Friday, 22 November 2024

ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.




   ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో నల్గొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

     శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

     అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మూసి నది వల్ల అనేక రోగాలు వస్తున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైన నది మూసీ నది అని అన్నారు .అలాంటి మూసి నదిని ప్రక్షాళన చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల సహకారంతో ఎస్ఎల్బీసీని శివన్న గూడెం, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి వంటి అన్ని కాలువల నిర్మాణాలను పూర్తి చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్లు వేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు .400 కోట్ల రూపాయలతో నల్గొండ మున్సిపాలిటీలో పనులు నడుస్తున్నాయని,  వచ్చే వేసవి నాటికి ప్రతిరోజు ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తున్నామని వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వచ్చే నెలలో మహిళలకు టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మింవహి ఇస్తామని, ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ హాస్టల్నుఏర్పాటు చేస్తున్నామని, అందులోనే అన్ని వసతులు కల్పించనున్నామని తెలిపారు. 


     నల్గొండ పార్లమెంట్ సభ్యులు కందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు ఆరూ గ్యారంటీలను అమలు చేస్తున్నదని,పేద ప్రజల మేలుకోసం  పని చేయడం సంతోషంగా ఉందన్నారు.  ప్రజలకు ఇచ్చిన ప్రతి పనిని చేస్తామని, ఎస్ ఎల్ బి సి పూర్తి చేస్తామని ,ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

     నకిరేకల్ శాసనసభ్యులు వీరముల వీరేశం మాట్లాడుతూ నల్గొండ జిల్లాను సస్యశ్యామలం  చేసేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న కృషి మరువ లేనిదన్నారు. 

   అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వాగతోపన్యాసం చేస్తూ నల్గొండ జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని,జిల్లా లో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, చేపట్టనున్న పనులు వివరించారు.


     ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ ఆలేఖ్య పుంజల, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్  అబ్బగోని రమేష్ గౌడ్ ,డిసిసిబి అధ్యక్షులు, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్,డి ఆర్ ఓ అమరేందర్ ,ఆర్డిఓ అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

___________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

No comments:

Post a Comment