Saturday, 29 July 2023

NLG: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణన్

NLG: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణన్

కేతేపల్లి : మూసీ ప్రాజెక్ట్ ఎగువన ఉన్న హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తన్న భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తాతో కలిసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు

   
: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణనఅలాగే మూసీ ప్రాజెక్ట్ కు వస్తున్న ఇన్ ప్లో, అవుట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో మూసీ ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా ప్రాజెక్టుకు వస్తున్న భారీ వరదల కారణంగా అధికారులు ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ 8 క్రస్టు గేట్లను ఏడు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా మూసీ ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ మూసీ ప్రవాహంలోకి దిగకూడదని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

No comments:

Post a Comment