్ నియామకం..ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ..నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే, సీతక్క ఎంపిక పైన పార్టీ హైకమాండ్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించి..ఏకాభిప్రాయంతో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సీతక్క కే పార్టీ పగ్గాలు అప్పగిస్తే..తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళా గుర్తింపు పొందనున్నారు.

వంటగదిలో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయా? ఇలా వదిలించుకోండి

 

 వంటగదిలో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయా? ఇలా వదిలించుకోండి



            వంటగదిలోకి బొద్దింకలు వస్తే చిరాకుగా అనిపిస్తుంది. వాటిని వదిలించేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి

               వంటగది ఎంత శుభ్రంగా ఉంటే ఇంటి సభ్యుల ఆరోగ్యం అంత బాగుంటుంది. అయితే కొందరి వంటగదిలో బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి. ఎన్ని రసాయనాలు పిచికారీ చేసినా బొద్దింకలు తగ్గవు. అటువంటి సందర్భాలలో బొద్దింకలను వదిలించుకోవడానికి ఏం చేయాలి? మీ కోసం ఇక్కడ సమాధానం ఉంది.

                       ఎండ వేడిమి పెరగడంతో వంట గదిలోకి అనుకోని అతిథిలా బొద్దింకల బెడద ఎక్కువవుతోంది. పిలవని పేరంటానికి వచ్చినట్టుగా వచ్చి గందరగోళం చేస్తాయి. మీ వంటగదిని వాటి ఇంటిగా చేసుకుంటాయి. వంటగది అల్మారాలు, గోడ పగుళ్లు ఎక్కడ చూసినా బొద్దింకలతో నిండిపోయాయి. దీంతో చూస్తేనే చిరాకుగా అనిపిస్తుంది.

బొద్దింకలు అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా వంటగదిలోని ఆహారాన్ని కూడా కలుషితం చేస్తాయి. బొద్దింకలు తాకిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బొద్దింకలను వదిలించుకోవడానికి మీరు కచ్చితంగా మార్కెట్లో లభించే రసాయన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అయితే దానికి ముందు, వంటగది బొద్దింకలకు నిలయంగా మారకుండా నిరోధించడానికి మీరు ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మురికి ఉండకూడదు

మీరు మీ వంటగదిలో శుభ్రత పాటించకపోతే, బొద్దింకలు చాలా త్వరగా మీ వంటగదికి ఆకర్షితులవుతాయి. బొద్దింకలను నివారించడానికి మీరు ముందుగా అల్మారాలు, డ్రాయర్లు, క్యాబినెట్‌లు, వంటగదిలోని అన్ని మూలలను శుభ్రం చేయాలి. వంటగదిలో ఏదైనా గడువు ముగిసిన


పదార్థాలను తొలగించాలి. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి గాలి చొరబడని సీసాలు ఉపయోగించాలి.

శుభ్రం చేయండి

వంటగదిలో బొద్దింక దాడి పరిమితికి మించి ఉంటే, మీరు మొదట చేయవలసిన పని వంటగదిని బాగా శుభ్రపరచడం. వంటగదిలోని ప్రతి మూలను శుభ్రం చేయాలి. ఎందుకంటే చిన్న మురికి స్థలం ఉన్నా మంచిది కాదు. ఆహారం కిందపడినట్లయితే, బ్రెడ్ వంటి వస్తువులు చెల్లాచెదురుగా ఉంటే, ఏమీ వదిలివేయకుండా ప్రతిదీ శుభ్రం చేయాలి. వంటగదిలో పరిశుభ్రత పాటిస్తేనే బొద్దింకలను వదిలించుకోవడం సాధ్యమవుతుంది.

రంధ్రాలను మూసేయండి

     వంటగదిలో పైపులు, కిటికీలు మొదలైన ఏవైనా రంధ్రాలను కవర్ చేయండి. బొద్దింకలకు మీ ఇంటిలోకి ప్రవేశించడానికి తగినంత స్థలం ఇవ్వకూడదు. సింక్‌లను రోజూ కడగాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

సహజ పురుగుల మందు

బొద్దింకల దాడిని వదిలించుకోవడానికి మీరు సహజ పురుగుమందులను ఉపయోగించవచ్చు. పుదీనా నూనె, వేపనూనెలో కాటన్‌ను ముంచి వంటగది మూలల్లో ఉంచడం ద్వారా బొద్దింకలను దూరం చేసుకోవచ్చు.

