తెలంగాణలో నేడు విద్యాసంస్థల బంద్.. కారణం ఏంటంటే..?
Telangana Schools Bandh: తెలంగాణలో విద్యారంగంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పేరుకుపోతున్నాయని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చర్యలు శూన్యమని..
ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా.. విద్యార్థులందరికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల చదువులు చెప్పే టీచర్లు లేక.. మరికొన్ని చోట్ల మౌళిక సదుపాయాలు లేవని పేర్కొంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు లేవని… మధ్యాహ్న భోజనం బిల్లుల పెండింగ్ వంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే బంద్ కు పిలుపునిచ్చినట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు AISF, SFI, AIDSU, PDSU తెలిపాయి.
కాగా.. వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్ కు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ మద్ధతు తెలిపింది. అందరి అభిప్రాయాల సేకరణ తర్వాత బంద్ కు మద్ధతు తెలపాని నిర్ణయం తీసుకున్నట్లు TRSMA అధ్యక్షుడు శేఖర్ రావు ప్రకటించారు.
No comments:
Post a Comment