ఓ వ్యక్తి తన ఇంటికి ఉన్న ఎలక్ట్రికల్ కనెక్షన్ను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ గా మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.6వేలు స్వాధీనం చేసుకున్నారు. తార్నాకలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లాలాగూడలోని టీఎస్ఎస్పీ డీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయ పరిధిలో వెంకటేశ్వర్లు లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇదే ప్రాంతంలో నివాసముండే మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటికి ఇంతకు ముందు అమర్చిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ను కమర్షియల్ కెటగిరీ నుంచి డొమెస్టిక్ గా మార్చాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును కొంత కాలంగా లైన్ ఇన్స్పెక్టర్ పెండింగులో పెట్టాడు. దీనిపై బాధితుడు లైన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును కలువగా డొమెస్టిక్ కేటగిరికి మార్చేందుకు రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఏసీబీ అధికారుల సూచన మేరకు వారు అందజేసిన నోట్లను బాధితుడు బుధవారం లాలాగూడలోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్ కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.6 వేలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు
లైన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.
No comments:
Post a Comment