Sunday, 17 November 2024

: ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి


 : ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

 : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో నెం.41 ద్వారా రెండేళ్ల పాటు ఈవీ పాలసీ అమల్లో ఉంటుందన్నారు. ఈవీ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి  

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, పన్ను మినహాయింపు- రేపటి నుంచి తెలంగాణలో ఈవీ పాలసీ అమల్లోకి

తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ నవంబర్ 18, 2024 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఈ పాలసీ ప్రకారం ఈవీల్లో టూ వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వాహనాలకు వందశాతం పన్ను మినహాయింపు ఉంటుందన్నారు. వీటితో పాటు ఈవీల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఇస్తున్నామని ప్రకటించారు. జీవో నెంబర్ 41 ద్వారా ఈవీ పాలసీ అమల్లోకి తెస్తున్నామన్నారు.



హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ...దిల్లీ మాదిరిగా హైదరాబాద్ లో కాలుష్యం రాకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. బైక్ లు , ఆటో , ట్రాన్స్ పోర్ట్ , బస్సులకు వందశాతం పన్ను మినహాయింపు ఇస్తున్నామన్నారు. అలాగే జంట నగరాల్లో ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.


No comments:

Post a Comment