💥 *ఘనంగా
అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు!!*💥
*నూతన కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం*
*ఆర్యవైశ్య జాతి సంక్షేమానికి, భారాస ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..*
ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన,హోటల్ ఎస్.వి.ఎమ్ గ్రాండ్, నందు *అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐవిఎఫ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు మరియు నూతన అధ్యక్షుడు మరియు కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు,అశోక్ అగర్వాల్ గారు, IVF సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గారు, మరియు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు , జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు వేడుకలలో.. పాల్గొనడం జరిగింది.* వారి ఆధ్వర్యంలో IVF తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడు చింతల రవికుమార్, మరియు కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.పాల్గొన్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకి సంబంధించి అన్ని విభాగాలు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మరియు అన్ని జిల్లాల కమిటిలు ,డివిజన్ కమిటీ, మండల కమిటీ,యూత్ కమిటీ మహిళా కమిటీ నూతన అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
తదుపరి ఈ సందర్భంగా IVF జిల్లాల అధ్యక్షులు, పలువురు సభ్యులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో.. భాగంగా కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
*ఈ సందర్భంగా IVF నేషనల్ ప్రెసిడెంట్ అశోక్ అగర్వాల్ గారు మాట్లాడుతూ..* IVF -అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20 దేశాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, IAS చదువుతున్న పేద ఆర్యవైశ్యు లకు ఇప్పటికే 26 మంది కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూప కర్త రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు కూడా దేశ వ్యాప్తంగా చేపడుతున్నామని అన్నారు.సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లోనే ఆర్యవైశ్యులను న్యాయం జరిగింది. వారిని గుర్తించి, వారికి ప్రాధాన్యం ఇచ్చింది సీఎం కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే అని అన్నారు.రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు మంచి పదవులు ఇచ్చారని అన్నారు.
*తదనంతరం ఈ సందర్భంగా...తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ...* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో..జరుగుతున్న కార్యక్రమాలకు సభ్యులు అందరూ ప్రతిసంవత్సరం వార్షికోత్సవాలలో స్వచ్ఛందంగా పాల్గొని,భాగస్వాములు కావడం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరం అన్నారు సామాజిక సేవలో..ఆర్యవైశ్యులు ముందు ఉండాలి. ఆర్య వైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని,ఇకముందు కూడా అలాగే ఉండాలని అన్నారు. 33 జిల్లాల్లో IVF బలోపేతం చేసేందుకు నాయకులు, యువత సన్నద్ధం కావాలని, ఆర్యవైశ్యులు కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే IVF ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రిలిమినరీ పాస్ అయి, IAS చదువుతున్న 26 మంది కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.అన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని ప్రాంతాలలో,ఉన్న పేద ఆర్యవైశ్యులకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని అన్నారు.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య జాతికి గుర్తింపు, గౌరవం దక్కింది. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఇచ్చింది. న్యాయం చేసింది, సీఎం కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే.. ఉప్పల్ భాగాయత్ లో 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారని రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు.ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అన్నారని గుర్తుచేశారు.అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుంది అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింది.సీఎం కేసీఆర్ గారి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది. అన్నారు.తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతున్నది.ఆర్యవైశ్య పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఆసరా పథకం, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, లాంటి పతకాలు అమలు చేయడం జరుగుతుంది అన్నారు.*సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో* రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. గతంలో పవర్ హాలిడేస్, కరెంట్ కోతలు ఉండేవి. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తూ రాష్ట్రంలో వర్తక వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు.
*ఈ కార్యక్రమంలో..* IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, IVF ప్రథమ మహిళ ఉప్పల స్వప్న, IVF స్టేట్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా IVF తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్,తెలంగాణ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొల్పురి నరేష్ గుప్త , IVF రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజినీకాంత్, IVF జనగం జిల్లా అధ్యక్షుడు బిజ్జాల నవీన్ మరియు మహిళా అడ్వైసర్ కమిటీ సభ్యులు మరియు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు రెండు జంట నగరాలు మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు అని విభాగాల సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment