తెలంగాణ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు - శాఖలకు నిధుల కేటాయింపు ఇలా!
2024-25: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ రూ.2,75,891 కోట్లుగా ప్రతిపాదించారు.
తెలంగాణ బడ్జెట్ రూ.2,75,891 కోట్లు - శాఖలకు నిధుల కేటాయింపు ఇలా!
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి భట్టి విక్రమార్క
: తెలంగాణ అసెంబ్లీలో 2024-25 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పద్దును సభ ముందు ఉంచారు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా అంచనా వేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక ఏడాదిలో తొలి 3 నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్ లో పొందుపరిచినా.. అంచనాలను మాత్రం ఏడాది మొత్తానికి ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారని.. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి భట్టి తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పథకాలు గొప్ప అని అమలు మాత్రం దిబ్బ అని అన్నారు. గత పాలకుల నిర్వాకంతో ధనిక రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీలు సహా వివిధ శాఖలకు బడ్జెట్ లో నిధులు కేటాయించారు.
శాఖలకు కేటాయింపులు ఇలా
ఆరు గ్యారెంటీల అమలుకు రూ.53,196 కోట్లు
వ్యవసాయ రంగానికి రూ.19,746 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
విద్యా రంగానికి రూ.21,389 కోట్లు
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు
మూసీ ప్రాజెక్టుకు రూ.1000 కోట్లు
ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు
మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.8,000 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
No comments:
Post a Comment