Saturday, 16 November 2024

బ్యాంకు లింకేజీ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్



 కొత్త ఎస్.హెచ్.జి గ్రూపుల ఏర్పాటు ఫై దృష్టి సారించాలి


అర్హత గల ప్రతి మహిళకు ఎస్.హెచ్.జి లో సభ్యత్వం ఉండాలి


బ్యాంకు లింకేజీ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దాన కిషోర్


హైదరాబాద్, నవంబర్ 16:   కొత్త స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం లేని అర్హులైన మహిళలను గుర్తించి కొత్త ఎస్.హెచ్.జి గ్రూపులను ఏర్పాటు చేయాలని తెలిపారు.


శనివారం ఎం ఏ యు డి కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన జిహెచ్ఎంసి, మెప్మా అధికారులతో స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ టార్గెట్, లక్ష్యసాధన, కొత్త గ్రూపుల ఏర్పాటు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యకలాపాల అభివృద్ధి తదితరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త మహిళా సంఘాల ఏర్పాటుతో పాటు పాత సంఘాలను పటిష్ట పరిచేందుకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు.  మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేరడానికి ప్రోత్సహించాలని, ఇప్పటికీ సభ్యులుగా లేని మహిళలను గుర్తించాలని తెలిపారు. డిసి లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశాలు నిర్వహించి కొత్త ఎస్.హెచ్.జి లను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధించడంలో మహిళల భాగస్వామ్యం కీలకమని, స్వయం సహాయక సంఘాల ఏర్పాటు తో మహిళా ఆర్థిక స్వాలంబనకు, మహిళల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. 


టి.ఎం.సి లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆర్.పి లు, జిహెచ్ఎంసి పి.డి లు, మెప్మా ప్రాజెక్ట్ ఆఫీసర్లకు ఓరియంటేషన్ నిర్వహించాలన్నారు. డిసెంబర్, 2024 మాసాంతానికి కొత్త ఎస్.హెచ్.జి లను ఏర్పాటు చేసి కొత్త సభ్యుల నమోదు పూర్తి చేయాలన్నారు. కొత్త ఎస్.హెచ్.జి లను ఏరియా లెవల్ ఫెడరేషన్లు, టౌన్ ఫెడరేషన్లకు అటాచ్ చేయాలని సూచించారు. 


స్వయం సహాయక సంఘాలకు నిర్దేశిత లక్ష్యాల మేరకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కోరారు. లక్ష్య సాధనకు నెల వారీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, జీహెచ్ఎంసీ బ్యాంకు లింకేజీ ద్వారా నెలకు కనీసం 200 కోట్ల రూపాయల రుణాలు అందించాలన్నారు. మెచ్యూరిటీ ఎస్ హెచ్ జి గ్రూపులలో బిజినెస్ ఓరియంటేషన్ తీసుకురావాలని, మహిళలను వ్యాపారాల వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. బ్యాంకర్స్ తో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అభివృద్ధికి స్థానిక ఎన్.జి.ఓ లను, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ లను గుర్తించాలన్నారు. డి.సి, పి.డి ల స్థాయిలో ఎన్.జి.ఓ ల మ్యాపింగ్ జరగాలని తెలిపారు. 


జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు, సి.ఎస్.ఓ లు, ఎన్.జి.ఓ లు, బ్యాంకర్లు, ఏ.సి.ఎల్.బి లు, పి.డి లకు వర్క్ షాప్ నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీలలో ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే కార్నివాల్ కోసం కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేయాలని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎస్.హెచ్.జి లకు, ఇప్పటికే ఉన్న టౌన్ లెవెల్, ఏరియా లెవల్ ఫెడరేషన్ లకు శిక్షణలు నిర్వహించాలని, అదేవిధంగా సొంత శిక్షణ కేంద్రాలు, మాడ్యూల్స్ కలిగి ఉన్న బ్యాంకులను సంప్రదించి శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ కు శిక్షణ ఇచ్చే విభాగాల అధికారులలో 20 మంది శిక్షకులను గుర్తించాలని తెలిపారు. టి.ఎల్.ఎఫ్, ఏ.ఎల్.ఎఫ్ ల సమావేశాలకు డి.సి లు, మున్సిపల్ కమిషనర్లు రెగ్యులర్ గా హాజరు కావాలని సూచించారు. ఎస్.హెచ్.జి లకు బ్యాంకు లింకేజీలు, నిధుల పంపిణీ, ఎస్.హెచ్.జి లకు శిక్షణలను ఎం.ఏ.యు.డి డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక పర్యవేక్షిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీలోని యు.సి.డి విభాగాన్ని పటిష్టం చేసేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సూచించారు. 


ఈ కార్యక్రమంలో సి.డి.ఎం.ఏ డైరెక్టర్ శ్రీదేవి, ఎంఏయుడి డిప్యూటీ సెక్రెటరీ ప్రియాంక, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ (యు సి డి) చంద్రకాంత్ రెడ్డి, జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మెప్మా స్టేట్ మిషన్ కో-ఆర్డినేటర్స్  పద్మ, .జీహెచ్ఎంసి ప్రాజెక్ట్ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు

---------------------------------------------------------------

- సిపిఆర్ఓ జీహెచ్ఎంసీ ద్వారా జారీ చేయడమైనది.

No comments:

Post a Comment