Wednesday, 5 July 2023

--పాలన విభాగం (DPO)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ బదిలీ పైన వెళ్తున్న అధికారినికి ఘనంగా వీడ్కోలు: జిల్లా యస్.పి కె.అపూర్వ రావు

 --పాలన విభాగం (DPO)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తూ బదిలీ పైన వెళ్తున్న అధికారినికి ఘనంగా వీడ్కోలు

 --నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన జి.శ్రీనివా

 జిల్లా యస్.పి కె.అపూర్వ రావు ఐ.పి.యస్ 




    జిల్లా పోలీస్ పాలన విభాగం (DPO) లో గత నాలుగు సంవత్సరాలుగా ఏ. ఓ గా పని చేస్తూ 12వ బెటాలియన్ అన్నపర్తి కి  బదిలీ పైన  వెళ్తున్న శ్రీమతి ఆర్.మంజు భార్గవి గారిని  జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి గారు వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా పూలమాల, శాలువాతో సత్కరించి  ఆమె చేసిన విధులను కొనియాడారు. ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ ప్రభుత్వ  ఉద్యోగంలో  అధికారులకి, సిబ్బందికి బదిలీలు అనేది సహజం. పని చేసిన చోట ఉత్తమ ప్రతిభ కనబరిచి అందరి మన్నలను  పొందాలని మునుముందు ఆయురారోగ్యాలతో ఉంటూ అనేక పదోన్నతులు పొందాలని అన్నారు.


     నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ గారు  కరీంనగర్ పిటిసి నందు విధులు నిర్వర్తిస్తూ నల్లగొండ (DPO) పాలన విభాగంలో AO గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్వాగతం తెలియజేయడం జరిగింది.


     ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు, సూపర్దెంట్లు దయాకర్, షబ్బీర్,సబితా, సిఐలు పి.యన్.డి ప్రసాద్,జితేందర్ రెడ్డి, శ్రీను, కొండల్ రెడ్డి, ఆర్ ఐ లు స్పర్జన్ రాజ్,హరిబాబు,కృష్ణా రావు,నరసింహ,పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, DPO సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment