పాక్‌కు మరో షాక్.. మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా
పాక్‌కు మరో షాక్.. మూడేళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా
జమ్మూకశ్మీర్ పహల్గాం దాడి తర్వాత వివిధ వీసాలపై భారత్ లో ఉంటున్న పాకిస్థానీయులకు దేశం విడిచి వెళ్లేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో దేశంలో ఉంటున్న పాక్ పౌరులపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉంటున్న దాయాది పౌరులకు కేంద్ర హోంశాఖ సూచన మేరకు ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. మరో వైపు హెల్త్ వీసాపై భారత్ కు వచ్చిన వారికి మాత్రం ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్ పహల్గామ్ బసరన్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన, అందమైన ప్రాంతాలను ఆశ్వాదిస్తున్న పర్యాటకులపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారత్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలికొన్నారు. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యవసర సమావేశం నిర్వహించిన కేంద్ర కేబినెట్ కమిటీ పాక్ పై ఒత్తిడి తీసుకురావటానికి 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. Also Read "ఢిల్లీలో బాలయ్య, తారక్- ప్రధాని సమక్షంలో: అరుదైన ఘట్టం..!!" ఈ నిర్ణయాల్లో భాగంగా వివిధ వీసాలతో భారత్ లో జీవిస్తున్న పాక్ పౌరులను ఈ నెల 27లోగా తమ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. దీంతో నేటితో ఆ గడువు ముగియడంతో భారత్ ఉంటున్న వారిపై ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ 2025 ప్రకారం వారిపై విచారణ చేపట్టి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష.. లేదా రూ.3లక్షల జరిమానా విధించనుంది. మరికొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంది. కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే చాలా మంది పాక్ పౌరులు వాఘా అట్టారీ బోర్డర్ నుంచి దేశాన్ని వీడి స్వదేశానికి వెళ్లిపోయారు. మిగిలి ఉన్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవటానికి ఆయా రాష్ట్రాల పోలీసులు సన్నద్ధమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ADVERTISEMENT (2) - Continue to video మరోవైపు పహల్గామ్ ఉగ్రవాదుల దాడి ఘటనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) టేకోవర్ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. పహల్గామ్‌లో ఉగ్రవాదులు కాల్పులు జరిపిన బైసారన్ మీడోస్‌ను సందర్శించారు. అణువణువూ పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారులతో కూడిన ప్రత్యేక టీమ్ బైసారన్‌ను సందర్శించింది. యాంటీ- టెర్రర్ ఏజెన్సీ నుంచ పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు ఇందులో ఉన్నారు. ఫోరెన్సిక్ నిపుణలు ఈ దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యాయి. పహల్గామ్, బైసారన్‌లో క్షేత్రస్థాయిలో భద్రత వ్యవస్థను పరిశీలించారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home