పోలీస్ కార్యాలయంలో కెమిస్ట్ & డ్రగ్గిస్ట్స్ యజమానులతో సమావేశం
.ఏటువంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్పీ చందనా దీప్తి
ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా అలవాటు ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్నందున, ఇటీవల ఒక మెడికల్ షాప్ పైన కేసు పెట్టడం జరిగిందనీ, ఎటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్‌లు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కెమిస్ట్ & డ్రగ్గిస్ట్స్ యజమానుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి మెడికల్ షాప్ యజమానులు సంబంధిత నార్కోటిక్ డ్రగ్స్ విక్రయించుటకు నియమనిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండాలని లైసెన్స్ ప్రకారమే మందులు విక్రయించాలని తెలిపారు.ఎలాగైతే షెడ్యూల్ H,H1,X ప్రకారం సంబంధిత లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే సంబంధిత మందులు విక్రయించాలని అన్నారు. ఏవరైన డ్రగ్ లైసెన్స్ లేకుండా ఔషధాలను విక్రయించిస్తే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.
18(సి) ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 27(బి)(i) ప్రకారం సంబంధిత లైసెన్స్ ప్రకారం బిల్ నంబర్,డాక్టర్ పేరు, వినియోగదారుని పేరు డ్రగ్ పేరు, అన్ని రిజిస్టర్ లో నమోదు చేయాలి లేని యడల శిక్షారులు అవుతారని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నిబంధన ప్రకారం నడవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోలర్ దాసు,సిఐలు రుద్వీర్ కుమార్,శ్రీను,కెమిస్ట్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేంకటపతి మరియు మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment