Monday, 31 July 2023

జిల్లా కలెక్టర్ గా శ్రీ అర్.వి. కర్ణన్ IAS మర్యాద పూర్వకంగా

 *నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా కలెక్టర్ గా శ్రీ అర్.వి. కర్ణన్ IAS గారు నూతన  బాధ్యతలు చేపట్టిన సందర్భంగా  జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వ రావు IPS గారు మర్యాద పూర్వకంగా


కలెక్టర్ కార్యాలయంలో కలిసి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*

వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష

 కరీంనగర్ (నీలగిరి శంఖారావం


) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం నాయకులు నిరాహార దీక్షకు దిగారు. సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ లో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు మాట్లాడుతూ… 2018 ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

Sunday, 30 July 2023

టీటీడీ చైర్మన్ పదవి కోసం వైసీపీలో ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 టీటీడీ చైర్మన్ పదవి కోసం వైసీపీలో ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.


 :  టీటీడీ చైర్మన్ రేసులో మరో ఇద్దరు - జగన్ మొగ్గు  ఎవరి వైపు ?

టీటీడీ చైర్మన్ రేసులో మరో ఇద్దరు - జగన్ మొగ్గు ఎవరి వైపు ?


Who is Next TTD chairman :   తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి ఆధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు  సీఎం జగన్. తర్వాత కొనసాగించారు. వచ్చే నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును  నియమించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ సారి బీసీ వర్గాలకు ఇస్తారని ప్రచారం  

అన్ని కీలక పదవులు ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారని కొంత కాలంగా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి  ఈ సారి టీటీడీ చైర్మన్ పోస్టును  బీసీ వర్గాలకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోదంి. పల్నాడు జిల్లాకు చెందిన  బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పేరును దాదాపుగాఖరారు చేశారని అంటున్నారు. 


తమకు చాన్సివ్వాలని ఒత్తిడి తెస్తున్న ఇద్దరు చిత్తూరు నేతలు  



అయితే తాము ఎన్నికల నుంచి  రిటైర్మెంట్ తీసుకున్నామని తమకు చాన్సివ్వాలని  సీఎం జగన్‌పై ఇద్దరు వైసపీ సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుల ఒకరు చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడ్ని రంగంలోకి దించుతున్నారు. చెవిరెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తుడా ఛైర్మన్ హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కొనసాగతున్నారు. వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు పోటీ చేయటం దాదాపు ఖాయమైంది.   పార్టీ పని కోసం ఆయనను జగన్ ఆయనను పోటీ నుంచి విరమించుకోవాలని సూచించారు. చాలాసార్లు టీటీడీ  బోర్డు సభ్యునిగా..ఉన్నప్పటికీ చైర్మన్ గా చేయాలనేది  చెవిరెడ్డి లక్ష్యం. అందకే  సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. 


రేసులోకి భూమన కరుణాకర్ రెడ్డి కూడా !


టీటీడీ చైర్మన్ రేసులోకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా వచ్చారు. సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి..  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతంలో భూమన ఓ సారి టీటీడీ చైర్మన్ గా చేశారు. ఈ ముగ్గురిలో సీఎం జగన్ ఎవరికి ఎంపిక చేసుకుంటారన్నది మరో వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత బోర్డు పదవి కాలం వచ్చే నెల పదో తేదీతో ముగుస్తుంది

*జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్.వి. కర్ణన్*

  *జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన  ఆర్.వి. కర్ణన్*




నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా అర్.వి. కర్ణన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా  కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అర్.వి. కర్ణన్ నల్గొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయిన సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఈ.వి.యం.ల ప్రదర్శన కేంద్రం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు

నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వికరించిన జిల్లా కలెక్టర్ ను జిల్లా అధికారులు జడ్.పి.సి. ఈ.ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.అర్.డి. ఓ  కాళిందిని,డి.పి. ఓ విష్ణువర్ధన్ రెడ్డి,డి.ఎస్.ఓ     వెంకటేశ్వర్లు,డి.పి.అర్. ఓ.పి.  శ్రీనివాస్,ఎస్.సి.కార్పొరేషన్ ఈ.డి.ఎల్.
శ్రీనివాస్,గనులు,భూగర్భ శాఖ ఏ .డి.వెంకటేశ్వర్ రావు,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ. డి.శ్రీనివాసులు,జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీ లాల్. సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసారు.  

