ఆ హీరోయిన్ భర్తను గట్టిగా ట్రై చేస్తోన్న శ్రీలీల
ఆ హీరోయిన్ భర్తను గట్టిగా ట్రై చేస్తోన్న శ్రీలీల
By Naresh
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది.తెలుగు ఇండస్ట్రీని శ్రీలీల ఓ ఊపు ఊపింది.పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ఆ తర్వాత ధమాకా , భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది.
స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. తాజాగా అమ్మడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
'డ్రీమ్ గర్ల్' ఫేమ్ రాజ్ శాండిల్య దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే రేసులో అనన్య పాండే సైతం ఉన్నారని తెలుస్తోంది. శ్రీలీల, అనన్య పాండేల మధ్య ఈ మూవీ కోసం పోటీ జరుగుతున్నట్టు సమాచారం. వీరితో టీమ్ చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు శ్రీలీలకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టే అని అంటున్నారు. అయితే ఈ ఆఫర్ కోసం శ్రీలీల గట్టిగానే ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా భార్య కియారా అద్వానీ అన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home