Tuesday, 27 February 2024

రూ. 500ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల అమ‌లు దేశానికి ద‌శ దిశ నిర్ధేశం చేయ‌నుంది.*

 *రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల‌ను ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌ గారు మరియు రహదారులు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.‌‌..*


*రెండు గ్యారెంటీలను ప్రకటించిన ఈ రోజు చాలా చారిత్రాత్మ‌క‌మైన రోజు.*


*రూ. 500ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల అమ‌లు దేశానికి ద‌శ దిశ నిర్ధేశం చేయ‌నుంది.*





*విప్ల‌వాత్మ‌కంగా చేసిన ఆలోచ‌న నిర్ణ‌యాల్లో భాగ‌మే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు*


*పేద‌, మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తారా?  లేదా అనే ఆలోచ‌న‌తో దేశం ఎదురు చూస్తున్న‌ది.*


*అమ‌లుకు సాధ్యం కాని 6 గ్యాంర‌టీలు ప్ర‌ట‌కించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌దు, చేయ‌బోద‌ని కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల నుంచి బిఆర్ఎస్ అసత్య ప్ర‌చారం చేసింది.*


*గ‌త 10 సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న చేసిన బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ధ‌నిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది.*


*ఉద్యోగులకు జీతాలు ఇవ్వ‌లేని దుస్థితికి ఈ రాష్ట్రాన్ని గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకెళ్లింది.*


*బ్యాంకుల నుంచి ఓ.డి లు తెచ్చి జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకెళ్లింది.*


*బిఆర్ఎస్ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా అప్పులు చేయ‌డం వ‌ల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ వాట‌న్నింటిని అధిగ‌మించి 6 గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ప్ర‌తి రోజు క‌స‌ర‌త్తు చేస్తున్నాము.*


*రాష్ట్రంలో ఒక వైపు నిధుల‌ను సమీక‌రించుకుంటూ.. మ‌రో వైపు దుబారా ఖ‌ర్చుల‌ను పూర్తిగా త‌గ్గించి నెల‌లో మొద‌టి వారంలో ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇచ్చే స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువ‌చ్చాము.*


*అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలు అమ‌లు చేశాము. ఈ రోజు నుంచి మ‌రో 2 గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాము.*


*వినియోగ ‌దారుల‌కు నేరుగా ప్ర‌భుత్వం నుంచి గ్యారంటీల ల‌బ్ధి అంద‌డానికి కేంద్ర ప్ర‌భుత్వంతో కూడ ప్ర‌ణాళిక చేసుకొని ఈ 2 గ్యారంటీల అమ‌లు కార్యాక్ర‌మానికి నాంధి ప‌లికాము.*


*ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డ‌మే ఇందిర‌మ్మ రాజ్య సంక‌ల్పం, ల‌క్ష్యం.*


*ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న, అప్పులు ఎన్ని ఉన్న, ఎన్ని ఒడిదుడుకులు ఉన్న, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల లను తూచా తప్పకుండా అమలు చేస్తాం.*


*200 యూనిట్ల వరకు అందించే ఉచిత గృహ విద్యుత్తు విషయంలో అనేక కోతలు ఆంక్షలు పెడుతారని బిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేసింది*


*రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే పథకం ఈరోజు లాంచనంగా ప్రారంభించాం*


*వచ్చే మార్చి నెలలో జీరో బిల్ ఇస్తాం. 200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు*


*తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్నికల ప్రచార సభలో గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారికి ధన్యవాదాలు*

No comments:

Post a Comment