మేడారం జాతర విశిష్టత; సమ్మక్క సారలమ్మల చరిత్ర!!
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర..
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన, ఎడ్లబండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్ లోను మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. మేడారం జాతర అందరి జాతర: అసలు మేడారం మహాజాతరకు ఎందుకీ విశిష్టత? సమ్మక్క సారలమ్మలను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు? వారి చరిత్ర ఏమిటి? వన్ ఇండియా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఒకప్పుడు మేడారం జాతర అంటే.. గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర.. కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర.. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే, కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. Medaram: జనసంద్రంగా మేడారం.. నేడే మహాజాతర ప్రారంభం.. పెద్దపులుల కాపలా మధ్య పసిపాప: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. మేడారం జాతర కొనసాగుతున్న వేళ జాతీయ హోదా కోసం ఎంతోకాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే.. పూర్వం కోయదొర మేడరాజు వేటకోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడివారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. సమ్మక్కకు పగిడిద్ద రాజుతో వివాహం: ఆ పాపను తన గూడెం కి తీసుకు వెళ్లిన కోయరాజు, పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవత గా భావించి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను ప్రాంతాన్ని మేడ రాజు కాకతీయ రాజులకు, సామంత రాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. TS EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ నేడే విడుదల కప్పం కట్టలేమన్న మేడారంపై కాకతీయ రాజుల యుద్ధం: కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిడిద్దరాజు సామంత రాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా, కాకతీయ రాజులు మేడారం పై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది. కాకతీయులతో పోరాడి అమరులైన సమ్మక్క కుటుంబం: కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారం పై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు, బల్లలేతో సమ్మక్క సేన వీరోచితంగా కాకతీయుల పై పోరాడింది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనలు వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్‌న్యూస్ జంపన్న ప్రాణ త్యాగం. చిలకలగుట్టపై అంతర్ధానమైన సమ్మక్క: వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పటినుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట పైకి సమ్మక్క వెళ్ళింది. అంతర్ధానమైంది. సమ్మక్క భక్తుడిగా ప్రతాప రుద్రుడు.. జాతర నిర్ణయం: ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరిణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకుని సమ్మక్క భక్తుడిగా మారినా, రెండేళ్లకోసారి సారలమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించినా, గిరిజన రాజ్యం పై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. మేడారం జాతరకు వీరి రాకతో బీజం: ఇక అప్పటినుండి ఇప్పటివరకు రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధలతో సమ్మక్క సారలమ్మల జాతర కొనసాగుతుంది. కుంకుమ భరిణెను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులును కొండాయి నుండి, పగిడిద్దరాజును పూనుగొండ్ల నుండి తీసుకువస్తారు. సమ్మక్క, సారలమ్మల ఆగమనం .. వన ప్రవేశం: ఆ తరువాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత, తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు. అందరూ గద్దల పైన కొలువుతీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వన ప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహా జాతర ముగుస్తుంది. ఇదీ మేడారం జాతర విశిష్టత మరియు చరిత్ర.
No comments:
Post a Comment