Tuesday, 5 November 2024

నూతన పాలసీకి మిల్లర్ల సహకారం అవసరమని రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి,పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహన్ కోరారు.

                     Neelagiri shankaravam:కష్టం మిల్లింగ్  రైస్ (సి ఎం ఆర్), ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పాలసీకి మిల్లర్ల సహకారం అవసరమని రాష్ట్ర పౌరసరఫరాల ప్రిన్సిపల్ కార్యదర్శి,పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహన్ కోరారు.









      మంగళవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో  సమావేశం నిర్వహించారు.


       రాబోయే రోజుల్లో మిల్లింగ్ ఇండస్ట్రీ బలపడాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వల్ల ఇటు రైతులు,అటు ప్రజలు, మిల్లర్లు అందరూ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సేకరించే ధాన్యం విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, సన్నధాన్యానికి రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, మిల్లింగ్ చార్జీలను నాలుగింతలు పెంచడం జరిగిందని, కేవలం 10 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ కేటాయించడం జరుగుతున్నదని, పెండింగ్లో ఉన్న మిల్లర్ల మిల్లింగ్ చార్జీలు, ట్రాన్స్పోర్ట్ చార్జీలను  సాధ్యమైనంత త్వరగా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, రెండు కోట్ల 80 లక్షల మంది రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం అని ,ఇందుకోసం మిల్లర్లు, అధికారులందరూ అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. గత 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 900 కోట్ల రూపాయల ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ను కేంద్రం నుంచి తీసుకురావడం జరిగిందని, ఇకపై మిల్లర్లకు వచ్చే ప్రతి బెనిఫిట్ ను సకాలంలో అందిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్, రబీ సిఎంఆర్ లో నల్గొండ జిల్లా ముందు ఉందని, ఖరీఫ్ 99 శాతం ,రబీ 75% సీఎంఆర్ పూర్తి చేయటం పట్ల ఆయన అభినందించారు .తక్కినది కూడా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఇకపై మిల్లర్లు సీఎంఆర్ చెల్లింపులో డిఫాల్ట్ అన్న పదమే రాకుండా చూసుకోవాలని కోరారు. బ్యాంకు గారెంటీ అన్నది కేవలం సీఎంఆర్ వరకు మాత్రమేనని ,ఎలాంటి బాకీ కి సంబంధం లేదని, మిల్లరు ఎప్పుడు సీఎంఆర్ చెల్లిస్తే అప్పుడు బ్యాంకు గ్యారంటీ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు గ్యారంటీతో పోలిస్తే మిల్లర్లకు వచ్చే లాభం మూడు శాతం ఎక్కువ ఉందని ఆయన చెప్పారు. మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.


        గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ,ఉమ్మడి నల్గొండ జిల్లా ధాన్యం సేకరణ నోడల్ అధికారి అనిత రామచంద్రన్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం సేకరణ చేయాలని కోరారు. రైతు ప్రాధాన్యంగా రైతును దృష్టిలో పెట్టుకొని ఇటు మిల్లర్లు ,అటు అధికారులు కృషి చేయాలని, అన్ని కేంద్రాలలో ట్రాన్స్పోర్ట్ ,ట్రక్స్, తేమ వంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని, ధాన్యం సేకరణను దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.


      జిల్లా మిల్లర్ల సంఘం అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ సన్నరకంధాన్యానికి ఓటీఆర్ నిర్ణయించాలని, పెండింగ్లో ఉన్న మిల్లింగ్ చార్జెస్ వెంటనే రిలీజ్ చేయించాలని, పెండింగ్ లో ఉన్న ఖరీఫ్ ,రబీ సిఎంఆర్ చెల్లింపుకు వెసులుబాటు కల్పించాలని, ఒకటి రెండు టన్నుల చెల్లించాల్సి ఉన్న 33 మిల్లులను డిఫాల్ట్ లో పెట్టకుండా వారికి కూడా సీఎంఆర్ కేటాయించాలని కోరారు.


      మిర్యాలగూడ రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఓ టి ఆర్ సాధ్యం కానీ పక్షంలో ప్రోత్సాహం ఇవ్వాలని, గతంలో పెండింగ్లో ఉన్న చార్జీలు అన్నిటిని ఇప్పించాలని ,ప్రభుత్వం నుండి పూర్తి సహకారాన్ని కోరుతున్నామని, ప్రభుత్వ సహకారంతో బాయిల్డ్ రైస్, రా రైస్, సిఎంఆర్ డెలివరీ సకాలంలో చేస్తామని, చిన్నచిన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని కోరారు.


      అనంతరం కమిషనర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ధాన్యం సేకరణ లో తాలు, తరుగు, తేమ వంటివి నియంత్రించాలని, ప్రతి ధాన్యం కేంద్రానికి ధాన్యాన్ని శుభ్రం చేసే యంత్రాలు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మెకనై జ్డ్ క్లీనర్లు ఏర్పాటు చేయాలని, ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలని, నిబంధనలకు లోబడి తేమ ఉంటే వెంటనే తరలించాలని, సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా గుర్తించి కొనుగోలు చేయాలని, ధాన్యం సేకరణలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని, లీగల్ మెట్రాలజీ అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కాంటాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.


       అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ నల్గొండ జిల్లా రైస్ మిల్లర్లు రాష్ట్రానికే ఆదర్శంగా ఉన్నారని ,అడిగిన వెంటనే ప్రభుత్వం విధించిన షరతులతో బ్యాంకు గ్యారంటీకి అనుమతించడం జరిగిందని తెలిపారు.


      అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ 2024-25 వానకాలం ధాన్యం కొనుగోలుపై వివరాలు సమర్పించారు.


     జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, వ్యవసాయ శాఖ జెడి శ్రవణ్, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, ఎల్డిఎం శ్రామిక్, జిల్లా సహకార శాఖ అధికారి పత్య నాయక్ , రైస్ మిల్లర్ల ప్రతినిధులు, ఏపీఎంలు, అసిస్టెంట్ రిజిస్టర్ లు,తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

_____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

No comments:

Post a Comment