Monday, 4 November 2024

దేవుడా- మా ఇంటి ఆడబిడ్డ అగ్రరాజ్యాన్ని ఏలాలి

 దేవుడా- మా ఇంటి ఆడబిడ్డ అగ్రరాజ్యాన్ని ఏలాలి 

                                     :


Donald Trump vs Kamala Harris: ఇంకొన్ని గంటలు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో నాలుగు సంవత్సరాల పదవి కోసం కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు. "H1B Visas: అమెరికా ఎన్నికల్లో కీలకంగా H1B వీసాలు.. ట్రంప్ గెలిస్తే ఎలా ఉంటుందంటే.." ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం సాధించాలంటూ మొన్నటికి మొన్న తెలంగాణలో రాజశ్యామల మహాయాగం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ నెల 20వ తేదీన ఈ యాగం ఆరంభమైంది. 11 రోజుల పాటు సాగింది. 30వ తేదీన పూర్ణాహుతితో ముగిసింది. ఇప్పుడు తాజాగా తమిళనాడు తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురంలోనూ యజ్ఞయాగాదులు నిర్వహించారు గ్రామస్తులు. తమ ఇంటి బిడ్డ అగ్రరాజ్యం పీఠాన్ని ఏలాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలను జరిపారు. సోమవారం ఉదయం నుంచీ రాత్రి వరకూ స్థానిక ఆలయాలకు బారులు తీరారు. హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తులసేంద్రపురంలో పెద్దఎత్తున కమలా హ్యారిస్ బ్యానర్లు, ప్లెక్సీలు వెలిశాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సందర్భంగా గ్రామస్తులు ఆమె ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలను కట్టారు. శ్యామల గోపాలన్ పుట్టిన ఊరు ఇదే. "US Election: సర్వేల్లో దూకుడు పెంచిన ట్రంప్..!" కమలా హ్యారిస్‌ది ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. ఆమె తాత పీవీ గోపాలన్.. భారత రాయబారిగా పనిచేశారు. పలు దేశాల్లో ఆయన విధులను నిర్వర్తించారు. కమలా హ్యారిస్ తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ 65 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒంటరిగా అమెరికాకు తరలి వెళ్లారు. ఓక్లాండోలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. యూసీ బర్కెలి నుంచి డాక్టరేట్ పొందారు. బ్రెస్ట్ కేన్సర్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్‌ను ఆమె పెళ్లాడారు. డొనాల్డ్ హ్యారిస్.. జమైకాకు చెందిన ఎకనమిస్ట్.

No comments:

Post a Comment