మేడారం జాతరలో డ్యూటీలో ఉన్న ఎస్సైని కొట్టిన ఎస్పీ.. కారణం ఏంటంటే..!
మేడారం జాతరలో తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క దర్శనానికి వెళ్తున్న ఏఆర్ ఎస్సై రవికుమార్ ను అతని ఫ్యామిలీ మెంబర్స్ ముందే ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కిందిస్థాయి పోలీసు సిబ్బందితో పాటు ఆయన కు. మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారి చేయిచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడం చర్చనీయాంశమైంది. విధుల్లో ఉన్న పోలీసులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు కల్పించుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మేడారంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. తన భర్తను మర్డర్ చేసిన నేరస్థుడిలాగా ట్రీట్ చేశారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కాలర్ పట్టుకొని నేరస్థుడిలా లాక్కొని వెళ్లారన్నారు. ఎస్పీకి హోదా ఉందని కాలు మీద కాలేసుకొని కూర్చొని తన భర్తను నేలపై కూర్చోబెట్టారన్నారు. తాను ఓ బెగ్గర్లాగా ఎస్పీ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వినకుండా ఆయన పాస్ లాక్కొని నీచంగా ప్రవర్తించారన్నారు. ఆడబిడ్డ కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదని రవి కూమార్ భార్య మీడియా ముందు వాపోయారు.
No comments:
Post a Comment