*అయ్యప్పస్వామి దేవాలయంలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 రోజుల పాటు జరిగే ఉత్సవాలని ప్రారంభించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్
శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు.*
ఈరోజు హైదరాబాద్ లోని ఖర్మన్ ఘాట్ లో *షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 రోజుల పాటు జరిగే ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా IVF - అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మరియు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు* పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి, తదుపరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గోమాత కు ప్రత్యేక పూజలు చేశారు, అంతకుముందు ఆలయ టెంపుల్ చైర్మన్ , ట్రస్ట్ మెంబెర్స్ స్వాగతం పలికినారు, ఆ తర్వాత ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా వారిని ఆలయ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు కలిసి వారిని ఘనంగా సన్మానించారు.
*తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మాట్లాడుతూ..* అయ్యప్పస్వామి దేవాలయం సిల్వర్ జూబ్లీ సందర్భంగా 25 రోజుల పాటు జరిగే ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా దర్శనం కోసం, స్వామి వారి ఆశీస్సులు పొందడం కోసం ఈరోజు రావడం జరిగింది. ఈరోజు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు నుంచి 25 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. *తెలంగాణ రాష్ర్టంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు* నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర ప్రజలు అంతా సంతోషం గా ఉండాలని రైతులు పాడి పంటలతో విలసిల్లాలని అంతా ఆనందంగా వుండాలని ప్రజలు అందరినీ దీవించాలని కోరుకున్నట్లు తెలిపారు.
*ఈ కార్యక్రమంలో..* కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి, మల్లయ్య గుప్త, IVF అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సంబు పాండు, అల్లాడి శ్రీనివాస్, నిర్వాహకులు శ్యామ్ సుందర్ యాదవ్, ఆర్యవైశ్య ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment