తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ వారికే... రేవంత్ సర్కార్ మార్గదర్శకాలివే!!
తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ కోరినట్టే ప్రజలు ఓటేసి కాంగ్రెస్ కు తెలంగాణా లో పట్టం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో పడింది.
ఆరు గ్యారెంటీల అమలులో బిజీగా ఉంది తెలంగాణా ప్రభుత్వం . ఇందులో భాగంగా ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ ఉచిత విద్యుత్ హామీని అమలు చేసేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పొందాలి అంటే కొన్ని షరతులు పెట్టింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ లభించనుంది.
అలాగే ఒక ఇంటికి ఒక మీటర్ ఉన్న వారికే ఈ పథకం అమలవుతుంది. అద్దె ఇళ్ళలో ఉన్న వారు సైతం ఈ స్కీం ను పొందవచ్చు.ఇక ఈ పథకం వర్తించాలంటే వారు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే వారై ఉండాలి. 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి 2,181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి.
ఇక ఇది కూడా ఎలాగంటే ఒక వినియోగదారుడు 1500 యూనిట్లు కరెంట్ వాడితే దానికి 10 శాతం కలిపి 12నెలలకు దానికి 10 శాతం కలిపి ,. ఆ మొత్తం కరెంట్ ను 12 నెలలకు విభజించి ఆ యూనిట్లను మాత్రమే ఉచితంగా ఇస్తారు. మిగతాది లెక్క కడతారు. ప్రతీనెలా మీటర్ రీడింగ్ తో 10 రోజుల పాటు మొదటి వారంలోనే ఉచిత విద్యుత్ కు లభ్దిదారుల గుర్తింపు ఉంటుంది.
మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్ కు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంట్ ఫ్రీగా ఇచ్చే లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
No comments:
Post a Comment