చెత్తను పారేయండి

కూరగాయలు, పండ్ల తొక్కలు, టీ పౌడర్, పాత ఆహారం ప్రతిరోజూ వంటగదిలోని చెత్తలో పడిపోతాయి. మీరు ప్రతిరోజూ ఈ వ్యర్థాలను పారవేయాలి. చెత్త డబ్బా శుభ్రం చేయకుండా ఉండకూడదు. బొద్దింకలు కూడా చెత్త వాసనకు ఆకర్షితులవుతాయని గుర్తుంచుకోండి.

నీరు నిల్వకుండా చూసుకోవాలి

నిలిచిన నీటిలో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయని తెలిసిందే. కిచెన్ సింక్ పైపులలో చిన్న లీకేజీలు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయాలి. సింక్‌లో కలుషిత నీరు ఉంటే వెంటనే శుభ్రం చేయాలి.

గాజు పాత్రల్లో ఆహారం

ఆహార పదార్థాలను గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాల్లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. దీని కోసం మీరు గాజు పాత్రలను ఉపయోగించవచ్చు. అప్పుడు బొద్దింకలు ఆహార పదార్థాల దగ్గరకు రాలేవు. ఈ విధంగా మీరు మీ ఆహార పదార్థాలలో బొద్దింకల.

రోజూ బీరు తాగుతున్నారా?.. అవి బలంగా మారతాయి


 రోజూ బీరు తాగుతున్నారా?.. అవి బలంగా మారతాయి 

By Garikapati Rajesh 

                    : నాన్ వెజ్ ఎక్కువగా తినేవారికి ప్రతిరోజు ముక్క ఉండాల్సిందే. ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాగే మందుబాబులకు కూడా చుక్క పడందే నిద్ర పట్టదు. కొందరు బాధలను మర్చిపోవడానికి తాగుతుంటారు. మరికొందరు మాత్రం ప్రతిరోజు ఆరోగ్యానికి మంచిదని బీరు తాగుతుంటారు. అయితే రోజూ బీరు తాగడంవల్ల ఎటువంటి లాభాలున్నాయి.. ఎటువంటి నష్టాలున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. ఎముకల సాంద్రత పెరుగుతుంది ప్రతిరోజు బీరు తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది. స్త్రీ, పురుషులిద్దరికీ మేలు చేస్తుంది. బీరు తాగడంవల్ల ఎముకలు బలంగా మారతాయి అయితే ప్రతిరోజు తీసుకోకుండా వారానికి ఒకసారో లేదంటే రెండుసార్లో తీసుకోవాలి. రోజూ తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు వ్యాయామం చేస్తూ డైటింగ్ చేస్తుంటారు. అయితే వీరు బీరు తీసుకుంటే ఆ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ప్రతిరోజు బీరు తాగితే నిద్రలేమి వస్తుంది.

                             :నిద్రలేమి కలుగుతుంది చాలామంది బీరు తీసుకోవడంవల్ల నిద్ర పడుతుందని భావిస్తారు. కానీ అది రివర్స్ లో జరుగుతుంది. నిద్రలేమి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుంటుంది. మెదడు సరిగా పనిచేయదు. పనితీరు మందగిస్తుంది. పేగులకు నష్టం వాటిల్లుతుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వారానికి ఒకసారే తాగాలని చెబుతున్నారు. యూరోపియన్ దేశాల్లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం మితమైన బీరు తీసుకోవడమనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని 31 శాతం తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు మద్యపానం చేసేవారు కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం నుంచి ఉత్పన్నమయ్యే అతి పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి. మితమైన మద్యపానం తర్వాత జీవితంలో టైప్-2 మధుమేహ అభివృద్ధిని నిరోధించవచ్చు

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నిక.

                                    


సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నిక.

                                న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కొత్త అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో సిబల్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1066 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు రావడంతో సిబల్ విజయం సాధించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. చివరగా 2001-02లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేవారు సిబల్. అంతకుముందు 1995-96, 1997-98లోనూ ఈ పదవికి ఆయన ఎన్నికయ్యారు. ఈ ఏడాది బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 

                       కపిల్ సిబల్(1,066), ప్రదీప్ కుమార్ రాయ్(689) తోపాటు ఆదిష్ అగర్వాలా, ప్రియా హింగోరాణి, నీరజ్ శ్రీవాస్తవ, త్రిపురారి రే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో పోటీ పడ్డారు. అత్యధికంగా ఓట్లు రావడంతో కపిల్ సిబల్ ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కపిల్ సిబల్ మాట్లాడుతూ.. లాయర్లు అంటే చట్టబద్ధమైన పాలనను నిలబెట్టడం. న్యాయవాది ఉద్దేశ్యం రాజ్యాంగాన్ని పరిరక్షించడం అని వ్యాఖ్యానించారు. అందుకే, మీరు రాజకీయాల ఆధారంగా బార్‌ను విభజించినట్లయితే, వాస్తవానికి మీరు న్యాయవాదిగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చలేరన్నారు. ఒక వ్యక్తిగత రాజకీయ తత్వశాస్త్రం మీకు ఉండవచ్చు, కానీ న్యాయవాదిగా మీ విధికి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉండదన్నారు. కానీ తాము ఎప్పుడూ కోర్టులో దాని కారణాన్ని సమర్థించలేదని వ్యాఖ్యానించారు.

అల్పపీడనంతో రాష్ట్రానికి పొంచివున్న ముప్పు!

 అల్పపీడనంతో రాష్ట్రానికి పొంచివున్న ముప్పు!

        : తెలంగాణ వ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండిస్తుండగా మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రెండువారాలుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జల్లులు పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. భానుడి భగభగలు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వానలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. ఓవైపు ఇలా వర్షానికి సంబంధించి హెచ్చరికలు జారీ అవుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది.

                            నేరెళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం రోజు రాష్ట్రం మొత్తంమీద అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు చెబుతున్న సలహాలు, సూచనలు పాటించాలంటున్నారు. అత్యవసరమైన పనివుంటేనే బయటకు వెళ్లాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల్లోపు బయటకు రావొద్దని, అత్యవసరమైతే గొడుగు వాడాలని, దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగుతుండాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..?

                                              తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ ఎప్పుడంటే..? 


                           :తెలంగాణలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.విద్యాసంవత్సరం 229 పనిదినాలను కలిగి ఉంటుందని, ఆఖరి రోజు వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీన ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నడుస్తాయి.SSC పరీక్షలు మార్చి 2025న నిర్వహించబడతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 2024-25 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా.. రాష్ట్ర బోర్డుచే గుర్తింపు పొందిన పాఠశాలలు జూన్ 12 నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తాయి. ఇదిలావుండగా.. జూన్ 1 నుండి 9 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట (అడ్మిషన్ డ్రైవ్)ను విద్యాశాఖ నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. 

           ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించాలని సూచిస్తారు. బడి మానేసిన పిల్లలు లేదా చదువు మానేసిన విద్యార్థులను కూడా గుర్తించి వారి వయస్సు ప్రకారం తగిన తరగతిలో పాఠశాలల్లో చేర్పించాలని పిల్లలకు తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కోరునున్నారు.

బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధo-ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన

                   

బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధo-ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన
            : ఈనెల 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాజకీయ పరమైన బల్క్ ఎస్ ఎం ఎస్ ల పై నిషేధం ఉంటుందని జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరి చందన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల పోలింగ్ ముగిసే 48 గంటల ముందు నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు గాని,రాజకీయ పార్టీలు గానీ ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వకూడదని ,ఒకవేళ ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి బల్క్ ఎస్ఎంఎస్ లు పంపించినట్లయితే చట్ట రీత్యా ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్య తీసుకోబడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు, అలాగే మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం దృష్టిలో ఉంచుకొని 25 వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్ లు ఇవ్వవద్దని కోరారు

Friday, 24 May 2024

శ్రీవారి భక్తులకు అలర్ట్, అలా చేస్తే ?, ఏడుకొండలవాడా గోవిందా గోవిందా

 

శ్రీవారి భక్తులకు అలర్ట్, అలా చేస్తే ?, ఏడుకొండలవాడా గోవిందా గోవిందా

                :కలియుగదైవం ఏడుకొండల స్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రతిరోజు వేలాది మంది భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో, వీకెండ్ లో ఇంకా ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

                దర్శనానికి ఎన్నిగంటలు పట్టిందా అనేది కాదు సమస్య, స్వామి దర్శనం అయ్యిందా లేదా అనేదే లెక్క అని శ్రీవారి భక్తులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని శ్రీవారి భక్తులు ప్రతినిత్యం తిరుమల చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి సామాన్య ప్రజల కోసం రూ. 300 టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.

The contract employees are deceiving the devotees that they will have darshan of Srivari in Tirumala

మామూలుగా సర్వదర్శనం టోకన్లు కూడా తిరుపతిలో భక్తులు ఇస్తుంటారు. సర్వదర్శరం టోకన్లు లేని భక్తులు తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంఫ్లెక్స్ లో గంటల తరబడి వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారిని త్వరగా దర్శనం చేసుకోవాలి అనుకుంటున్న భక్తులను తిరుమలలో కొందరు దళారులు శ్రీవారి భుక్తులను బయటే నిలువుదోపిడీ చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేయిస్తామని నమ్మించి నిలువు దోపిడీలు చేస్తున్నారు.

                    తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన శివరామక్రిష్ణ అనే వ్యక్తి తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోవాలని ప్రయత్నించారు. ఆ సమయంలో తిరుపతికి చెందిన దళారులు అమరనాథ్, వినోద్ కుమార్, పూలశేఖర్ అనే ముగ్గురు శివరామక్రిష్ణను సంప్రధించారు. తిరుమలలో మీకు త్వరగా స్వామి దర్శనం చేయిస్తామని నమ్మించి శివరామక్రిష్ణ దగ్గర రూ. 20 వేలు తీసుకుని అక్కడి నుంచి మాయం అయ్యారు.మోసం జరిగిందని గుర్తించిన భక్తులు శివరామక్రిష్ణ తిరుమల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుమల టూటౌన్ పోలీసులు దళారులు అమరనాథ్, వినోద్ కుమార్, పూలశేఖర్ ను గురువారం రాత్రి అరెస్టు చేశారు. నిందితులు తిరుమలలోని లక్ష్మీశ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారని, ఇప్పటి వరకు నిందితులు వందలాది మంది శ్రీవారి భక్తులను మోసం చేశారని పోలీసు అధికారులు తెలిపారు.

సర్వే సంస్థలకే వణుకు పుట్టిస్తోన్న ఏపీ ఫలితo

 

సర్వే సంస్థలకే వణుకు పుట్టిస్తోన్న ఏపీ ఫలితo

జకీయాలతో పోలిస్తే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. ఏపీలో ఎన్నికల్లో స్థానికత, సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కులాల మీద ఏపీలో ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అని ముందే ఓ అంచనాకు వస్తుంటారు. సర్వే సంస్థలు కూడా ఫలానా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రకటిస్తాయి. ఇప్పటి వరకు వెలువడిన సర్వేలు కొన్ని వైసీపీకి అనుకూలంగా చెప్పగా, మరికొన్ని కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.                అయితే పోలింగ్ తర్వాత ఓటర్ల నాడి ఎలా ఉందనే దానిపై రాజకీయ నాయకులకు అంతు చిక్కడం లేదు.ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో, సర్వే సంస్థలు తమ నివేదికను తెలియజేయడానికి వెనకడుగు వేస్తున్నాయి.కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే నిబంధనలు ఉన్నా పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా, అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు.కానీ ఏపీ ఫలితాలను మాత్రం వెల్లడించడానికి అన్ని సర్వే సంస్థలు వెనకాడుతున్నాయి.

