Wednesday, 30 April 2025

అమెరికా బోర్డర్లో పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతున్న భారతీయ తల్లితండ్రులు ? రీజన్ ఇదే..!


 అమెరికా బోర్డర్లో పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతున్న భారతీయ తల్లితండ్రులు ? రీజన్ ఇదే..!

అమెరికాలో ఓవైపు భారతీయ అక్రమ వలసల్ని స్వదేశాలకు పంపుతున్నారు. మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన విద్యార్ధుల్ని కూడా ఎక్కడ దొరికినా బహిష్కరించేందుకు ట్రంప్ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో అమెరికా సరిహద్దుల్లో భారతీయ మైనర్లు పట్టుబడుతున్న ఘటనలు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది. వివిధ కారణాలతో వీరు తల్లితండ్రులు, ఇతరుల తోడు లేకుండా ఒంటరిగా పట్టుబడుతున్నారు.

                             అమెరికాలోని మెక్సికో, కెనడా సరిహద్దుల్లో 6 నుండి 17 సంవత్సరాల వయస్సు గల భారతీయ పిల్లలు ఒంటరిగా కనిపిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ పిల్లలు తరచుగా ఒంటరిగా, భయంతో, వారి తల్లిదండ్రులను సంప్రదించే సమాచారాన్ని కలిగి ఉన్న కాగితం ముక్కతో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా -మెక్సికో సరిహద్దు వద్ద చాలా మంది మైనర్లు వ్యూహాత్మకంగా వదిలివేయబడినట్లు అధికారులు గుర్తించారు. అయితే కెనడా సరిహద్దుల్లో మాత్రం వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనికి కారణం అక్కడి సరిహద్దుల్లో కఠిన పరిస్దితులే.

        క్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 77 మంది ఇలా ఒంటరిగా కనిపించిన భారతీయ మైనర్లను అరెస్టు చేశారు. మెక్సికో సరిహద్దు వద్ద 53 మంది, కెనడా సరిహద్దు వద్ద 22 మంది, మరికొందరిని అమెరికాలో గుర్తించారు. 2022లో ఇలా 409 భారతీయ మైనర్లు దొరికారు. 2023లో ఈ సంఖ్య 730కి చేరింది. 2024 నాటికి మాత్రం 517 మందికి తగ్గింది. 2025లో ఇప్పటివరకూ 77 మంది మైనర్లు ఇలా దొరికారట. 2020లో కరోనా సమయంలో మాత్రం 219 మంది ఇలా దొరికారట.

                  2021లోనూ కేవలం 237 మంది మైనర్లు ఇలా పట్టుబడ్డారు. కోవిడ్ తర్వాత అక్రమ వలసలు పెరగడంతో ఇలా దొరికే మైనర్ల సంఖ్య కూడా పెరుగుతోందని గుర్తించారు. మైనర్లకు అనుకూలంగా ఉండే చట్టపరమైన లొసుగుల ద్వారా అమెరికా నివాసాన్ని పొందే అవకాశాలను మెరుగుపరచడానికి కుటుంబాలు ఉద్దేశపూర్వకంగా పిల్లలను ఒంటరిగా పంపుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అమెరికాలో అక్రమంగా చొరబడే సమయంలో పిల్లలు అడ్డుగా ఉన్నారని ఇలా వదిలేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు.

Tuesday, 29 April 2025

శ్రీ వాసవీ కన్యకాపరపేశ్వరి అమ్మవారి కుటుంబసభ్యల వంశవృక్షము

 శ్రీ వాసవీ కన్యకాపరపేశ్వరి అమ్మవారి కుటుంబసభ్యల వంశవృక్షము

శ్రీ వాసవీ కన్యకాపరపేశ్వరి అమ్మవారి కుటుంబసభ్యల వంశవృక్షము


శ్రీ వాసవీ దేవి జన్మస్థలం : పెనుగొండ, ప॥గో॥జిల్లా.


శ్రీ వాసవీదేవి జననము : సాధారణ నామసంవత్సరం వైశాఖ మాసం, శుద్ధ దశమి శుక్రవారం, పునర్వసు నక్షత్రం ప్రాతకాలం క్రీ॥శ॥ 1004వసం॥



శ్రీ వాసవీదేవి ఆత్మార్పణ : ప్రభవనామ సం|| మాఘశుద్ధ విదియ గురువారం, శతభిషా నక్షత్ర కర్కాట క లగ్నం సూర్యస్తమయం, క్రీ॥శ॥ 1022వ సం॥


శ్రీ కుసుమశ్రేష్ఠి గారి జననము : క్రీ॥శ॥ 960వ సం॥


శ్రీ కుసుమశ్రేష్ఠి – కుసుమాంబ అసలు పేర్లు : వాసవీ శ్రేష్ఠి కావేరి



శ్రీ వాసవీదేవి తల్లి తండ్రుల పేర్లు : వాసా కుసుమశ్రేష్ఠి కుసుమాంబ



శ్రీ వాసవీదేవి పుట్టింటి గోత్రం : పెండ్లికుల ప్రభాతస


శ్రీ వాసవీదేవి మేనత్తగారి గోత్రం : మిదునకుల (మైత్రేయస)


శ్రీ వాసవీదేవి మేనత్తగారి గోత్రం : పునగశిల (పౌలస్త్యస)


శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు.


(మూలవిరాట్)


శ్రీ కుసుమ శ్రేష్ఠిగారి అత్తగారి గ్రామం : ఆచంట


శ్రీ వాసవీదేవి తాతయ్య నానమ్మ గార్ల పేర్లు : వాసా బలదేవ శ్రేష్ఠి – భారత సామ్రాజ్యలక్ష్మి


శ్రీ వాసవీదేవి అమ్మమ్మ తాతయ్య గార్ల పేర్లు : శీమకుర్తి మార్కండేయ శ్రేష్ఠి – సుదర్శనీదేవి


శ్రీ కుసుమశ్రేష్ఠి నాయనమ్మ గారి పేరు : నాగమాంబ


శ్రీ విరూపాక్షగుప్త కుమారుని పేరు : మణిగుప్తుడు


అడపా శ్రీనివాసరావు ఊటసముద్రం


శ్రీ విరూపాక్షగుప్త అత్తమామగార్ల పేర్లు శ్రీ విరూపాక్షగుప్త అత్తగారి గ్రామం : శీమకుర్తి అరిడి శెట్టి, సుందరీదేవి : ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా


శ్రీ వాసవీదేవి మేనత్త కుమారిడి పేరు : పచ్చిపులుసు ఈశ్వరగుప్త



శ్రీ వాసవీదేవి మేనత్త మేనమామగార్లు : పచ్చిపులుసు పావనాఖ్యశ్రేష్ఠి – రుక్మవతీదేవి విష్ణువర్ధన మహారాజు జన్మస్థలం : రాజమండ్రి, తూర్పుగోదావరిజిల్లా


ఆర్యవైశ్యులు మొత్తం గోత్రాలు :714


శ్రీ వాసవీదేవితో అగ్నిగుండ ప్రవేశమైన ఆర్యవైశ్యులు : 102 గోత్రములవారు


శ్రీ వాసవి దేవితో అగ్నిగుండంలో ప్రవేశం కాకుండా పారిపోయిన గోత్రముల వారు : 612 శ్రీ వాసవీదేవి పూర్వజన్మ : కీర్తికాంత – కైలాసంలో


శ్రీ విష్ణువర్ధన మహారాజు పూర్వజన్మ : చిత్తకంఠుడు (గంధర్వలోకం – మణిపురం)


శ్రీ కుసుమశ్రేష్ఠి కుసుమాంబల పూర్వజన్మ : సోమకాంతుడు, సుశీలాదేవి

Monday, 28 April 2025

జానారెడ్డికి సీఎం రేవంత్ కీలక బాధ్యతలు- దిగ్విజయ్ రీ ఎంట్రీ..!!

 జానారెడ్డికి సీఎం రేవంత్ కీలక బాధ్యతలు- దిగ్విజయ్ రీ ఎంట్రీ..!! 



 తెలంగాణ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం లో కసరత్తు కొనసాగుతోంది. ఇటు మంత్రివర్గం- పీసీసీ విస్తరణ పైన తుది నిర్ణయం జరగలేదు. ఈ సమయంలో అనూహ్యంగా సీనియర్ నేత జానారెడ్డికి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ కీలక మంత్రాం గం చేసారు. జానారెడ్డి అనుభవం వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. కొత్త బాధ్యతలు అప్పగించారు. ఈ ఎపిసోడ్ లో కాంగ్రెస్ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. జానా తో రేవంత్ భేటీ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కీలక మంత్రాంగం చేసారు. శాంతి చర్చల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు. తాజాగా సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశం పై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం తెలిపారు. అందులో భాగంగానే శాంతి చర్చలపై సీఎం రేవంత్, జానారెడ్డి, కేకే, వేం నరేందర్ రెడ్డి చర్చించారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. గతంలో ఏపీ పార్టీ ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ ఉన్న సమయంలోనే శాంతి చర్చలు జరిగాయి. జానా అనుభవంతో శాంతి చర్చలు, కాల్పుల విరమణకు సంబంధించి జానా రెడ్డికి మంచి అనుభవం ఉంది. గతంలో చర్చలు జరిగిన సమయంలో జానా రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. చర్చల్లో జానారెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత సలహాలు, సూచనలు తీసుకుంటామని శాంతి చర్చల కమిటీకి సీఎం తెలిపారు. ఇందులో భాగం గానే జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆపరేషన్ కగార్‌పై సీఎం జానారెడ్డితో పాటుగా కేశవ రావు సేవలు వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ సభలోనూ మాజీ సీఎం కేసీఆర్ ఇదే అంశం పైన తన అభిప్రాయం వెల్లడించారు. శాంతి చర్చలు జరగాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారని, శాంతి చర్చలు జరపాలని..కాల్పుల విరమణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ADVERTISEMENT (3) - Continue to video Also Read తెలంగాణలో పది ఫలితాల ముహూర్తం ఖరారు - మార్కుల్లో మార్పులు..!! రేవంత్ స్పందన ఈ అంశానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని సభలో కేసీఆర్ ప్రకటించారు. సీఎం రేవంత్ సైతం మావోయిస్టుల సమస్యను శాంతిభద్రతల అంశంగా పరిగణించడం లేదని, ఇదొక సామాజిక అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు డిమాండ్ చేస్తున్న శాంతి చర్చలు, కాల్పుల విరమణపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లైతే మిగిన రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా దీని ప్రభావం పడనుంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరితగితిన స్పందిస్తే శాంతి చర్చల అంశం తెరమీదకు రానుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు తమ వద్దకు వచ్చిన ప్రతిపాదనలు పార్టీ అధినాయకత్వానికి నివేదిస్తామని రేవంత్ స్పష్టం చేసారు.

*వైశ్య భవనానికి భూమి పూజ లో పాల్గొన్న ఉప్పల*

 *వైశ్య భవనానికి భూమి పూజ లో పాల్గొన్న ఉప్పల*








కాశీ లోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బనారస్ ఆనంద నిలయం వైశ్య భవనానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు. వారి సతీమణి IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు ,వారి కుమారుడు ఉప్పల సాయి తేజ గారు, కోడలు శార్వారీ గారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాశీ పుణ్య క్షేత్రం లో ఇలాంటి నిలయం ఏర్పాటు కావడం అభినందనీయం అని ఆయన అన్నారు.
ఆర్య వైశ్యులకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశ్వేశ్వర్ రావు గారు, కోశాధికారి వుడుత పురుషోత్తం గారు , పబ్బా చంద్రశేఖర్ గుప్త గారు, కచాం కృష్ణమూర్తి గారు వరంగల్ జిల్లా IVF అధ్యక్షుడు మధు గారు , పాత నరేందర్ గారు, ఆర్య వైశ్య ప్రముఖులు ,IVF నాయకులు తదితరులు పాల్గొన్నారు.

*సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న ఉప్పల*

 *సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న ఉప్పల*






శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉపాసకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ సోమిశెట్టి నాగరాజు స్వామి వారి మార్గదర్శకత్వంలో గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సుదర్శన సహిత లక్ష్మీనరసింహస్వామి వారి మృత్యుంజయము శత్రువుజయము ఋణ విమోచన హోమము లో పాల్గొన్న TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మెన్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ
ప్రస్తుత దేశ సరిహద్దు పరిస్థితి హిందూ ధర్మంపై కొనసాగుతున్న మారణకాండను దృష్టిలో ఉంచుకొని ఏ క్షణానైనా జరగబోయే విపత్తు నుంచి మన దేశ సైనికులకు దైవ బలం ఉండాలని ఎటువంటి మృత్యువు వారిని దరిచేరకుండా అన్ని రకాల విజయం భారతదేశాన్ని వరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలోకార్యనిర్వాహకులు
పబ్బ బాలయ్య గారు
మొగుళ్ళపల్లి ఉపేందర్ గుప్తా చింతల బాలరాజు ఓరుగంటి వేణుమాధవ్
శ్రీ సూరిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sunday, 27 April 2025

*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ Annual General Body Meeting లో పాల్గొన్న ఉప్పల

 *తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ Annual General Body Meeting లో పాల్గొన్న ఉప్పల*





పుల్లేరు గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (KPGBA) గచ్చిబౌలి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అకాడమీ Annual General Body సమావేశములో పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రావు గారు, ప్రధాన కార్యదర్శి పుల్లెరు గోపీచంద్ గారు, కోశాధికారి వంశీదర్ గారు వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వర రావు ,రామ రావు గారు, వెంకట్ రావు రమేష్ రెడ్డి, రవి కుమార్ మనోజ్ రెడ్డి,UVN బాబు ( ఈవెంట్ & ప్రోటోకాల్) EC కమిటీ సభ్యులు PCS Rao
Ram Mohan Rao ,రంగా రావు , శ్రీనివాస్ రావు ,సుధాకర్ , నాగ వేణి , మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కోశాధికారి హర్ష తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో పది ఫలితాల ముహూర్తం ఖరారు - మార్కుల్లో మార్పులు..!!

తెలంగాణలో పది ఫలితాల ముహూర్తం ఖరారు - మార్కుల్లో మార్పులు..!! 


                      తెలంగాణలో పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠ గా నిరీక్షిస్తున్నారు. గ్రేడింగ్ విధానం పైన ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఫలితాల విషయంలో అధికారులు వేచి చూసారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టత రావటంతో ఇక ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయింది. గతం కంటే భిన్నంగా ఈ సారి ఫలితాలను వెంటనే తెలుసుకునే విధంగా కొత్తగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫలితాల ముహూర్తం తెలంగాణలో ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి పదో తరగతి మూల్యాంకనం, మార్కుల కంప్యూట రీకరణ, పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యా శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ ఆధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది ఆమోదం వరకు వేచి చూసారు. సీఎం ను కలిసిన అధికారులు ఫలితాల విడుదల పైన చర్చించారు. ఈ నెల 30న మల్లు భట్టి ఫలితాల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. మెమోల్లో మార్కులు ఈ సారి పదో తరగతి మార్కుల మెమో విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న సమయంలో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణి ఈ మార్పులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చే వారు. ఇక నుంచి ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందు పేర్చనున్నారు. ఇంటర్నర్, ఎక్స్ టర్నర్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వలన ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించటం కష్టం. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయటంతో గ్రేడ్స్ తో పాటుగా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. 

              ఫలితాల కోసం ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కు లుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తి వేయాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫలితాలను తర్వాత అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి. దీంతో, ఫలితాల ముహూర్తం ఖరారు కావటంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. 



                      తెలంగాణలో పదో తరగతి ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. దాదాపు అయిదు లక్షల మంది విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠ గా నిరీక్షిస్తున్నారు. గ్రేడింగ్ విధానం పైన ప్రభుత్వ తుది నిర్ణయం కోసం ఫలితాల విషయంలో అధికారులు వేచి చూసారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టత రావటంతో ఇక ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయింది. గతం కంటే భిన్నంగా ఈ సారి ఫలితాలను వెంటనే తెలుసుకునే విధంగా కొత్తగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫలితాల ముహూర్తం తెలంగాణలో ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి పదో తరగతి మూల్యాంకనం, మార్కుల కంప్యూట రీకరణ, పరిశీలన ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తయింది. విద్యా శాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ ఆధీనంలోనే ఉంది. సీఎం విదేశీ పర్యటనతో ఆయన తుది ఆమోదం వరకు వేచి చూసారు. సీఎం ను కలిసిన అధికారులు ఫలితాల విడుదల పైన చర్చించారు. ఈ నెల 30న మల్లు భట్టి ఫలితాల విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. మెమోల్లో మార్కులు ఈ సారి పదో తరగతి మార్కుల మెమో విధానంలో ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ఫలితాలు వెలువడుతున్న సమయంలో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణి ఈ మార్పులకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానంలో మెమోలు ఇచ్చే వారు. ఇక నుంచి ప్రతీ సబ్జెక్టులో గ్రేడింగ్ తో పాటుగా విద్యార్థి మార్కులు మెమోలో పొందు పేర్చనున్నారు. ఇంటర్నర్, ఎక్స్ టర్నర్ మార్కులు జీపీఏ మెమోలో ఉండేలా నిర్ణయించారు. ఇప్పటి వరకు విద్యార్థి ఆయా సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు ఇచ్చారు. దీని వలన ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థి ఎవరనే విషయం గుర్తించటం కష్టం. ఇప్పుడు ఈ విధానం మార్పు చేయటంతో గ్రేడ్స్ తో పాటుగా సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు పొందారో మెమోలో ఉంటుంది. 

              ఫలితాల కోసం ప్రస్తుతం వార్షిక పరీక్ష ప్రతీ సబ్జెక్టుకు 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 అంతర్గత మార్కు లుగా ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కులను ఎత్తి వేయాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక.. ఫలితాలను తర్వాత అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in లేదా results.bse.telangana.gov.in లో మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే.. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అలాగే SMS ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు SMS ద్వారా క్షణాల్లో వస్తాయి. దీంతో, ఫలితాల ముహూర్తం ఖరారు కావటంతో విద్యార్ధుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

అణుదాడి చేస్తారా ? మీరు ఐసిస్ వారసులు.. పాక్ పై రెచ్చిపోయిన ఓవైసీ..!

 అణుదాడి చేస్తారా ? మీరు ఐసిస్ వారసులు.. పాక్ పై రెచ్చిపోయిన ఓవైసీ..!  


           భారత్ పై అణుదాడి చేస్తామంటూ పాకిస్తాన్ చేస్తున్న బెదిరింపులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ను ఐసిస్ వారసులుగా అభివర్ణించారు. భారత్ ను బెదిరించే పరిస్ధితుల్లో పాకిస్తాన్ ఉందా అని ప్రశ్నించారు. సింధు జలాల నిలిపివేతపై పాకిస్తాన్ చేస్తున్న బెదిరింపులకు ఓవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అమాయకపౌరుల్ని మతం పేరుతో చంపుతున్న ఐసిస్ తో పాకిస్తాన్ ను అసదుద్దీన్ ఓవైసీ పోల్చారు. పహల్గాంలో టూరిస్టుల్ని మతం ఏంటని అడిగి చంపారట, మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు ? మీరు పిరికివాళ్లకంటే దారుణం, ఐసిస్ వారసులు మీరు అంటూ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ తో యుద్ధానికి అంత తొందరపడొద్దని, భారత్ సైనిక, ఆర్ధిక బలంతో పాకిస్తాన్ ఏమాత్రం సరితూగలేదంటూ ఓవైసీ తేల్చిచెప్పారు. 

 పాకిస్తాన్ భారత్ కంటే అరగంట మాత్రమే వెనుకబడి లేదని, అర్ధశతాబ్దం వెనుకబడి ఉందని ఓవైసీ గుర్తుచేశారు. మీ జాతీయ బడ్జెట్ కంటే మా మిలిటరీ బడ్జెట్ ఎక్కువన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. భారత్ ను అణుయుద్ధం పేరుతో బెదిరించడం కాదని, పొరుగు దేశంలో అమాయకుల్ని చంపుతుంటే ఎవరూ మౌనంగా ఉండరని తెలిపారు. భారత్ పై ప్రయోగించేందుకు ఘోరీ, షహీన్, ఘజ్నవీ సహా 130 అణు వార్ హెడ్లు సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఉప ప్రధాని హనీఫ్ అబ్బాసీ చేసిన విమర్శలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి అక్కడి ప్రజలను కూడా మన స్వంత ప్రజలుగా స్వీకరించాలని ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. పహల్గామ్ దాడిని ప్రస్తావిస్తూ మోడీ చేసిన వ్యాఖ్యలు కాశ్మీరీల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఉన్నాయని ఓవైసీ ఆక్షేపించారు. పహల్గాం దాడి తర్వాత ఇరు దేశాలూ మాటల యుద్దానికి దిగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలోనే ఓవైసీ ప్రకటించారు.

పాక్‌కు మరో షాక్.. మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా

 పాక్‌కు మరో షాక్.. మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా 


               జమ్మూకశ్మీర్ పహల్గాం దాడి తర్వాత వివిధ వీసాలపై భారత్ లో ఉంటున్న పాకిస్థానీయులకు దేశం విడిచి వెళ్లేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో దేశంలో ఉంటున్న పాక్ పౌరులపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉంటున్న దాయాది పౌరులకు కేంద్ర హోంశాఖ సూచన మేరకు ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. మరో వైపు హెల్త్ వీసాపై భారత్ కు వచ్చిన వారికి మాత్రం ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్ పహల్గామ్ బసరన్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన, అందమైన ప్రాంతాలను ఆశ్వాదిస్తున్న పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారత్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలికొన్నారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించిన కేంద్ర కేబినెట్ కమిటీ పాక్ పై ఒత్తిడి తీసుకురావటానికి 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. Also Read "ఢిల్లీలో బాలయ్య, తారక్- ప్రధాని సమక్షంలో: అరుదైన ఘట్టం..!!" ఈ నిర్ణయాల్లో భాగంగా వివిధ వీసాలతో భారత్ లో జీవిస్తున్న పాక్ పౌరులను ఈ నెల 27లోగా తమ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో నేటితో ఆ గడువు ముగియడంతో భారత్ ఉంటున్న వారిపై ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వారిపై విచారణ చేపట్టి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష.. లేదా రూ.3లక్షల జరిమానా విధించనుంది. మరికొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే చాలా మంది పాక్ పౌరులు వాఘా అట్టారీ బోర్డర్ నుంచి దేశాన్ని వీడి స్వదేశానికి వెళ్లిపోయారు. మిగిలి ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవటానికి ఆయా రాష్ట్రాల పోలీసులు సన్నద్ధమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ADVERTISEMENT (2) - Continue to video మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) టేకోవర్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన బైసారన్ మీడోస్‌ను సందర్శించారు. అణువణువూ పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారులతో కూడిన ప్రత్యేక టీమ్ బైసారన్‌ను సందర్శించింది. యాంటీ- టెర్రర్ ఏజెన్సీ నుంచ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. ఫోరెన్సిక్ నిపుణలు ఈ దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యాయి. పహల్గామ్, బైసారన్‌లో క్షేత్రస్థాయిలో భద్రత వ్యవస్థను పరిశీలించారు.

భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు:జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

     భూ భారతి చట్టంలో అధికారాలను వికేంద్రీకరించడం వల్ల పారదర్శకతతో చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు .ధరణిలో అధికారాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కావటం వల్ల అధికారాలు దుర్వినియోగం అవ్వడమే కాకుండా రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు తహసిల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ కార్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేది అన్నారు.


       భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం అయన నల్గొండ జిల్లా ,మాడుగుల పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


        ధరణిలోని సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అనేకమంది మేధావులతో చర్చించి సమావేశాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధితో  భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో భూ భారతి చట్టాన్ని  సైతం సవరించే వెసులుబాటును చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .భూ భారతి చట్టం వల్ల రైతుల సమస్యలన్నీ తీరిపోతాయని ,ముఖ్యంగా తహసిల్దార్ వద్దనే 80% సమస్యలు పరిష్కరించుకోవచ్చని ,ఒకవేళ ఎవరికైనా భూ సమస్యలు ఉన్నట్లయితే తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు.


        శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మాడుగులపల్లి మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా వైవాటా, మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యలు ఉన్నాయని, ధరణిలో ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం రాలేదని, రైతులు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. గతంలో అసైన్మెంట్ భూములకు పరిష్కారం దొరకలేదని, భూ భారతి చట్టంలో  వికేంద్రీకరణ ద్వారా ప్రజల ముందుకే పరిపాలన వచ్చిందని, అలాగే అప్పీల్ అధికారం కూడా భూ భారతిలో ఉందని ,ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని, జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూ భారతి తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం, రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కులగనన, వర్గీకరణ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు.


          జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి




 మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు .రైతు మోకా మీద ఉండడంతో పాటు, సరైన ఆధారాలు ఉంటే భూములకు ఎలాంటి డోకా లేదని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి గ్రామ పాలనాధికారి తో పాటు, ప్రతి రెవిన్యూ విలేజ్ కు లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించనున్నదని తెలిపారు. గతంలో పహాని పోతే సమస్య పరిష్కారం అయ్యేది కాదని, భూ భారతిలో ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ,అయితే రైతులు సరైన రికార్డులు ఇవ్వడంతో పాటు ,మోక మీద ఉండాలని తెలిపారు. అలాగే రుణాలు పొందేందుకు రైతులు సాగు చేసుకుంటున్న భూముల ఖాతాలో సంతకం చేసి ఉండాలని, రుణం పొందేందుకు ఎలాంటి భూమి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ పోర్టల్ లో ఉన్న వివరాలు ఆధారంగా రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మాడుగులపల్లి మండలానికి త్వరలోనే కేజీబీవీ భవనం, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.


       మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.


         తహసిల్దార్ అశోక్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ,మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, మాజీ జడ్పిటిసి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు .


ఆ రోజుల్లో బ్యాంకులు బంద్.. మే నెలలో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!



: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చే వారు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. దాదాపు 12 రోజుల పాటు మూసి ఉండనున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.

             : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద బ్యాంక్ ఖాతా ఉంటుంది. ఏదో ఒక అవసరంతో బ్యాంకుకు వెళ్తుంటాం. ఎంత డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చినా కొన్ని పనులు పూర్తి చేయాలంటే కచ్చితంగా బ్యాంక్ బ్యాంచుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే వ్యాపారాలు నిర్వహించే వారు తరుచుగా బ్యాంకుకు వెళ్తుంటారు. బ్యాంక్ ద్వారా తమ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారు. సాధారణ పొదుపు ఖాతా ఉన్న వారికి సైతం బ్యాంకుతో ఏదో పని ఉంటుంది. అలాంటి వారందరికీ ముఖ్యమైన గమనిక. మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఏకంగా 12 రోజుల పాటు మూత పడనున్నాయి. మరి ఏ రోజు బ్యాంకులు మూసి ఉంటాయి ? ఏ రోజుల్లో తెరిచి ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం కీలకం. మే నెల బ్యాంకుల సెలవుల జాబితా తెలుసుకుందాం.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన వార్షిక సెలవుల జాబితా ప్రకారం బ్యాంకులకు రాష్ట్రాల వారిగా వేరు వేరుగా సెలవులు ఉంటాయి. ప్రాంతీయ పండగలు, జాతీయ సెలవులు, రాష్ట్ర పండగల వంటివి మారుతుంటాయి. ఈ క్రమంలో మే నెలలోనే ప్రాంతాల వారీగా వేరు వేరు పండగలు ఉన్నాయి. వాటి ప్రకారమే బ్యాంకులకు సెలవులు ఇస్తుంటారు.

మే 1వ తేదీ గురువారం: మే డే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అదే రోజు మహారాష్ట్ర దినోత్సవం కూడా.

మే 4వ తేదీ ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.

మే 9వ తేదీ శుక్రవారం: రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు

మే 10వ తేదీ శనివారం: నెలలో రెండో శనివారం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు

మే 11వ తేదీ ఆదివారం: బ్యాంకులకు వారాంతపు సెలవు

మే 12వ తేదీ సోమవారం: బుద్ధ పౌర్ణిమ సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఇస్తారు.

మే 16వ తేదీ శుక్రవారం: సిక్కిం స్టేట్ డే సందర్భంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ఉంటుంది.

మే 18వ తేదీ ఆదివారం: వారాంతం కాబట్టి బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.

మే 24వ తేదీ శనివారం: నెలలో నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులు మూసి ఉంటాయి.

మే 25వ తేదీ ఆదివారం: వారాంతం సందర్భంగా సాధారణ సెలవు ఉంటుంది.

మే 26వ తేదీ సోమవారం: కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టిన రోజు సందర్భంగా ప్రాంతీయ సెలవు ఉంటుంది.

మే 29వ తేదీ గురువారం: మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా పలు ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.


ఇండియాను వీడి ఆ దేశానికి వెళ్లిపోతున్న కోహ్లీ..?


 ఇండియాను వీడి ఆ దేశానికి వెళ్లిపోతున్న కోహ్లీ..?

 By Naresh 

        టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. విరాట్,అనుష్క దంపతులకు కూతురు , కుమారుడు ఉన్నారు. అయితే విరాట్,అనుష్క దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 

                   తమ జీవితంలోని రెండో ఇన్నింగ్స్‌ను లండన్ నగరంలో ప్రారంభించాలని చూస్తున్నారనే ఊహాగానాలు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి.భారతదేశంలో విపరీతమైన అభిమానుల తాకిడికి గురయ్యే ఈ జంట, తమ పిల్లలైన వామిక , అకాయ్‌లకు ప్రశాంతమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటున్నారట. లండన్‌లో ఇప్పటికే వారికి ఒక ఇల్లు ఉందని, రిటైర్మెంట్ తర్వాత అక్కడే శాశ్వతంగా నివసించాలని భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో శిఖరాగ్రాన ఉన్నాడు. అయితే, ప్రతి క్రీడాకారుడి జీవితంలో రిటైర్మెంట్ అనేది ఒక అనివార్యమైన ఘట్టం. మైదానంలో తన దూకుడుతో అందరినీ ఆకట్టుకున్న విరాట్, రిటైర్మెంట్ తర్వాత తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాడు. అనుష్క శర్మ కూడా తన సినీ కెరీర్‌కు కొంత విరామం ఇచ్చి, పిల్లల పెంపకంలో నిమగ్నమై ఉన్నారు. 

        అక్కడ తమ పిల్లలు సాధారణ జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుందని వారు ఆశిస్తున్నారు. అయితే, విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అతను మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఒకవేళ వారు లండన్‌లో స్థిరపడితే, భారతీయ క్రీడా మరియు సినీ పరిశ్రమ ఒక తార జంటను మిస్సవుతుంది అనడంలో సందేహం లేదు.

ఆ హీరోయిన్ భర్తను గట్టిగా ట్రై చేస్తోన్న శ్రీలీల

 ఆ హీరోయిన్ భర్తను గట్టిగా ట్రై చేస్తోన్న శ్రీలీల 


By Naresh 

 టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది.తెలుగు ఇండస్ట్రీని శ్రీలీల ఓ ఊపు ఊపింది.పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ఆ తర్వాత ధమాకా , భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. 

 స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. తాజాగా అమ్మడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. 

           'డ్రీమ్ గర్ల్' ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే రేసులో అనన్య పాండే సైతం ఉన్నారని తెలుస్తోంది. శ్రీలీల, అనన్య పాండేల మధ్య ఈ మూవీ కోసం పోటీ జరుగుతున్నట్టు సమాచారం. వీరితో టీమ్ చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు శ్రీలీలకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే అని అంటున్నారు. అయితే ఈ ఆఫర్ కోసం శ్రీలీల గట్టిగానే ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా భార్య కియారా అద్వానీ అన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. 

ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2 వేలు.. పీఎం కిసాన్ 20వ విడత అప్పుడే! ఈ పని చేస్తేనే..



         పీఎం కిసాన్ యోజన 20వ విడత మే లేదా జూన్ 2025 నాటికి విడుదల కానుంది. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 2 వేల చొప్పున జమవుతాయి. రైతులు తమ పేమెంట్ స్టేటస్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. పథకం నిరంతర ప్రయోజనం కోసం ఇ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ, బయోమెట్రిక్ లేదా ఫేస్-అథెంటికేషన్ ద్వారా ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు.

పీఎం కిసాన్ పథకం 

        : భారతదేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన పథకం.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) యోజన. త్వరలో తన 20వ విడతను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మే లేదా జూన్ 2025 నాటికి ఈ విడత నగదు.. రైతుల ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభమైంది. ఇది వ్యవసాయ రంగానికి చేయూతనివ్వడానికి ఇంకా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకం అని చెప్పొచ్చు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందుతుంది. దీనిని నాలుగు నెలల వ్యవధిలో విడతకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు.


19వ విడతలో రూ. 22,000 కోట్లు పంపిణీ..

ఫిబ్రవరి 2025లో, ప్రభుత్వం విజయవంతంగా 19వ విడతను పంపిణీ చేసింది. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు, వీరిలో 2.41 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రూ. 22,000 కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. 20వ విడత త్వరలో విడుదల కానుండటంతో రైతులు ఈ నగదు కోసం ఎదురుచూస్తున్నారు.

                రైతులు పీఎం-కిసాన్ అధికారిక పోర్టల్‌లో తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌టుడేట్ ఉంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇంకా పీఎం కిసాన్ యోజనలో అర్హత, అప్లికేషన్, పేమెంట్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.

           భార్యాభర్తలు, మైనర్ పిల్లలు కలిగి సాగుకు అనువైన భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబం ఈ పథకానికి అర్హులు. అయితే, కొన్ని అధిక ఆదాయ వర్గాల వారికి దీని నుంచి మినహాయింపు ఉంది. ఈ పథకం ప్రయోజనం పొందడానికి, రైతులకు చెల్లుబాటు అయ్యే భూమి రికార్డులు, బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. 20వ విడత స్టేటస్ చెక్ చేయడానికి.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ ఫార్మర్స్ కార్నర్‌లో 'నో యువర్ స్టేటస్'పై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఖాతా నంబర్ లేదా అప్లికేషన్ IDని నమోదు చేయండి. మీ పేమెంట్ స్టేటస్ కోసం 'గెట్ డేటా'పై క్లిక్ చేయండి.

పీఎం కిసాన్ ఇ-కేవైసీ..

పీఎం కిసాన్ పథకం ప్రయోజనం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు చేరడం కోసం ఇ-కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి చేశారు. ఇ-కేవైసీ కాకుంటే అకౌంట్లో డబ్బులు పడవని గుర్తుంచుకోవాలి.

ఇ-కేవైసీ విధానాలు..

రైతుల కోసం మూడు రకాల ఇ-కేవైసీ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఓటీపీ బేస్డ్ ఇ-కేవైసీ. ఇది పీఎం-కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది. దీని కోసం రైతు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెండోది బయోమెట్రిక్ బేస్డ్ ఇ-కేవైసీ. ఈ సౌకర్యం కామన్ సర్వీస్ సెంటర్‌లు (సీఎస్‌సీలు), వివిధ రాష్ట్ర సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంది. ఇంకా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌తో కూడా ఇ-కేవైసీ పూర్తి చేయొచ్చు.

కాబట్టి, పీఎం కిసాన్ పథకం 20వ విడత ప్రయోజనం పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే.. సకాలంలో ఆర్థిక సహాయం పొందొచ్చు.

