Wednesday, 14 February 2024

శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ

 శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ


హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరూ..


ఆయనకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విలువైన భూములు, స్థలాలు వారి పేరు మీద ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం మరోసారి వీరిని విచారించనున్నారు. కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు శివ బాలకృష్ణ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో..


మరింత లోతుగా అతని బినామీలను ఏసీబీ ప్రశ్నించనుంది. మరికొందరిని ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరా తీస్తున్నారు. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తున్నారు.

No comments:

Post a Comment