G Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని నియమించారు. ఆ పోస్టు నుంచి బండి సంజయ్‌ను తప్పించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను ఆ పార్టీ మార్చింది. ఏపీకి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా ప్రకటించారు. రాజస్థాన్‌కు గజేంద్ర సింగ్ షెకావత్ ఆ బాధ్యతల్ని నిర్వర్తిస్తారు.
న్యూఢిల్లీ: ఎంపీ బండి సంజయ్‌కు బ్రేక్ వేసింది ఆ పార్టీ అధిష్టానం. ఆయనపై కొన్నాళ్లుగా వినిపిస్తున్న విమర్శలు నిజం అయ్యాయి. దీంతో బండిపై బీజేపీ వేటు వేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సంజయ్‌ను తొలగించింది. కొత్తగా ఆ అధ్యక్ష బాధ్యతలను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి(G Kishan Reddy)కి అప్పగించారు. ఇటీవల బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఈటెల వర్గం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. గడిచిన కొన్ని రోజుల నుంచి బండికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బండి అడ్డగోలుగా సంపాదిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక ఇతర రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షుల్ని మార్చింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా డీ.పురంధేశ్వరిని నియమించారు. జార్ఖండ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సీఎం బాబూలాల్ మరాండీకి దక్కాయి. ఇక పంజాబ్ అధ్యక్షుడిగా సునిల్ జక్కర్‌ను నియమించారు. రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను నియమించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను .. తెలంగాణ బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని .. జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇంచార్జీలతో ఏడవ తేదీన బీజేపీ అధిష్టానం భేటీ నిర్వహిస్తోంది. 5 రేపు ఉదయం 10.30 నిమిషాలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
No comments:
Post a Comment