యుద్ధానికి సిద్ధం: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

 యుద్ధానికి సిద్ధం: ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన 


By Bomma 

 జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది. సరిహద్దుల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. అటు ప్రధాని మోదీ ఇటీవల మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికే పాకిస్థాన్ పై సంచలన నిర్ణయాలు తీసుకుని ఆ దేశాన్ని అష్టదిగ్భంధనం చేసింది. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు,అధికారులు తగ్గింపు,సార్క్ దేశాల వీసా రద్దు,అటారీ-వాఘా బోర్డర్‌ మూసివేత, ఎక్స్‌ర్‌ సైజ్ ఆక్రమన్.. తదితర చర్యలు చేపట్టి పాకిస్థాన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ తో యుద్ధం పై ఇండియన్ ఆర్మీ సంచలన పోస్ట్ పెట్టింది. ఎప్పుడైనా సిద్ధం అంటూ సిగ్నల్ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న క్రమంలో భారత ఆర్మీ ఈ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం అని సైనికులు, జవాన్ల యుద్ధ విన్యాసాలు, పరాక్రమాల దృశ్యాలను షేర్ చేసింది. ఈ మేరకు ఆ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. Also Read "అయ్యో...భారత్-పాక్ ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారే-ట్రంప్ షాకింగ్ రియాక్షన్..!" భారత ఆర్మీ పోస్ట్ ప్రకారం.. " దేనికీ భయపడం, ఏదీ మిమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైనది కాదు, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే' అని పేర్కొంది. ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధం అంటూ నేవీ అధికారులు కూడా పోస్ట్ పెట్టారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. 

. పహల్గాం ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు తాము సిద్ధమేనని అన్నారు. ఎలాంటి ముప్పు వచ్చినా ఎదర్కొంటామని తెలిపారు. మరోవైపు శాంతికే తమ ప్రాధాన్యం అని తెలిపారు. పాక్ ప్రధాని మాటలతో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. మరోవైపు విశాఖపట్నంలోని నేవీ సన్‌రైజ్‌ ఫ్లీట్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సముద్రమార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. దీంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.


Saturday, 26 April 2025

ap7am Home News Telugu News Movie News Movie Reviews Press Releases Articles Bhakti Grievances హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్ 21-04-2025 Mon 20:42 | Telangana హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్ ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సునీతపై ఆరోపణలు విచారణ జరిపి నివేదిక అందించిన అధికారులు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ దక్షిణ మండలం రవాణ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి సునీతపై ఆ శాఖ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెపై బదిలీ వేటు వేశారు. ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తన బాగోలేకపోవడం, పలు ఆర్థిక అంశాలలో నేరుగా ఆమె ప్రమేయం ఉండటం గురించి ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. తదనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఈ అంశంపై బండ్లగూడ ఆర్టీవో కృష్ణయ్య మాట్లాడుతూ... ఆమె బదిలీ జరిగిందని చెప్పారు. ఆమెను ఎస్టీఏకు అటాచ్ చేశారని తెలిపారు.

 ap7am


హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్

హైదరాబాద్ బండ్లగూడ రవాణా శాఖ అధికారిణి సునీతపై సీరియస్ యాక్షన్
ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సునీతపై ఆరోపణలు
  • విచారణ జరిపి నివేదిక అందించిన అధికారులు
  • క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ వేటు
హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ దక్షిణ మండలం రవాణ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి సునీతపై ఆ శాఖ కమిషనర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఆమెపై బదిలీ వేటు వేశారు. 

ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రవర్తన బాగోలేకపోవడం, పలు ఆర్థిక అంశాలలో నేరుగా ఆమె ప్రమేయం ఉండటం గురించి ఆమెపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. తదనంతరం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఈ అంశంపై బండ్లగూడ ఆర్టీవో కృష్ణయ్య మాట్లాడుతూ... ఆమె బదిలీ జరిగిందని చెప్పారు. ఆమెను ఎస్టీఏకు అటాచ్ చేశారని తెలిపారు. 

ACB Raids | మహబూబాబాద్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

 

ACB Raids | మహబూబాబాద్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

 

మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు.                                                       

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్‌, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు.

Thursday, 24 April 2025

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ

 

ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో అధికారి లంచం తీసుకుంటూ.               

మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. ఖిల్లా గణపురం మండల విద్యుత్ శాఖ ఏఈ గా పనిచేస్తున్న కొండయ్య ఖిల్లా ఘనపురం మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించేందుకురూ. 40 వేల రూపాయలు కాంట్రాక్టర్ ను డిమాండు చేసినట్లు సమాచారం . కంపెనీకి సంబంధించి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ,10 వేలు ఇవ్వాలి అని ఏఈ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ అధికా


రులకు సంబంధిత కాంట్రాక్టర్ సమాచారం ఇచ్చాడు. వనపర్తి డి ఈ కార్యాలయంలో బుధవారం లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి అతడి నుండి డబ్బులు స్వాధీన పరచుకొని.. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ మేరకు కొండయ్య పై కేసు నమోదు చేసి సంబంధిత అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగిన ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని,:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 


జమ్ము కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క , జూపల్లి కృష్ణ రావు, దామోదర్ రాజా నర్సింహ మరియు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరియు రాష్ట్ర ఎంపీ లు రెండు నిమిషాల మౌనాన్ని పాటించి ప్రార్థించారు.

Wednesday, 23 April 2025

45 డిగ్రీల ఎండలు ఉన్నా సరే వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవచ్చు, ఇప్పుడు చెప్పే సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు

   

45 డిగ్రీల ఎండలు ఉన్నా సరే వాటర్ ట్యాంక్‌లోని నీటిని చల్లగా ఉంచుకోవచ్చు, ఇప్పుడు చెప్పే సింపుల్ ట్రిక్ ఫాలో అయితే చాలు

మండే ఎండల వేడికి ట్యాంకులోని నీరు వేడిగా మారుతుంది. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ వేడి నీటితో ముఖం, కాళ్లు శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీంతో, వాటర్ ట్యాంక్‌‌ని ఎలా కూల్‌గా ఉంచాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు.                       ఏప్రిల్ నెల సగం దాటేసింది. రోజు రోజుకి ఎండలు భగ్గుమంటున్నారు. ఇంటి నుంచి బయటకి అడుగుపెట్టాలంటే భయమేస్తుంది. సరే ఇంటిలో ఉన్నప్పుడు కాస్త చన్నీటితో స్నానం లేదంటే ముఖం కడుక్కోవాలని ఉంటుంది. అయితే, మండే ఎండల వేడికి ట్యాంకులోని నీరు వేడిగా మారుతుంది. బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ వేడి నీటితో ముఖం, కాళ్లు శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీంతో, వాటర్ ట్యాంక్‌‌ని ఎలా కూల్‌గా ఉంచాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. అయితే, యూట్యూబర్ పూనమ్ దేవ్నాని ట్యాంక్ నీటిని చల్లగా ఉంచడానికి ఒక సులభమైన ఉపాయాన్ని పంచుకున్నారు. ఆ ట్రిక్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Monday, 21 April 2025

బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థుల

 

బాత్రూం నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థుల

పురాతన కాలంలో బందిపోట్లు, దొంగల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో అప్పటి జనం తమ వద్ద ఉన్న బంగారం, వెండి సంపదను ఇంటి నిర్మాణాల్లో లేదా గుంతలు తవ్వి దాచిపెట్టేవారు. వారు అకాల మరణం చెందితే ఆ సంపద అలానే ఉండిపోయేది. తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత ఏదైనా నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఆ నిధి బయటపడేది. అలాగే కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాలు, దేవీదేవతలు విగ్రహాలు సైతం అరుదుగా బయటపడుతూ ఉంటాయి...                                             

పాత నిర్మాణాలు కూల్చివేస్తున్నప్పడు.. ఏదైనా నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుననప్పుడు పురాతన నిధి, నిక్షేపాలు.. చరిత్ర తాలూకా వస్తువులు బయటపడటం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు పురాతన దేవీదేవతల విగ్రహాలు సైతం బయల్పడుతూ ఉంటాయి. దీంతో ఆ విగ్రహాలను సేకరించి.. పండితులను సంప్రదించి.. గుడి నిర్మాణాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అలాంటి అద్భుత ఘటనే వెలుగుచూసింది. అది కూడా హనుమాన్ జయంతి నాడు హనుమాన్ విగ్రహం బయటపడింది. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కురేభార్‌లోని ఫుల్పూర్ గ్రామంలో స్నానాల గది నిర్మాణ పనుల్లో హనుమంతుడి భారీ విగ్రహం బయటపడింది. ఈ ఆవిష్కరణ ఇప్పుడు భారతదేశం అంతటా చర్చనీయాశంగా మారింది. ఇదో అద్భుత ఘటన అని హనుమాన్ భక్తులు చెబుతున్నారు.

Thursday, 17 April 2025

భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టం అని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.

       భూ భారతి చట్టం చారిత్రాత్మక చట్టం అని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు.






     భూ భారతి చట్టం( భూమి హక్కుల రక్షణ చట్టం- 2025 ) పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఆయన దేవరకొండ రైతు వేదికలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .


      ప్రతి రైతుకు మేలు జరిగే లా రాష్ట్ర  ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతుల భూముల సమస్యలను భూ భారతి ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూ సమస్యలతోపాటు, ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలను దీని ద్వారా  పరిష్కరించుకోవచ్చని అన్నారు. గ్రామంలో సమస్యలన్నీటిని రెవెన్యూ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామ గ్రామాన రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని, 100 సంవత్సరాల వరకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భూభారతి చట్టంలోని సెక్షన్లు, షెడ్యూళ్లు అందరికీ అర్థమయ్యే విధంగా సులభమైన రీతిలో చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ,రైతులు దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు . చట్టం చేసే ముందు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోని, నాలుగు మండలాలలో పైలెట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేయడం జరిగిందని తెలిపారు. ధరణి పోర్టల్  లో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు అనేక ప్రయోజనాలను ఈ చట్టంలో కల్పించడం జరిగిందని ,ఇకపై భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని ఆయన తెలిపారు.భూ భారతి చట్టంతో భూమి కలిగిన రైతులకు భూమి మీద హక్కును కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. భూమి కలిగిన ప్రతి పేదవాడికి దీని వల్ల మేలు కలుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా సన్నబియ్యాన్ని  పంపిణీ చేస్తున్నదని ,సన్నధాన్యం పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు, 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, అదే ధాన్యాన్ని  సన్న బియ్యంగా మార్చి పేదలకు పంచుతున్నట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు. దీంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, కులగనన, ఎస్సీ వర్గీకరణ  వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు.


         రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం  భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.

 ధరణి పోర్టల్ లో  లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు.భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు మీ -సేవలో లాగే  భూ భారతి పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని, ఒకవేళ పరిష్కరించలేక పోతే  చాలాన్ ద్వారా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్స్ పై ఎలాంటి ప్రస్తావన లేదని ,  అయితే భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం  రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్  లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని తెలిపారు. భూ భారతి చట్టంలోని ముఖ్యమైన అంశాలను ఆమె వివరిస్తూ భూ భారతి చట్టంలో మ్యుటేషన్లు ఆటోమేటిక్ గా అవుతాయని ,30 రోజుల్లో మ్యుటేషన్ కాకపోతే 31 వ రోజు ఆటోమెటిగ్గా మ్యుటేషన్ జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సాదా బైనామా కు సంబంధించిన వివరాలు అన్నింటిని రైతులు ఇతర రైతులతో పంచుకోవాలని, చట్టంపై అందరికీ పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.  భూ భారతి చట్టంలోని అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆర్డిఓ కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ ఫిర్యాదులను సమర్పించి పరిష్కరించుకోవచ్చని, ఒకవేళ రైతులకు ఎవరికైనా న్యాయసహాయం అవసరమైతే ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.భూ భారతి చట్టం ద్వారా భూములకు సంబంధించిన అవినీతిని అరికట్టి, రెవెన్యూ శాఖను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

    అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి లు భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.

     స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

________________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

మీ వెహికల్ నంబర్ ప్లేట్ మార్చుకోవాల్సిందే.. సింపుల్ ప్రాసెస్ ఇదే..

 

మీ వెహికల్ నంబర్ ప్లేట్ మార్చుకోవాల్సిందే.. సింపుల్ ప్రాసెస్ ఇదే..

తెలంగాణలో వాహనదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఏప్రిల్ 1 2019కి ముందు రిజిస్ట్రర్ అయిన అన్ని పాత వాహనాలకు కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ (HSRP) అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సెప్టెంబర్ 30 2025 చివరి తేదీగా విధించింది. లేదంటే అన్ని సేవలు క్లోజ్ కావటంతో పాటు కేసులు కూడా బుక్ చేయనున్నారు. కాగా, HSRP ఎలా బుక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.