తెలంగాణ సీఐడీ ఎస్పీపై కేసు నమోదు - లైంగికంగా వేధించారని మహిళా ఉద్యోగి ఫిర్యాదు!

 తెలంగాణ సీఐడీ ఎస్పీపై కేసు నమోదు - లైంగికంగా వేధించారని మహిళా ఉద్యోగి ఫిర్యాదు!


Case on CID SP: మహిళను వేధిస్తున్న కేసులో తెలంగాణ సీఐడీ ఎస్పీపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  

: తెలంగాణలో ఓ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు నమోదైంది. టీఎస్ఎస్పీడీసీఎల్ లో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ అయిన మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. 


మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రోజూ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా.. ఆ ఎస్పీ తనను వేధించడం మొదలు పెట్టినట్లు మహిళ ఆరోపించారు. పోలీసు అయి ఉండి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ చైతన్య పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 


అసలేం జరిగిందంటే..?


మహిళ ఫిర్యాదు మేరకు.. ఎల్బీ నగర్ పరిధిలో ఉంటున్న సీఐడీ ఎస్పీకి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ శాఖకు చెందిన మహిళా ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ఆయన లైంగికంగా వేధించడం మొదలు పెట్టారని మహిళ చెబుతోంది. తనతో చనువుగా ఉండాలని మెసేజ్ లు పెట్టేవారని.. మానసికంగా చాలా వేధింపులకు గురి చేశారని చెబుతోంది. ఇది పద్ధతి కాదని తాను ఎన్నిసార్లు చెప్పినా అతడు వినకపోవడంతో.. షీ టీమ్స్ ను ఆశ్రయించినట్లు తెలిపింది. వారి సూచన మేరకు చైతన్యపురి పీఎస్ లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సీఐడీ ఎస్పీపై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Saturday, 29 July 2023

ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC అదిరిపోయే ఆఫర్.. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా

 

*ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి.. IRCTC అదిరిపోయే ఆఫర్.. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా


*!

*IRCTC Package*: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. అక్కడికి వెళ్లేందుకు చాలా ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

*IRCTC Tour Package*: తిరుమలలో వెలసిన శ్రీనివాసుడి దర్శనం కోసం ఎందరో భక్తులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుంటారు. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. తిరుమల ప్రయాణమంటే మాటలా? అన్నీ పకడ్బందీగా ముందే ఏర్పాటు చేసుకోవాలి. దర్శనంతో పాటు ప్రయాణ టికెట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అలాంటి వారి కోసం రెండ్రోజుల్లోనే శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని.. తిరుగు ప్రయాణం అయ్యేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక ప్యాకేజీ తీసుకొచ్చింది. దర్శన టికెట్ల కోసం చింతించాల్సిన పని లేకుండా.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు.

విమాన ప్రయాణమే కాబట్టి కేవలం రెండే రోజుల్లో తిరుపతి వెళ్లి తిరిగి హైదరాబాద్ కూడా చేరుకోవచ్చు. తిరుమల సహా చుట్టు పక్కల పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. మీరు ఒకవేళ ఇప్పుడు తిరుపతి ప్రయాణానిని సిద్ధమవుతుంటే.. ఈ ప్యాకేజీపై లుక్కేయండి మరి.

*తిరుపతి బాలాజీ దర్శనం* (Tirupati Balaji Darshnam) పేరిట IRCTC ఈ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆగస్టు 1 నుంచి ఈ యాత్ర స్టార్ట్ అవుతుంది. రెండే రోజుల్లో స్వామి వారి దర్శనం ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. తిరుపతి మాత్రమే కాకుండా కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో అయితే 1,3, 8,10, 17,22 తేదీలు.. అలాగే సెప్టెంబర్ 12,26; అక్టోబర్‌లో 3,5, 1, 12, 31 తేదీల్లో ఈ యాత్ర ఉంటుంది. ఆగస్టు 1,10 తేదీల్లో ప్రయాణానికి టికెట్లను యాత్రికులు ఇప్పటికే పూర్తిగా కొనుగోలు చేశారు. మిగతా తేదీల్లో అయితే ప్రయాణ సమయానికి అనుగుణంగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

*జర్నీ ఎలాగంటే*?

హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు విమానం (6E- 2005) బయల్దేరుతుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు అంటే గంటలోనే తిరుపతి ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు ఆలయలు సందర్శించుకుంటారు. సాయంత్రానికి ముందుగా మీకోసం ఏర్పాటు చేసిన హోటల్ చేరుకుంటారు. రాత్రి భోజనం అక్కడే ఉంటుంది.

రెండో రోజు పొద్దున్నే అల్పాహారం తీసుకున్న తర్వాత కొండపైకి చేరుకుంటారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత భోజనం చేసి శ్రీకాళహస్తికి వెళ్తారు. అక్కడ ఆలయ దర్శనం తర్వాత తిరుపతి విమానశ్రయానికి మళ్లీ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకోవడానికి 6E-267 విమానం ఎక్కడంతో మీ యాత్ర పూర్తవుతుంది.

*ప్యాకేజీ వివరాలు ఇలా*.. (టికెట్ రేటు ఒక్కొక్కరికి)

సింగిల్ షేరింగ్ - రూ. 16,330
ఇద్దరికి షేరింగ్ - రూ .14,645
ట్రిపుల్ ఆక్యుపెన్సీ - రూ. 14,550
ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ. 13,740, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 13,490 చెల్లించాలి.
రెండేళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల కోసం రూ. 1500 వరకు ఎయిర్‌పోర్టులో చెల్లించాలి.

*ప్యాకేజీలో ఏమేం ఉంటాయి*..

హైదరాబాద్- తిరుపతి- హైదరాబాద్ విమాన టికెట్లు (పోను రానూ అన్నమాట)
తిరుపతి ఒక రాత్రి బస చేసేందుకు ఏసీ హోటల్ రూం
మొదటి రోజు రాత్రి భోజనం, రెండో రోజు పొద్దున అల్పాహారం, మధ్యాహ్న భోజనం
ఒక చోటు నుంచి మరో చోటుకు ఏసీ బస్సు ప్రయాణం
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు తిరుచానూర్, శ్రీకాళహస్తి కాణిపాకం, శ్రీనివాస మంగాపురం దర్శనాలు వంటివి ఈ ప్యాకేజీలో భాగంగానే ఉంటాయి.
యాత్రికులకు గైడ్ సహా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

*ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సినవి ఇవే*..

ప్రయాణానికి 2 గంటలు ముందుగానే భక్తులంతా విమానశ్రయానికి చేరుకోవాలి.
పర్యటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీ వంటివి ఎవరివి వారే చెల్లించాలి.
ఫ్లైట్ టికెట్ ధర ఒకవేళ పెరిగితే ప్రయాణికులే చెల్లించాలి.
12 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం లడ్డూ ప్రసాదం ఉండదు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలంటే స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలి.
ఏ కారణంతోనైనా 21 రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. టికెట్‌పై 30 శాతం మీ టికెట్ రేటు నుంచి మినహాయిస్తారు. 21-15 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 55 శాతం, 14-08 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 80 శాతం మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. Cholesterol 7 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే తిరిగి చెల్లించరు.
ఇంకా ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం IRCTC Tourism వెబ్‌సైట్ సందర్శించండి.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా:రాయల ఈశ్వరి

 *🌹తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం ఉపాధ్యక్షురాలుగా నియమించబడిన రాయల ఈశ్వరి


