ప్రతి ఉద్యోగి బాధ్యతయుతంగా పనిచేయాలి..
మునిసిపల్ చైర్మన్ *మందడి సైదిరెడ్డి*
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని మునిసిపల్ చైర్మన్ మున్సిపల్ సిబ్బందిని ఉద్దేశించి అన్నారు.
ఆయన పట్టణ పరిధిలోని శేషమ్మ గూడెం వద్ద ఉన్న డంపింగ్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పనిచేసే ఉద్యోగుల పనితీరును, చెత్త సేకరణ వంటి వివరాలపై ఆరా తీశారు. చెత్తను తీసుకొచ్చే వాహన డ్రైవర్లు విధిగా రెండు ట్రిప్పులు తీసుకురావాలని సూచించారు. లేదంటే శా
ఖ పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రతి ఒక్కరూ విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని అన్నారు. కాగా ఆయన వెంట శానటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్ ,సిబ్బంది తదితరులు ఉన్నారు...
No comments:
Post a Comment