Tuesday, 5 November 2024

కమిషనర్ ను కలిసిన* *టీయూడబ్ల్యూజే బృందం* ------

 *కమిషనర్ ను కలిసిన* *టీయూడబ్ల్యూజే బృందం*

రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన 

ఎస్.హరిష్ ను మంగళవారం నాడు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం  మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్బంగా జర్నలిస్టుల ఆయా సమస్యలను వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సలహాలతో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని హరిష్ తెలిపారు. ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలకూరి రాములు, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రాజేష్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, రాష్ట్ర నాయకులు మాతంగి దాస్ లు ఉన్నారు.


A delegation of Telangana State Union of Working Journalists (TUWJ) led by its State President 

K.Virahath Ali on Tuesday called on S Harish, Commissioner, Information & Public Relations (I&PR) Department, Telangana, at Secretariat in Hyderabad. He recently assumed charge as the I&PR Commissioner.

On this occasion, the delegation congratulated the new Commissioner and apprised him of problems being faced by journalists in the State. The new Commissioner assured the delegation that he would address the problems of journalists after taking suggestions from K Sreenivas Reddy, Chairman, the Media Academy of Telangana State.      

TUWJ Deputy General Secretary Kalakuri Ramulu, Treasurer Mothe Venkat Reddy, State Executive committe Member A.Rajesh, Telangana State Small and Medium Newspapers Association president Yusuf Babu and State leader Mathangi Daas took part in the meeting.

No comments:

Post a Comment