గారికి శుభాకాంక్షలు -  అభినందనలు💐💐*



వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి*

 *వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి*

 వైశ్య వికాస వేదిక డిమాండ్


 హైదరాబాద్ : వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్ లో ఏ బి సి డి కేటగిరీలు చేయాలని వైశ్య వికాస వేదిక డిమాండ్ చేసింది. నేడు  వేదిక వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ లయన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో *వైశ్యులు- ఆత్మగౌరవం... హక్కుల సాధన* అంశంపై చర్చ గోష్టి జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా జర్నలిస్టులు, టీచర్లు, అడ్వకేట్లు హాజరై ఈ గోష్టిలో వైశ్యుల ఆత్మగౌరవం, హక్కులు, రాజకీయ  వాటాలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ గోష్టికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలు ఉప్పల శారద, ప్రధాన కార్యదర్శి కాచం సుష్మ, కోశాధికారి కల్వ సుజాత అతిధులుగా హాజరైన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేధోమధనం జరిగింది. వైశ్యుల ఆత్మగౌరవ గౌరవం కోసం సభఏడు తీర్మానాలను ఆమోదించింది. 1.వైశ్య కమిషన్ ఏర్పాటు, 2.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ, 3.జనాభా దామాషా ప్రకారం రాజకీయ వాటా , 4.వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు  5.వైశ్య విద్యార్థుల కోసం ప్రత్యేక విదేశీ విద్యానిధి పథకం ఏర్పాటు, 6.వైశ్య బంధు పథకం 7.వైశ్యుల జనసంఖ్య ఆర్థిక సామాజిక స్థితిగతులపై సమగ్ర కుటుంబ సర్వే లోని వివరాలు ప్రకటించాలన్న తీర్మానాలను సభ్యుల హర్షద్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ అంశాలపై తదుపరి కార్యాచరణను రెండు వారాల్లో ప్రకటిస్తామని కాచం సత్యనారాయణ గుప్త తెలిపారు కార్యక్రమంలో వైశ్య వికాస వేదిక ట్రస్టు సభ్యులు నెలంట్టి మధు.నంగునూరు రమేష్,  వనపర్తి కిషన్ గుప్తా.కాచం సాయి, బల్లు చంద్రప్రకాష్, పబ్బ శ్రీనివాస్, బుక్కా ఈశ్వరయ్య, కొడుమూరి దయాకర్, మేడం బాలకృష్ణ, కేవీ ప్రతాప్, ప్రేమ్ గాంధీ. మా శెట్టి అనంత రాములు కాచం శేఖరే. వందనపు అర్థం శ్రీనివాస్ కురా రమేష్ రాంబాబు కాచం శ్రీనివాస్. కొత్త రవి. చందుగుప్తా. సూరిశెట్టి సురేష్ .రమేష్ .రాజు దాచేపల్లి రమేష్త.దితరులు పాల్గొన్నారు.










NLG: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణన్

NLG: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణన్

కేతేపల్లి : మూసీ ప్రాజెక్ట్ ఎగువన ఉన్న హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తన్న భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తాతో కలిసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు

   
: మూసీ ప్రాజెక్టుకు భారీ వరదపై అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కర్ణనఅలాగే మూసీ ప్రాజెక్ట్ కు వస్తున్న ఇన్ ప్లో, అవుట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో మూసీ ప్రాజెక్టుకు వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా ప్రాజెక్టుకు వస్తున్న భారీ వరదల కారణంగా అధికారులు ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ 8 క్రస్టు గేట్లను ఏడు ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా మూసీ ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాల ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ మూసీ ప్రవాహంలోకి దిగకూడదని, జాలర్లు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Friday, 28 July 2023

ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి:IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.*

 *ఈరోజు ఎల్.బి.నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా..హైదరాబాద్ లోని వారి నివాసంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మర్యాద పూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించి,జన్మదిన శుభాకాంక్షలు..తెలిపిన తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ మరియు IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.*


Thursday, 27 July 2023

నల్గొండ డీపీఆర్ఓ బదిలీ

 నల్గొండ డీపీఆర్ఓ బదిలీ



నలగొండ నూతన డి పి ఆర్ గా బాధ్యతలు స్వీకరించిన పి వి రావు

అలసత్వం వలదు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి జగదీష్ రెడ్డి*



అలసత్వం వలదు అప్రమత్తంగా ఉండాలి

#వాతావరణ శాఖా హెచ్చరికలు బే ఖాతార్ చేయొద్దు

👉🏿 *మంత్రి జగదీష్ రెడ్డి*





వాతావరణ శాఖా హెచ్చరికలు ఎంత మాత్రం బే ఖాతార్ చేయవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ఏంత మాత్రం అలసత్వం వలదని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల తో నల్లగొండ జిల్లాలో ఉత్పన్నమవుతున్న పరిస్థితుల పై గురువారం సాయంత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ,మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 26 July 2023

*కళానిలయం, సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో..* జరిగిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో *ముఖ్య అతిధిగా IVF -ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త

 : హైదరాబాద్ లోని చిక్కడపల్లి, శ్రీ త్యాగరాయ గానసభలో వంశీ ఇంటర్నేషనల్ ఆశీస్సులతో *కళానిలయం, సాంస్కృతిక సంఘ సేవా సంస్థ ఆధ్వర్యంలో..* జరిగిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో *ముఖ్య అతిధిగా IVF -ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా..సినీ రంగంలో ఉత్తమ










సేవలు అందించిన పలువురు నటి, నటులకు వారి చేతుల మీదుగా అవార్డులు అందజేసి సన్మానించారు.*ముఖ్యంగా విశ్వనటచక్రవర్తి ఎస్.వి.రంగారావు గారి 105 వ జయంతి సందర్భంగా బేబీ రాణి గారికి, ఎస్.వి.రంగారావు గారి పురస్కారం ప్రధానం చేయడం జరిగింది.* తదుపరి కళా నిలయం ఆధ్వర్యంలో టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని ఘనంగా సన్మానం చేసి సీల్డ్ బహుకరించడం జరిగింది.తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

'రైళ్లలో జర్నలిస్టులకు రాయితీని పునరుద్ధరించాలి':ఎంపీ గల్లా జయదేవ్

 'రైళ్లలో జర్నలిస్టులకు రాయితీని పునరుద్ధరించాలి'


రైళ్లలో జర్నలిస్టుల రాయితీపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ 


పార్లమెంట్ లో మాట్లాడారు. కోవిడ్-19 సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్దరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. లోక్ సభ లో రూల్ 377 కింద స్పెషల్ మెన్షన్ ద్వారా ఈ విషయాన్ని  ప్రస్తావించారు. 

జర్నలిస్టులు వృత్తిరీత్యా విస్తృతంగా ప్రయాణాలు చేస్తుంటారని తెలిపారు. రాయితీ లేకపోవడం వల్ల జర్నలిస్టులపై అదనపు భారం పడతుండడంతో.. ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు.

ఏసీబీ అధికారులు లైన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 ఓ వ్యక్తి తన ఇంటికి ఉన్న ఎలక్ట్రికల్ కనెక్షన్​ను కమర్షియల్ నుంచి డొమెస్టిక్ గా మార్చేందుకు రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏబీసీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.6వేలు స్వాధీనం చేసుకున్నారు. తార్నాకలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. లాలాగూడలోని టీఎస్ఎస్పీ డీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయ పరిధిలో వెంకటేశ్వర్లు లైన్ ఇన్​స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇదే ప్రాంతంలో నివాసముండే మహ్మద్ షాహిద్ అలీ తన ఇంటికి ఇంతకు ముందు అమర్చిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ను కమర్షియల్ కెటగిరీ నుంచి డొమెస్టిక్ గా మార్చాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును కొంత కాలంగా లైన్ ఇన్​స్పెక్టర్ పెండింగులో పెట్టాడు. దీనిపై బాధితుడు లైన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును కలువగా డొమెస్టిక్ కేటగిరికి మార్చేందుకు రూ. 6వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

ఏసీబీ అధికారుల సూచన మేరకు వారు అందజేసిన నోట్లను బాధితుడు బుధవారం లాలాగూడలోని ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ కార్యాలయంలో లైన్ ఇన్స్పెక్టర్ కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ.6 వేలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు


లైన్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.

బారి వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* *జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు



*బారి వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి* 

 *జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు IPS* 

        జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు ఒక ప్రకటనలో తెలిపారు.  వర్షం వల్ల ప్రయాణ సమయంలో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కావున పరిమిత వేగంతో నడపాలి, అతివేగం వల్ల వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు.  చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కరెంటు వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని కరెంటు స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్, ముట్టుకోరాదని కోరారు.  ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్ళరాదన్నారు. నది,నీటి వాగుల్లోకి  చేపల వేటకు వెళ్లవద్దని తెలిపారు. పిల్లలను, వృద్ధులను ఒంటరిగా బయటకు పంపవద్దని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, పోలీసు శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందిని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని కోరింది.

