అయోధ్యలో తెలుగు భోజనం
🔹 శ్రీ వాసవీ ఆర్యవైశ్య సత్రం ప్రారంభం
🔹 వసతి, భోజన ఏర్పాట్లకు సిద్ధం
🔹 ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె
హైదరాబాద్ : భూలోక మోక్షపురమైన అయోధ్యలో తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం శ్రీ అయోధ్య వాసవీ ఆర్యవైశ్య నిత్యాన్న సత్రం ప్రారంభమైంది. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని, ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె పూజలు నిర్వహించి, సత్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి గుండా వెంకటేష్ గుప్త, జాయింట్ సెక్రటరీ పల్ల నాగరాజు గుప్త, ట్రస్టీ కొండూరి శ్రీనివాస్ గుప్త తదితరులతో కలిసి అయోధ్య బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, అయోధ్య తో పాటు కాశీ , ప్రయాగ్ రాజ్, నైమిశారణ్యం పరిసర క్షేత్రాల యాత్రలకు వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికులకు సేవలందించాలన్న లక్ష్యంతో సత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. యాత్రలో భాగంగా సందర్శించాల్సిన స్థలాల గైడెన్స్ , వసతి సౌకర్యాలతో పాటు చక్కటి తెలుగింటి భోజనాన్ని, తెలుగు రాష్ట్రాల యాత్రికులకు అందించనున్నట్లు హరినాథ్ గుప్త వివరించారు. పూర్తి సేవా భావంతో అందించే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన తెలుగు రాష్ట్రాల యాత్రికులకు విజ్ఞప్తి చేశారు. తమ సేవలు పొందడం కోసం 9848787611 ఫోన్ నెంబర్ లో సంప్రదించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment