*వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి*
వైశ్య వికాస వేదిక డిమాండ్
హైదరాబాద్ : వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ లో ఏ బి సి డి కేటగిరీలు చేయాలని వైశ్య వికాస వేదిక డిమాండ్ చేసింది. నేడు వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో *వైశ్యులు- ఆత్మగౌరవం... హక్కుల సాధన* అంశంపై చర్చ గోష్టి జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా జర్నలిస్టులు, టీచర్లు, అడ్వకేట్లు హాజరై ఈ గోష్టిలో వైశ్యుల ఆత్మగౌరవం, హక్కులు, రాజకీయ వాటాలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ గోష్టికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ, కోశాధికారి కల్వ సుజాత అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేధోమధనం జరిగింది. వైశ్యుల ఆత్మగౌరవ గౌరవం కోసం సభఏడు తీర్మానాలను ఆమోదించింది. 1.వైశ్య కమిషన్ ఏర్పాటు, 2.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ, 3.జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా , 4.వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు 5.వైశ్య విద్యార్థుల కోసం ప్రత్యేక విదేశీ విద్యానిధి పథకం ఏర్పాటు, 6.వైశ్య బంధు పథకం 7.వైశ్యుల జనసంఖ్య ఆర్థిక సామాజిక స్థితిగతులపై సమగ్ర కుటుంబ సర్వే లోని వివరాలు ప్రకటించాలన్న తీర్మానాలను సభ్యుల హర్షద్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ అంశాలపై తదుపరి కార్యాచరణను రెండు వారాల్లో ప్రకటిస్తామని కాచం సత్యనారాయణ గుప్త తెలిపారు కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక ట్రస్టు సభ్యులు నెలంట్టి మధు.నంగునూరు రమేష్, వనపర్తి కిషన్ గుప్తా.కాచం సాయి, బల్లు చంద్రప్రకాష్, పబ్బ శ్రీనివాస్, బుక్కా ఈశ్వరయ్య, కొడుమూరి దయాకర్, మేడం బాలకృష్ణ, కేవీ ప్రతాప్, ప్రేమ్ గాంధీ. మా శెట్టి అనంత రాములు కాచం శేఖరే. వందనపు అర్థం శ్రీనివాస్ కురా రమేష్ రాంబాబు కాచం శ్రీనివాస్. కొత్త రవి. చందుగుప్తా. సూరిశెట్టి సురేష్ .రమేష్ .రాజు దాచేపల్లి రమేష్త.దితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment