ఆంగ్లేయులపాలిట సింహ స్వప్నం
దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి వారిలో చంద్ర శేఖర్ ఆజాద్ ఒకరు.సాయుధ పోరాటం చేసి అమరుడైన చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాడు.
భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఆయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు. 1857 తరువాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.
1919 లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకి ఆయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారిపోయారు.
ఒకానొక దశలో ఆజాద్ బ్రిటీష్ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌ను తయారు చేసుకున్న ఆయన వారిని చంపేదాకా వదిలిపెట్టలేదు. పదిహేనేళ్ల ప్రాయంలో అరెస్టయిన తరువాత బయటికి వచ్చి పోరాటంలో పాలుపంచుకున్న ఆజాద్... ఆ తరువాత తన మరణం దాకా కూడా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు.
అయితే 1931, ఫిబ్రవరి 27న తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.
కకోరి కుట్రగా పేరు పొందిన , ఆగష్టు 9, 1925న ఇప్పుడు మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తర-మధ్య భారతదేశంలో రైలులో జరిగిన సాయుధ దోపిడీ లోప్రమేయం ఉందని ఆరోపించబడిన 20కి మందికి పైగా వ్యక్తులపై బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కేసులు పెట్టి విచారణ చేస్తున్న సమయంలో చంద్ర శేఖర్ ను నీ పేరెంటీ అని ఓ బ్రిటిష్ న్యాయవాది అడగగా నా పేరు ఆజాద్ అని ఆయన చెప్పారు.అప్పటి నుంచి ఆయన చంద్ర శేఖర్ ఆజాద్ గా పేరు పొందారు.
ఫిబ్రవరి 27 చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకుని
No comments:
Post a Comment