నిత్య జనగణమన కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కల్వ సుజాత
హైదరాబాద్, నవంబర్ 14: బాలల దినోత్సవ సందర్భంగా
నల్లకుంట, శివానంద నగర్ లోని నిత్య జనగణమన కేంద్రంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్తా గారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ (చాచా)నెహ్రూ చిత్రపటానికి సుజాత గారు నివాళులర్పించారు. అటు తరువాత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం హాజరైన బాలబాలికలకు చాక్లెట్లను పంచారు. నిర్వాహకులు సుజాత గారికి అభినందన పూర్వక సత్కారం చేశారు. వందే ప్రజ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నేలంటి మధు, రాజ్యలక్ష్మి, ఎంకే శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, బుద్ధ ప్రవీణ్, బాల బాలికలు, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment