Sunday, 3 November 2024

కార్తీక సోమవారం ఇలా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం, అష్టైశ్వర్యం!


 కార్తీక సోమవారం ఇలా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం, అష్టైశ్వర్యం!  

                         కార్తీకమాసం చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసం శివుడికి, విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో కార్తీక సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక సోమవారం నాడు ఎవరైతే అత్యంత భక్తితో శివుడిని పూజిస్తారో వారు అనుకున్న కోరికలు తీరుతాయి. వారు చేసిన పాపాలన్నీ తొలగిపోయి శివ సాయుజ్యం వారికి లభిస్తుంది. కార్తీక సోమవారం ప్రాధాన్యత ఎవరైతే కార్తీక సోమవారం నాడు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి మీరు చేసిన అన్ని చెడు పనుల నుండి విముక్తి లభిస్తుంది. రేపు కార్తీక మాసంలో మొదటి సోమవారం కార్తీక సోమవారానికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో కార్తీక సోమవారం నాడు శివారాధన ఏ విధంగా చేస్తే మంచి జరుగుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. "నేడు అత్యంత శక్తివంతమైన కార్తీకమాస సంకష్టహర చతుర్ధి.. ఇలా చేస్తే అన్నీ విజయాలే!!" కార్తీక సోమవారం ఇలా చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కార్తీకమాసంలో పరమేశ్వరుని అనుగ్రహం పొందడం కోసం ఉదయాన్నే నిద్ర లేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి శివాలయంలో శివునికి అభిషేకాలు, అర్చనలు చేస్తే మంచి జరుగుతుంది. కార్తీక సోమవారం నాడు చేసే స్నానం, పూజ, జపం, ఉపవాసం అన్నీ అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలంతో సమానం అని చెప్తారు. కార్తీక సోమవారం ఉపవాసంతో శివుడి అనుగ్రహం కార్తీక సోమవారం నాడు శివాలయ సందర్శనం శుభాలను చేకూరుస్తుంది. కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేయడం లేదా ఏకభుక్తం ఉండడం ,ఎవరి శక్తి మేరకు వారు దానధర్మాలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే శివుని పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం ఉంటుందని, శివయ్య జీవితంలో వారికి కావలసిన ప్రతి ఒక్కటి ఇస్తాడని చెబుతారు. New Ration Card పై కసరత్తు... జనవరిలో పంపిణీ.. తెల్ల రేషన్ కార్డుల్లో మార్పు..? |Oneindia Telugu SKIP ఒక్కరోజు ఉపవాసం కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్యం కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి శివుని పూజించడం కోటి సోమవారాలు ఉపవాసం చేసి శివుడిని పూజించనంత పుణ్యఫలితం వస్తుందని చెబుతారు. కార్తీక సోమవారం నాడు శివుని పూజించి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి నిష్టగా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రివేళ కటిక నేలపై నిద్రపోయిన కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారికి ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు. "కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలంటే.." పాప విమోచనం కోసం కార్తీక సోమవారం కార్తీక సోమవారం నాడు ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని, శివుడాజ్ఞ లేకుంటే చీమైనా కుట్టదు కాబట్టి పరమశివుడు వారిని అన్ని విధాలుగా కాపాడతాడని, అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. చేసిన పాపాల నుండి విముక్తి లభించి మోక్షం కలగాలంటే కార్తీక మాసంలో చేసే పూజలు దానాలు వ్రతాలే కారణమవుతాయని చెబుతారు. .

No comments:

Post a Comment