Tuesday, 25 July 2023

నాగోల్ నూతన పోలీస్ స్టేషన్ లో CI గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న వెంకటేష్

 నాగోల్ నూతన పోలీస్ స్టేషన్ లో CI గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న వెంకటేష్


 గారు ఈరోజు హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా వారిని శాలువతో సన్మానించారు.

Sunday, 23 July 2023

మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే దీనిపై ఒక లుక్ వేయండి..

 మీ పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే దీనిపై ఒక లుక్ వేయండి..


సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందించాలనే ఉద్దేశంతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక సరికొత్త డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. ఇది మీ డబ్బును కొన్ని రోజులలోనే రెట్టింపు చేస్తుంది.

            


ప్రైవేట్ రంగ బ్యాంకులు లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోల్చితే ప్రభుత్వరంగ బ్యాంకులు డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ప్రజలలో ఉన్న ఈ నమ్మకాన్ని మార్చే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ప్రైవేట్ లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోటీగా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.


దీనికి సరైన ఉదాహరణ "ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ". దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందించాలనే ఉద్దేశంతో ఎస్బీఐ ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది.


బ్యాంకు ఇటీవలే ఈ పథకానికి సంబంధించిన వ్యాలిడిటీని సెప్టెంబర్ 30, 2023 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ "ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ" పథకాన్ని మే 2020 సంవత్సరంలో ఎస్బీఐ ప్రారంభించడం జరిగింది. దీనిని ప్రారంభించిన మొదట్లో ఈ పథకం వ్యాలిడిటీ సెప్టెంబర్, 2020 గా ఉండేది.


అయితే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేటును అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం వ్యాలిడిటీని బ్యాంకు అనేక సార్లు పొడిగించుకుంటూ వస్తుంది. ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం నెలవారీ లేదా త్రైమాసిక లేదా అర్ధ త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని చెల్లించడానికి బదులుగా మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది.


ఈ పథకంలో డిపాజిట్ చేసిన అసలు, చక్ర వడ్డీపై బ్యాంకు వడ్డీని లెక్కించి డిపాజిట్ దారులకు చెల్లిస్తుంది. ఇక ఈ పథకం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. ఈ పథకం సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించాలని భావించే వారు బ్యాంకు బ్రాంచ్ ని సందర్శించడం లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా యోనో యాప్ ద్వారా ఓపెన్ చేయవచ్చు.


ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా 10 సంవత్సరాలలో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు మీరు ఈ ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేశారని అనుకుంటే, 10 సంవత్సరాల తరువాత మీరు రూ. 10 లక్షలకు పైగా డబ్బును పొందుతారు. అంటే మీరు పెట్టిన పెట్టుబడి కేవలం పది సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

Friday, 21 July 2023

నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్రస్థాయి పురస్కారం: ఎన్వీ రఘువీర్ ప్రతాప్

 ప్రముఖ కవి, రచయిత, విమర్శలు ఎన్వీ రఘువీర్ ప్రతాప్





కు మహాకవి సి నా రే కళాపీఠం సాహిత్య సంస్కృతిక సంస్థ పద్మభూషణ్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా సి నారాయణరెడ్డి తెలంగాణ రాష్ట్రస్థాయి పురస్కారం ప్రకటించింది. తేది 30.7.2023 న ప్రేమ్ రంగా గార్డెన్స్ జెడ్ చెర్ల లో ఉదయం 10.00 గం. లకు డా నందిని సిదారెడ్డి అధ్యక్షతన, డా లక్ష్మారెడ్డి మాజీ మంత్రి వర్యులు ముఖ్య అతిధులుగా హాజరయ్యే ఈ కార్యక్రమం తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ హైదరాబాద్ సౌజన్యంతో మహాకవి సి నా రే కళా పీఠం ఆధ్వర్యంలో జరుగనున్నది. ఈ సందర్బంగా కవి రచయిత ఎన్వీ రఘువీర్ ప్రతాప్ ను పలువురు సాహితీవేత్తలు, కవులు, రచయితలు, సన్నిహితులు అభినందనలు తెలియజేశారు. కవి ఎన్వీ రఘువీర్ ప్రతాప్, సాహిత్యం లో చేసిన కృషికి గాను వివిధ ప్రక్రియలలో ఆయన వెలువరించిన అనేక గ్రంధాలకు సాహితీ ప్రముఖుల ప్రశంసలు లభించాయి.

Thursday, 20 July 2023

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మహ్మద్ తన్వీర్ గారమర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త

 * హైదరాబాద్ లోని బషీర్ బాగ్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మహ్మద్ తన్వీర్ గారు


నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా..వారిని మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసిన... తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..*

*ఈ కార్యక్రమంలో..* ఆయన వెంట గోల్డెన్ డైమండ్ మర్చంట్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ,BRS రాష్ట్ర నాయకులు తోట హరీశ్, తదితరులు ఉన్నారు.

Tuesday, 18 July 2023

జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

 హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలలో


పాల్గొన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,నల్లగొండ, సూర్యపేట,యాదాద్రి భోనగిరి జడ్ పి చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి,గుజ్జ దీపికా యుగందర్ రావు,ఎలిమినేటి సందీప్ రెడ్డి లతో పాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనమండలి సభ్యులు యం సి కోటిరెడ్డి,తక్కెళ్లపల్లి రవీందర్ రావు,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,కంచర్ల భూపాల్ రెడ్డి,ఫైళ్ల శేఖర్ రెడ్డి,రవీంద్ర నాయక్,శానంపూడి సైదిరెడ్డి,బొల్లం మల్లయ్య యాదవ్,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,ఎన్.భాస్కర్ రావు,చిరుమర్తి లింగయ్య, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,నోముల భగత్తదితరులు.

Sunday, 16 July 2023

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గా Dr. మొగుళ్ళు పల్లీ ఉపేందర్ గుప్త*సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్..govt of India

 *తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గా Dr. మొగుళ్ళు పల్లీ ఉపేందర్ గుప్త*సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్..govt of India 




తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా హైదరాబాద్ కు చెందిన *Dr. మొగుళ్ళు పల్లీ ఉపేందర్ గుప్తాను* నియమిస్తున్నట్లు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు *శ్రీ అమరావది లక్ష్మీనారాయణ గారు* తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ *మొగుళ్ళ పల్లి ఉపేందర్ గుప్తా* అహర్నిశలు ఆర్య వైశ్యుల వెన్న అంటూ ఉండి వారి అభివృద్ధికై కృషి చేస్తాడని ఆశిస్తున్నాను అన్నాడు.


ఈ సందర్భంగా *మొగుళ్ళ పల్లి ఉపేందర్ గుప్తా* కి కార్యదర్శిగా నియమిస్తున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఇరుకుల్ల రామకృష్ణ లొ శిల్పా ఆర్ట్ క్రియేషన్స్ అధినేత కపర్తి ప్రకాశ్ wgl వంగేటి అశోక్ రామిని అశోక్ సాయి Manoj పాల్గొన్నారు... ఉపేందర్ మొగుళ్ళు పల్లీ

Saturday, 15 July 2023

21న కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ...భారీ ఏర్పాట్లు

 తలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియామితులైన జి.కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది.  ఈనెల 21 న రాష్ట్ర కార్యాలయంలో 

కిషన్ రెడ్డి  అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. బీజేపీ యువ మోర్చా  ఆధ్వర్యంలో బైక్ రాలి ఏర్పాటు  చేయడంతో పాటు రాష్ట్ర కార్యాలయం వద్ద సభకు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గతంలో కిషన్ రెడ్డి  ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ లో ఒకసారి  అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు అధ్యక్షులు బాధ్యతలు తీసుకుంటే నాలుగోసారి అధ్యక్షుడిగా  రికార్డుతో పాటు దేశంలోనే ఏ రాష్ట్ర అధ్యక్షుడికి దక్కని అరుదైన అరుదైన గౌరవం కిషన్ రెడ్డికి దక్కనుంది.

