ఎక్కడ చూసినా నగదే!.. ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి అవినీతి బాగోతం
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఎక్కడ చూసినా నగదే!.. ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి అవినీతి బాగోతం
హైదరాబాద్, ఫిబ్రవరి 20: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతం మరవక ముందే మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే జ్యోతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ విషయం...
లంచం తీసుకుంటున్న ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతిని పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆపై జ్యోతి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆ అధికారిణి నివాసంలో ఎక్కడబడితే అక్కడ నగదును, బంగారాన్ని అధికారులు గుర్తించారు. ఇంతటి బంగారాన్ని చూసి అధికారులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. దాదాపు రూ.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జ్యోతిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు... మరికాసేపట్లో కోర్టులో హాజరుపరుచనున్నారు.
No comments:
Post a Comment