Thursday, 13 July 2023

సమస్యల సాధనకై ఐక్య పోరు

 సమస్యల సాధనకై ఐక్య పోరు



అల్లం దృష్టికి చిన్న పత్రికల సమస్యలు


హైదరాబాద్, ప్రతినిధి :


సమస్యల సాధనకై ఐక్య పోరుకు నడుంబిగించారు. ఆరేళ్లుగా నెలకొన్న అప్ గ్రేడ్ ప్రక్రియ, కొత్త ఎంపానల్ మెంట్, పెండింగ్ బిల్లుల మంజూరు, ఇళ్ల స్థలాల తదితర అంశాలపై చర్చ జరిగింది. యూనియన్లకు అతీతంగా అంతా ఏకమై మీడియా అకాడమీ చైర్మన్ 

అల్లం నారాయణ దృష్టికి తీసుక రావడం జరిగింది. తెలంగాణలో చిన్న పత్రికలు నడుపుతున్న ఎడిటర్లందరూ ఒకే వేదిక పైకి వచ్చి కలిసి పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ చిన్న పత్రికల జాక్ అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ చిన్న పత్రికల ఎడిటర్లు సమావేశం అయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఆయా పత్రికల ఎడిటర్లు ... జాక్ ఏర్పాటు చేయడంపై సమ్మతాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆయా సంఘాల ప్రతినిధులు యూసుఫ్ బాబు, మాతంగి దాస్, మహేష్ గౌడ్, నసీరుద్దీన్, తాటికొండ కృష్ణ, బాలకృష్ణ దోనేటి, దయానంద్ కోటగిరి చంద్రశేఖర్ తదితరుల నేతృత్వంలో జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చిన్నపత్రికల అప్ గ్రేడేషన్, అడ్వర్టైజ్మెంట్ బిల్లుల చెల్లింపు, అక్రిడేషన్లు తదితరాంశాలపై ఈ సమావేశంలో పాల్గొన్న ఎడిటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి త్వరలో ఎన్నికలు రానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం ఏకతాటి పైకి వచ్చి న్యాయ సమ్మతమైన పోరాటం చేయాలని సమావేశం తీర్మానించింది. సూర్యాపేటకు ఈనెల 24న సీఎం కేసీఆర్ హాజరు కానున్న దృష్ట్యా  కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించింది. సీఎం కేసిఆర్ తోనే చిన్న పత్రికల సమస్యలకు మోక్షం కల్గనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాక్ ద్వారానే చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదురు కొంటున్న సమస్యలు పరిష్కారం కాగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం వెలిబుచ్చింది. భవిష్యత్ కార్యక్రమాలలో కూడా ఇదే స్పూర్తిని కనపరుస్తూ పోరాట కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎడిటర్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కొత్త జీవో వస్తుందని మభ్యపెట్టిన ఐ అండ్ పిఆర్ అధికారులు ఇకనైనా పాత జీవో ప్రకారమే చిన్న పత్రికల అప్ గ్రేడేషన్ చేయాలని చిన్న పత్రికల జాక్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.

No comments:

Post a Comment