Thursday, 13 July 2023

సమస్యల సాధనకై ఐక్య పోరు

 సమస్యల సాధనకై ఐక్య పోరు



అల్లం దృష్టికి చిన్న పత్రికల సమస్యలు


హైదరాబాద్, ప్రతినిధి :


సమస్యల సాధనకై ఐక్య పోరుకు నడుంబిగించారు. ఆరేళ్లుగా నెలకొన్న అప్ గ్రేడ్ ప్రక్రియ, కొత్త ఎంపానల్ మెంట్, పెండింగ్ బిల్లుల మంజూరు, ఇళ్ల స్థలాల తదితర అంశాలపై చర్చ జరిగింది. యూనియన్లకు అతీతంగా అంతా ఏకమై మీడియా అకాడమీ చైర్మన్ 

అల్లం నారాయణ దృష్టికి తీసుక రావడం జరిగింది. తెలంగాణలో చిన్న పత్రికలు నడుపుతున్న ఎడిటర్లందరూ ఒకే వేదిక పైకి వచ్చి కలిసి పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ చిన్న పత్రికల జాక్ అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ చిన్న పత్రికల ఎడిటర్లు సమావేశం అయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఆయా పత్రికల ఎడిటర్లు ... జాక్ ఏర్పాటు చేయడంపై సమ్మతాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆయా సంఘాల ప్రతినిధులు యూసుఫ్ బాబు, మాతంగి దాస్, మహేష్ గౌడ్, నసీరుద్దీన్, తాటికొండ కృష్ణ, బాలకృష్ణ దోనేటి, దయానంద్ కోటగిరి చంద్రశేఖర్ తదితరుల నేతృత్వంలో జరిగింది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చిన్నపత్రికల అప్ గ్రేడేషన్, అడ్వర్టైజ్మెంట్ బిల్లుల చెల్లింపు, అక్రిడేషన్లు తదితరాంశాలపై ఈ సమావేశంలో పాల్గొన్న ఎడిటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అతి త్వరలో ఎన్నికలు రానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం ఏకతాటి పైకి వచ్చి న్యాయ సమ్మతమైన పోరాటం చేయాలని సమావేశం తీర్మానించింది. సూర్యాపేటకు ఈనెల 24న సీఎం కేసీఆర్ హాజరు కానున్న దృష్ట్యా  కలిసి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించింది. సీఎం కేసిఆర్ తోనే చిన్న పత్రికల సమస్యలకు మోక్షం కల్గనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జాక్ ద్వారానే చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదురు కొంటున్న సమస్యలు పరిష్కారం కాగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం వెలిబుచ్చింది. భవిష్యత్ కార్యక్రమాలలో కూడా ఇదే స్పూర్తిని కనపరుస్తూ పోరాట కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎడిటర్లు స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కొత్త జీవో వస్తుందని మభ్యపెట్టిన ఐ అండ్ పిఆర్ అధికారులు ఇకనైనా పాత జీవో ప్రకారమే చిన్న పత్రికల అప్ గ్రేడేషన్ చేయాలని చిన్న పత్రికల జాక్ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.

Wednesday, 12 July 2023

ఐవియఫ్ నల్గొండ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమాదేవి ఆధ్వర్యంలో గోరింటాకుసంబరాలు






 ఆషాడ మాసం అనగానే మహిళలకు గోరింటాకు గుర్తుకు వస్తుంది.  దానిని పెద్ద పండుగలా జరిపి సంబరాలు చేస్తారు.

  అందులో భాగంగా ఐవియఫ్ నల్గొండ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమాదేవి ఆధ్వర్యంలో ఐబియఫ్ మహిళలు అంతా ఒక చోట చెరి గౌరమ్మను పూజించి గోరింటాకును రోట్లో వేసుకొని దంచి చేతులకు పెట్టుకుని ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు రమాదేవితో పాటు ప్రధాన కార్యదర్శి వందనపు జ్యోతి కోశాధికారి మందాలపు శ్రీదేవి కార్యదర్శి నల్గొండ సుమలత పూర్వ అధ్యక్షురాళ్లు ఒరుగంటి కరుణ, కర్నాటి లక్ష్మి, ఇడకుల కవిత సభ్యులు కోటగిరి రమ్యశాంతి, తాళ్లపల్లి గౌతమి తెలుకుంట్ల లహరి, నూనె నీరజ తదితరులు పాల్గొన్నారు