Thursday, 23 May 2024

తీన్మార్ మల్లన్న MLC ప్రచారంలో*




 *తీన్మార్ మల్లన్న MLC ప్రచారంలో* భాగంగా భద్రకాళి ట్యాంక్ బండ్ వాకర్స్ తో *మొదటి ( 1 ) ప్రాధాన్యత ఓటు వేయమని కోరినాడు* ఈ యొక్క కార్యక్రమంలో గో పాల నవీన్ రాజు గారు మరియు కార్పొరేటర్లు ముఖ్య నాయకులు లతో పాల్గొన్న మీ..... *తోట హరీష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర* నాయకులు వరంగల్ *బులియన్ &  డైమ0డ్ మర్చంట్  అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్*

మంత్రి కోమ‌టిరెడ్డి కి ఉప్ప‌ల్ శ్రీనివాస గుప్తా బ‌ర్త్ డే విషెస్

 మంత్రి కోమ‌టిరెడ్డి కి ఉప్ప‌ల్ శ్రీనివాస గుప్తా బ‌ర్త్ డే విషెస్


రాష్ట్ర రోడ్లు, భవనాలు , సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు నిరాడంబ‌రంగా జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకున్నారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు..  టిపిసిపి ప్ర‌చార క‌మిటీ స‌హ స‌మ‌న్వ‌య క‌ర్త ఉప్ప‌ల్ శ్రీనివాస గుప్తా మినిస్ట‌ర్ క్వార్డ‌ర్స్ లోని మంత్రి గృహంలో కోమ‌టిరెడ్డిని క‌లిసి ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం ఇచ్చి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు..

Tuesday, 21 May 2024

ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!

 ఏపీ మద్యం బ్రాండ్లు తెలంగాణలో వస్తున్నాయా.. మంత్రి క్లారిటీ ఇదే!


 మందు బాబులకు అలర్ట్‌. ఏపీలో ఉన్న వింత వింత కొత్త మద్యం బ్రాండ్లు తెలంగాణలో కూడా వస్తున్నాయనే ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారంపై సంబంధిత మంత్రి ప్రకటన ఇదే.

Telangana New Liquor Brands: తెలంగాణలో అధికారం మారిన అన్ని వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఎక్సైజ్‌ శాఖకు సంబంధించి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో కూడా ఏపీ బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయని ప్రచారం జరగడం కలకలం రేపింది. ప్రెసిడెంట్‌ మెడల్‌, స్పెషల్‌ స్టేటస్‌ వంటి బ్రాండ్లు వస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలకు విస్తృత ప్రచారం జరగడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కొత్త బ్రాండ్లు ఏవీ రావడం లేదని ఎక్సైజ్‌ శాఖ స్పష్టం చేసింది.

కొత్త బ్రాండ్లపై వస్తున్న ఆరోపణలపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 'తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామని జరుగుతున్న ప్రచారం తప్పు. అది దుష్ప్రచారం' అని కొట్టిపారేశారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని.. అసలు పరిశీలన జరగలేదని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు, లెక్కలు తదితర వాటిపై జూపల్లి వివరణ ఇచ్చారు

పదవ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

 



@ పదవ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన ప్రభుత్వ వసతి గృహాల  విద్యార్థిని విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన

       ప్రభుత్వ  సాంఘిక సంక్షేమ, గిరిజన వసతి గృహాలలో ఉంటూ కష్టపడి చదివి పదవ తరగతి ఫలితాలలో  10 జిపిఏ  సాధించిన విద్యార్థిని విద్యార్థులను  నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అభినందించారు

          సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించారు. 

      విద్యార్థులు చిన్నప్పటినుండి కష్టపడి చదివి మంచి ప్రతిభ సాధించి భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానం పొందాలని, ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యసాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ హాస్టల్లలో ఉంటూ కష్టపడి చదివి పదికి పది జీపీఎ సాధించడం సంతోషకరమని, వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర విద్యార్థులు సైతం బాగా చదివి మంచి మార్కులు పొందాలని కోరారు.కష్టపడి చదివిన  వారికి భవిష్యత్తు బాగుంటుందని, చదువుతోనే మన జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని, ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కోరారు.
    10 జిపిఎ సాధించిన వారిలో గిరిజన సంక్షేమ హాస్టల్ లో చదివిన రమావత్ సర్దార్, పాల్త్య సహారా(బాలిక), వడ్త్యా అరవింద్, ఎస్సి సంక్షేమ హాస్టల్లో చదివిన ఇరాపురి అక్షర, చలమల పుష్కరిణి, అయేషా అంజుమ్ లు ఉన్నారు. 

      కరోనా సమయంలో అకాల మరణం చెందిన మునుగోడు తహసిల్దార్ సునంద పేరు మీద తన భర్త  లక్ష్మారెడ్డి 10 జీపీఏ సాధించిన ముగ్గురు ఎస్సీ సంక్షేమ విద్యార్థినీ విద్యార్థులకు  ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. 

  ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ,హౌసింగ్ పి డి  రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు .

ACB | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి


 

ACB | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

 

ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

హైదరాబాద్‌ : ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని నానాజీపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్‌ నగరంలోని యాకత్‌పూర ప్రాంతానికి చెందిన భర్కత్‌ అలీ అనే వ్యక్తికి 500 గజాల ఫ్లాటు ఉన్నది.

Saturday, 18 May 2024

‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో భారీ మోసం

 కొంపల్లి ప్రాంతంలో నివాస గృహాలు నిర్మిస్తామని మాయమాటలతో ‘ప్రీ లాంచ్ ఆఫర్ల’ పేరుతో


పెట్టుబడిదారుల నుంచి దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు వసూలు చేసిన ముగ్గురు రియల్టర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో భారతి బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, కంపెనీ ఎండీ ముల్పూరి శివరామ కృష్ణ, కంపెనీ సీఈవో తొడ్డాకుల నరసింహారావు కూడా ఉన్నారని శనివారం అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపారు. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 406, 420, తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌-1999లోని సెక్షన్‌ 5 కింద కేసులు నమోదు చేశారు. కంపెనీ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ ముల్పూరి శివరామ కృషా 2021లో భారతి బిల్డర్స్‌ను ప్రారంభించి, కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, “భారతి లేక్ వ్యూ” పేరుతో నివాస అపార్ట్‌మెంట్లను నిర్మించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

వారు రంగురంగుల బ్రోచర్‌లను ప్రచురించడం , వెంచర్ కొంపల్లి , మాదాపూర్‌లోని వారి కార్యాలయంలో సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రతి sftకి రూ. 3,200 చొప్పున ‘ప్రీ-లాంచ్ ఆఫర్’ ద్వారా కాబోయే కొనుగోలుదారుల నుండి భారీ డిపాజిట్‌లను సేకరించారు. ఫ్లాట్‌ల విక్రయంపై భారీ కమీషన్‌ను ఆఫర్‌ చేసి మరీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వీరిద్దరూ కంపెనీ సీఈవోగా తొడ్డాకుల నర్సింహారావును నియమించారు. అయితే అపార్ట్‌మెంట్లు కట్టకుండా మొత్తం భూమిని వేరే పార్టీకి అమ్మేశారు. బీవీఎస్ ప్రసాదరావుతో పాటు మరో 350 మంది ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది . డీసీపీ కె.ప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ జె.వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపారు.

Friday, 17 May 2024

విద్యుత్‌ సంస్థలో ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

 

విద్యుత్‌ సంస్థలో ఇద్దరు ఉద్యోగుల నిర్వాకం.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం

  


రైతులను వేధిస్తున్న ఇద్దరు విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటు నల్లగొండ జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు పట్టుబడ్డారు.

Tuesday, 14 May 2024

చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..

 చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో కండి..


: ఎక్కువ కాలంగా వినియోగంలో ఉన్న కరెన్సీ నోట్లు, సరైన నిర్వహణ లేని కరెన్సీ నోట్లు చిరిగి పోతుంటాయి. చిరిగి పోయిన నోట్లకు విలువ లేదని పడేయకండి. వాటిని బ్యాంక్ శాఖల్లో, ఆర్బీఐ ఆఫీస్ ల్లో ఉచితంగా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, అందుకు కొన్ని షరతులు ఉన్నాయి.

చిరిగిపోయిన కరెన్సీ నోట్లను ఇలా మార్చుకోండి..

Exchange torn currency notes: చిరిగిపోయిన కరెన్సీ నోట్లను చాలా మంది పడేయడమో లేక అలా పక్కన పెట్టేయడమో చేస్తుంటారు. కొంతమంది చిరిగిపోయిన నోట్లను తీసుకుని కొంత కమిషన్ తీసుకుని, ఆ కరెన్సీ నోటు కన్నా తక్కువ విలువను ఇస్తుంటారు. అలా నష్టపోవాల్సిన అవసరం లేదు. ఏదైనా బ్యాంక్ శాఖలో చిరిగిపోయిన నోట్లను ఉచితంగా మార్పిడి చేసుకోవచ్చు. అయితే, అందుకు కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

చిరిగిపోయిన నోట్లను మార్చుకోవడం ఎలా?

దేశవ్యాప్తంగా ఏ బ్యాంకుల్లోనైనా చెడిపోయిన లేదా చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్ ప్రకారం, ‘మురికి నోటు (soiled note)’ అంటే సాధారణ అరుగుదల కారణంగా మురికిగా మారిన కరెన్సీ నోటును, లేదా రెండు ముక్కలుగా చిరిగిన కరెన్సీ నోటును బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. అయితే, రెండు ముక్కలుగా చిరిగిన నోటులో.. ఆ రెండు ముక్కలు కూడా ఒకే నోటువి అయి ఉండాలి. వాటి ముఖ్యమైన ఫీచర్స్ ఏవీ మిస్ కాకూడదు. అలాంటి నోట్స్ ను బ్యాంక్ లు నిరభ్యంతరంగా మార్పిడి కోసం స్వీకరిస్తాయి.


నోట్ల మార్పిడికి వర్తించే నియమాలు ఏమిటి?

వ్యక్తులు రోజుకు గరిష్టంగా రూ.5,000 విలువ చేసే 20 నోట్లను బ్యాంకుల్లో ఉచితంగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీరు మార్పిడి చేసే కరెన్సీ నోట్ల విలువ రూ. 5 వేలు దాటినా, లేదా ఆనోట్ల సంఖ్య 20 దాటినా.. బ్యాంక్ లు వాటిని స్వీకరిస్తాయి. కానీ, వాటి మార్పిడికి సర్వీస్ చార్జ్ ను వసూలు చేస్తాయి. ఒకవేళ ఆ నోట్ల విలువ రూ.50,000 కంటే ఎక్కువ ఉంటే.. బ్యాంకులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటాయి.

Monday, 13 May 2024

రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న వికాస్ రాజ్..!

 రాష్ట్రంలో 70 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందన్న వికాస్ రాజ్..! 


:                    { తెలంగాణలో జరుగుతూన్న లోక్ సభ ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ అంచనా వేశారు. ఆయన ఎస్ఆర్ నగర్ లోని ఆదర్శ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఓటర్లు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటున్నట్లు చెప్పారు. ఓటు హక్కు ఉన్నవారు బాధ్యతగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి వస్తున్నారని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో భారీ సంఖ్యలో క్యూలైన్లు ఉన్నట్లు చెప్పారు. ఓటర్లు భారీగా తరలొచ్చు ఓటు వేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం వర్షం కారణంగా పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రానికి చేరడానికి కాస్త లేట్ అయినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారని చెప్పారు. అనంతరం మెయిన్ పోలింగ్ ప్రారంభమైందిని పేర్కొన్నారు. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగుస్తుందని చెప్పారు. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు నగిరిలో నగరానా, రోజా చెవిలో పువ్వులు పెట్టిన సొంత పార్టీ క్యాడర్ ?, ఎక్కడ చూసినా అదే టాపిక్ ! ఎక్కడైనా సమస్య ఉంటే 1950కి ఫిర్యాదు చేయాలన్నారు. మాదాపూర్ లోని వేంకటేశ్వర ఫైన్ ఆర్ట్ కాలేజ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 431 లో హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ కుటుంబ సభ్యుల తో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మొఘల్ పుర హరిబౌలి రైఫాయం స్కూల్ 5 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది.

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు..!

        


 తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది. మే 18 అంటే శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మెదక్ మినహా మిగతా జిల్లాల్లో వానలు పడే అకాశం ఉందని వివరించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మే 16న మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సూర్యాపేట మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ పేర్కొంది. లోక్సభ ఎన్నికలు 2024 నియోజకవర్గాలు | అభ్యర్థులు | ఎన్నికల తేదీలు ఏపీపై వారణాశిలో జోస్యం చెప్పిన చంద్రబాబు శనివారం నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, కొత్తగూడెం, భువనగిరి, మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల్, వనపర్తి, ఖానాంబ గద్వాల్, వనపర్తి, ఎన్. కొత్తగూడెంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. Rains Alert.. రానున్న ఐదు రోజులపాటు వర్షాలు.. ఆ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు | Oneindia Telugu తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మం జిల్లాలో 32.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. హైదరాబాద్, బండ్లగూడలో గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. IMD హైదరాబాద్ అంచనా వేసిన వర్షపాతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతను మరింత తగ్గించే అవకాశం ఉందని తెలిపింది.

RTO: దేశవ్యాప్తంగా బైక్ కారు ఉన్నవారికి చేదు వార్త! RTO కొత్త నిర్ణయం, HSRP పెట్టని వారికి కష్టాలు


 

RTO: దేశవ్యాప్తంగా బైక్ కారు ఉన్నవారికి చేదు వార్త! RTO కొత్త నిర్ణయం, HSRP పెట్టని వారికి కష్టాలు

RTO: దేశవ్యాప్తంగా బైక్ కారు ఉన్నవారికి చేదు వార్త! RTO కొత్త నిర్ణయం, HSRP పెట్టని వారికి కష్టాలు                                                   polution Checks at Petrol Pumps: నేడు నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిపోయిందని, రవాణా శాఖ కూడా ఈ విషయాన్ని గుర్తించి కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచినా.. నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసుల కళ్లుగప్పి వాహనాలు నడుపుతున్న దృశ్యాలు ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పుడు నిబంధనను మరింత కఠినతరం చేశారు.

పెనాల్టీ చెల్లించాలి

కొందరు వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డు పక్కన పుట్ బాత్ చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి రూ.10,000 జరిమానా విధించనున్నారు. జరిమానాలతో పాటు వాహనాలను కూడా సీజ్ చేస్తారు.

దీనికి కూడా జరిమానా విధిస్తారు

అలాగే, కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోలు పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీసు ఇచ్చింది. PUC) అదే విధంగా, సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే, రూ 10,000 జరిమానా విధించబడుతుంది.

HSRP కూడా తనిఖీ చేయవచ్చు

అదేవిధంగా ఈరోజు వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీని తప్పనిసరి చేసింది రవాణాశాఖ. జూన్ 1 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పి అమలుపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచుతారు, దీనికి మే 31 వరకు అనుమతి ఉంటుంది. పెట్రోల్ బంకులోనూ తనిఖీ చేసే అవకాశం ఉంది.

తప్పనిసరి సంస్థాపన చేయండి

కాబట్టి, ప్రభుత్వ ఆదేశం ప్రకారం, 2019 లోపు వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా ఈ నంబర్ ప్లేట్‌ను పొందాలని మీరు ద్విచక్ర వాహనం లేదా త్రిచక్ర వాహనం నడుపుతున్నట్లయితే, డ్రైవర్ల భద్రత కోసం ఈ నిబంధనను అమలు చేశారు. ట్రాక్టర్‌కు రూ.2వేలు, పెద్ద వాహనాలకు రూ.5వేలు జరిమానా విధిస్తారు.