జిల్లా రిజిస్టార్ కనుసైగల్లో అక్రమ
వసూళ్లు- కూకట్ పల్లి రిజిస్టార్ పరిధిలో అంతులేని అవినీతి
- కాసులు ఇస్తే అక్రమాలన్ని సక్రమమే లక్షల్లో వసూలు చేస్తున్న సబ్ రిజిస్టార్లు
- అవినీతికి అడ్డాగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు?
- లేదంటే నిబంధనల పేరిట పక్కన పెట్టేస్తారు.
- ప్రొబిటెడ్ లో ఉన్న భూములు సైతం రిజిస్ట్రేషన్
- అయ్యప్ప సొసైటీ ప్రొబిటెడ్ భూములను కూడా వదలని రిజిస్టార్లు
- ప్రభుత్వం పట్టించుకోవాలి ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి
- జిల్లా రిజిస్టార్లు, సబ్ రిజిస్టార్ లపై విజిలెన్స్ ఎంక్వరై చేస్తే అవినీతి బాగోతాలు బట్టబయలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి ఆదాయ వనరులలో ముఖ్య భూమిక పోషించే వాటిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి.ఈ శాఖలో కమిషనర్, ఐజి, జాయింట్ ఐజి, డిఐజి, జిల్లా రిజిస్టార్, సబ్ రిజిస్టార్, ఇతర సిబ్బంది ఉంటారు. వీరికి లక్షల్లో జీతాలు, అలవెన్స్‌లు ఉంటాయి. అయినా అక్కడ అంతా పైసా వసూల్ రాజ్యం నడుస్తుంది. పైసలిస్తే చాలు అన్ని పనులు ఆఘమేఘాల మీద కానిచ్చేస్తారు. లేదంటే నిబంధనల పేరిట కొర్రీలు పెట్టి ఇబ్బందులు సృష్టిస్తారు. కాసులు ఇస్తే కోర్టు ఆర్డర్లను, ప్రొబిటెడ్ లిస్ట్‌ను సైతం లెక్కచేయకుండా అట్టి పనులు పూర్తి చేశారు.
అంతా రిజిస్టార్ ల ఇష్టం.. అడిగేదెవరు.
జిల్లా రిజిస్టార్ కింద ఉండే ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేసే సుమారు ఐదుగురు నుంచి పది మంది వరకు ఉంటారు. వీరిని ప్రభుత్వం నియమించదు. సబ్ రిజిస్ట్రార్ నియమిస్తారు. ఒక్కొక్క కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు దాదాపుగా రూ.15 నుండి రూ.20వేల వరకు వేతనాలు ఇస్తారు. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒకవేళ ఐదుగురు డైలీ వేసి ఇబ్బంది ఉంటే నెలకు 75 నుండి లక్ష రూపాయల వరకు జీతాలు ఇవ్వవలసి వస్తుంది. ఒకవేళ సబ్ రిజిస్ట్రార్ నిజాయితీపరుడు అయితే నెలకు లక్ష రూపాయలు వీరికి ఎలా ఇస్తాడో మరి. ఇవి కాకుండా ఆఫీస్ ఖర్చులు ఉంటాయి. వీటన్నిటికీ సబ్ రిజిస్టర్ గాని, డిస్టిక్ రిజిస్టర్ గాని ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందో అధికారులే తెలుపాలి.. వీటన్నింటికి పైన వచ్చే ఆమ్యమ్యాలే ఆధారం. రోజుకు లక్షల్లో ఆదాయం ఉంటుందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇవి కాకుండా రోజువారిగా జరిగే రిజిస్ట్రేషన్లలో కారణాలు చెప్పి డాక్యుమెంట్ మొత్తం రెడీ అయిన తర్వాత కూడా ఇటు కొనేవారు, అటు అమ్మిన వారు సాక్షులతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చిన తర్వాత రకరకాల కారణాలు చెప్పి భయభ్రాంతులను సృష్టించి ఇప్పుడు చేయలేమని డాక్యుమెంట్ రైటర్ ను అడ్డుపెట్టుకొని లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారు. వారు అడిగినంత ముట్ట చెపితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. లేదంటే ఆ డాక్యుమెంట్ అవ్వనట్టే.. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోరు. కారణం వారికి కూడా వాటాలు ముడుతాయి కాబట్టి పై ఆఫీసర్ నుండి సబ్ రిజిస్టార్ వరకు పూర్తి సహకారం లభిస్తుంది. అందుకే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు.
పైసలిస్తే అన్ని అయిపోతుంటాయి అలా అలా.
జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లలో కాంట్రాక్ట్ లేదా డైలీ వైస్ గా పనిచేసే ఉద్యోగస్తులు వీరికి వచ్చే అక్రమ సంపాదనలు వెతుక్కుంటారు. ఉదాహరణకు ఈసి , సీసీ, మార్కెట్ వాల్యూలు గవర్నమెంట్ ఫీజు కట్టకుండానే సదరు వ్యక్తులకు ఇస్తుంటారు. వీరి పైన సబ్ రిజిస్టర్ నిఘా ఉండదు. కారణం వీరు ఇచ్చే డబ్బులే. ఈ విషయాన్ని పై అధికారులకు తెలిపిన కూడా వారు పట్టించుకోరు.
ఆడిటింగ్ అంతంతమాత్రమే.
సబ్ రిజిస్టర్ ఆఫీసులో సాధారణంగా జరిగే డాక్యుమెంట్లను మాత్రమే ఆడిటింగ్ చేసి చేతులు దులుపుకుంటారు. కానీ ఆఫీస్ లో ఏం జరుగుతుందో, రికార్డులు భద్రంగా ఉన్నాయా, ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వారిని ఎవరు నియమించారు. వారికి జీతాలు ఎలా వస్తున్నాయి. అనే విషయాన్ని మాత్రం ఆడిటింగ్ చేయరు. కారణం వాళ్ల నుంచి వచ్చే ఆదాయంలో అందరికీ వాటాలు వస్తున్నాయి.ఒక వ్యక్తి ఒక డాక్యుమెంట్ పట్టుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వస్తే, ఆ డాక్యుమెంట్ లో చిన్న లోపాన్ని చూపిస్తూ గజమునకు సుమారు 100 నుండి 5000 రూపాయల వరకు వసూలు చేస్తారు. అదేవిధంగా డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక్కొక్క వ్యాలిడేషన్‌కు 6 లక్షల నుండి 10 లక్షలు పైన వసూలు చేస్తుంటారు. ఈ డబ్బులు వారి వారి హోదా తగ్గట్టుగా వాటాలు ఉంటాయని బహిరంగంగా డాక్యుమెంట్ రైటర్లకు తెలిసిన విషయమే.
ప్రైవేట్ వ్యక్తులు చెప్పిందే వేదం.
ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది గత 15 సంవత్సరాల నుండి రికార్డ్ సెక్షన్లో పనిచేస్తున్నారు. వారు ఇప్పటివరకు కోట్లరూపాయలు సంపాదించారు. వారు ఏ కారణం చేతైనా ఆఫీసుకు రాకపోతే సబ్ రిజిస్టర్ గాని, జూనియర్ అసిస్టెంట్ గాని, రికార్డ్ అసిస్టెంట్ గాని, మిగతా ఉద్యోగులకు రికార్డులు దొరకవు. అందరూ వారిపైన ఆధారపడి ఉండేటట్లు చేసుకున్నారు. ఆఫీసులో ఉండే అన్ని రికార్డులు వారి చేతిలోకి వెళ్ళిపోయాయి. కావున ఏది కావాలన్నా దానికి ఒక రేటు ఉంటుంది. ఏ పనైనా చేయగలరు. లేదంటే రికార్డు దొరకలేదని, రికార్డు మిస్ అయిందని, ఆ డాక్యుమెంట్ మా దగ్గర కాలేదని కారణాలతో ముప్పు తిప్పలు పెడతారు. అధికారుల పర్యవేక్షణ కొరవడితే ఇలానే ఉంటుంది పరిస్థితి మరి.
అయ్యప్ప సొసైటీలో ప్రొబిటెడ్ భూములను రిజిస్ట్రేషన్ చేసిన వైనం
జిల్లా రిజిస్టర్ పరిధిలోని కూకట్పల్లి డివిజన్లో గల మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ప్రొబిటెడ్ లో ఉన్న భూములను ప్లాట్ లను కూడా డబ్బులు ఇస్తే అన్ప్రొబితెద్ కింద మార్చి జిల్లా రిజిస్టార్ ఆదేశాల మేరకు ప్లాట్ నెంబర్ కాకుండా హౌస్ నెంబర్ ను వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకు లక్షల్లో లంచాలు తీసుకుంటూ యదేచ్ఛగా కొనసాగిస్తున్నారని కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇందుకు ఒక జిల్లా రిజిస్టర్ పరిధిలో ఉన్న సబ్ రిజిస్టార్లలో జరుగుతుండడం చూస్తుంటే ఆ సబ్ రిజిస్టార్లకు పై అధికారుల అండదండలు పుష్కలంగానే ఉన్నాయని అనుకుంటున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు విచారణ జరిపిస్తే మరిన్ని వీరి అవినీతి లీలలు బయటకు వస్తాయని అంటున్నారు.
ఉన్నతాధికారులు పట్టించుకోవాలి.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి సబ్ రిజిస్టర్ ఆఫీస్, డిస్టిక్ రిజిస్టర్ ఆఫీస్ లను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. లేదంటే తెలంగాణ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అవినీతిమయంలో ఇంకా మునిగిపోయే ప్రమాదం ఉంది.
No comments:
Post a Comment