Thursday, 29 February 2024

ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌లుంటే ప్ర‌భుత్వ‌ ఉద్యోగం రాదు: సుప్రీంకోర్టు

 ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌లుంటే ప్ర‌భుత్వ‌ ఉద్యోగం రాదు: సుప్రీంకోర్టు

కుటుంబ నియంత్ర‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఇద్ద‌రు పిల్ల‌ల క‌న్నా ఎక్కువ ఉన్న వ్య‌క్తుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌కపోవ‌డం స‌రైందేన‌ని చెప్పింది.

If you have more than two children, you cannot get a government job: Supreme Court ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌లుంటే ప్ర‌భుత్వ‌ ఉద్యోగం రాదు:  సుప్రీంకోర్టు

ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌లుంటే ప్ర‌భుత్వ‌ ఉద్యోగం రాదు: సుప్రీంకోర్టు ( Image Source :Getty )


Supreme Court on Govt jobs: రాష్ట్ర ప్ర‌భుత్వ(State govt) ఉద్యోగాల‌(Jobs)కు సంబంధించి దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. జ‌నాభా నియంత్ర‌ణ‌, కుటుంబాల ఆర్థిక ప‌రిస్థితుల‌ను దృష్టిలో పెట్టుకుని రాజ‌స్థాన్(Rajastan) ప్ర‌భుత్వం(Govt) తీసుకున్న నిర్ణ‌యాన్ని, అమ‌లు చేస్తున్న చ‌ట్టాల‌ను కూడా సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఈ క్ర‌మంలో ఒక కుటుంబంలో ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే.. అలాంటి కుటుంబంలోని వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోవ‌డం స‌రైందేన‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇది రాజ్యాంగానికి వ్య‌తిరేకం కాబోద‌ని.. రాష్ట్ర విస్తృత ప్ర‌యోజ‌నం, ప్ర‌జ‌ల అభ్యున్న‌తి, వ‌న‌రులు, మౌలిక స‌దుపాయాల‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణ‌యంగా సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు.. దీనిని త‌ప్పుబ‌డితే.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఉద్దేశించిన ల‌క్ష్యానికి తాము విఘాతం క‌లిగించిన‌ట్టు అవుతుంద‌ని పేర్కొంది. రాజ్యాంగం.. చ‌ట్ట నిబంధ‌న‌ల‌కు లోబ‌డే రాజ‌స్థాన్  ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. ``ఇది మంచి నిర్ణ‌యం. రాజ్యాంగ బ‌ద్ధ‌మైన విధానంలోనే తీసుకున్నారు. దీనిని దేశ‌వ్యాప్తంగా కూడా ప‌రిశీలిస్తే మంచిదే`` అని న్యాయ‌మూర్తి ఒక‌రు వ్యాఖ్యానించారు. 


Next







విష‌యం ఏంటి? 


ఎడారి రాష్ట్రం రాజ‌స్థాన్‌(Rajastan)లో 2001-02 మ‌ధ్య ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం జ‌నాభా నియంత్ర‌ణ‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్ర‌మంలో విస్తృత ప్ర‌చారం కూడా క‌ల్పించింది. అయిన‌ప్ప‌టికీ.. జ‌నాభా పెరుగుద‌ల నియంత్ర‌ణ కాలేదు. ఈ నేప‌థ్యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ పిల్ల‌ల‌ను క‌నే కుటుంబాల్లోని వారికి ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చేది లేదని పేర్కొంటూ చ‌ట్టం తీసుకువ‌చ్చింది. ఈ మేర‌కు  రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌(Service rules)  చట్టానికి 2001లో సవరణలు చేసింది. దీని ప్ర‌కారం.. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. రాజస్థాన్‌ పోలీస్‌(Police) సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు క‌న్నా ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ నిబంధ‌న‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తున్నారు.  


ఇదీ కేసు.. 


రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్(Ramji lal Jhat)(జాట్ సామాజిక వ‌ర్గం) అనే వ్య‌క్తి ఆర్మీలో పనిచేశారు. ఈయ‌న‌ 2017లో రిటైర్ అయ్యారు. అనంత‌రం అదే ఏడాది రాజ‌స్థాన్ హోం శాఖ కానిస్టేబుల్‌ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఆయ‌న  ఉద్యోగానికి ఎంపిక‌య్యాడు. అయితే.. కుటుంబ స‌ర్వేలో ఆయ‌న‌కు ఏకంగా ఐదుగురు పిల్లులు ఉన్నార‌ని తెలియ‌డంతో అధికారులు ఆయ‌న‌కు చివ‌రి నిమిషంలో ఉద్యోగాన్ని నిరాక‌రించారు.  దీంతో రామ్‌జీ న్యాయ‌పోరాటానికి దిగారు. తొలుత హైకోర్టు ను ఆశ్ర‌యించారు. అయితే.. ఇక్క‌డ కూడా  రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న చ‌ట్టం ప్ర‌కారం ఈ నిర్ణ‌యం స‌రైందేన‌ని కోర్టు పేర్కొంటూ.. పిటిష‌న్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన కోర్టు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. అంతేకాదు.. ఈ చ‌ట్టంలో వివక్ష లేదని, కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో ప్ర‌భుత్వం ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చింద‌ని తెలిపింది. దీనిని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసినా మంచిదేన‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 


దేశ‌వ్యాప్త అమ‌లు సాధ్య‌మేనా? 


దేశ‌వ్యాప్తంగా ఇద్ద‌రు పిల్ల‌ల నినాదం 1980-2000 మ‌ధ్య తీవ్రంగావినిపించింది. ఇద్ద‌రు ముద్దు-ముగ్గురు వ‌ద్దు అంటూ.. పెద్ద ఉద్య‌మ‌మే సాగింది. త‌ర్వాత‌.. ఒక్క‌రు ముద్దు-ఇద్ద‌రు హ‌ద్దు అంటూ క‌ర్ణాట‌క‌, కేర‌ళ‌ల‌లోనూ వినిపించింది. అయితే.. త‌ర్వాత కాలంలో మైనారిటీ వ‌ర్గాల నుంచి వెల్లువెత్తిన నిర‌స‌న‌లు, రాజ‌కీయ ప్రాధాన్యాల నేప‌థ్యంలో జ‌నాభా నియంత్ర‌ణ కేవ‌లం .. కాయితాల‌కే ప‌రిమితం అయింది. కొన్నాళ్లు కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయించుకున్న వారికి ప్రోత్సాహ‌కాలు కూడా ఇచ్చారు. అయితే.. ఇది కూడా సాధ్యం కాలేదు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల విష‌యంలో ఇలాంటి ప‌థ‌కాల‌ను తీసుకురాలేమ‌ని.. రెండేళ్ల కింద‌ట కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. అయితే.. కుటుంబ నియంత్ర‌ణ‌ను మాత్రం అన్ని రూపాల్లోనూ ప్రోత్స‌హిస్తామ‌ని పేర్కొంది. దీనిని రాష్ట్రాల‌కే వ‌దిలి వేసింది. 

Tuesday, 27 February 2024

ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి? ఆధార్ కార్డ్

 ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి? 

ఆధార్ కార్డ్


అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణాలో మహాలక్ష్మి పథకం లో మహిళలు rtc బస్ లో ఉచితంగా ప్రయానించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ.50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. PVC Card పై

ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది.

 పీవీసీ కార్డ్న ఆర్డర్ ఇలా ఆర్డర్ చేసి పొందండి 

*యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు

చేసుకోవాలి.

https://uidai.gov.in/

*యూఐడీఏఐ వెబ్సైట్, మీ 12 అంకెల ఆధార్

నంబర్ను నమోదు చేయండి

*తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి

*ఓటీపీ కోసం Send OTP’పై క్లిక్ చేయండి.

*తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి

*అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి.

*తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. 

*ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి.

*తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి.

 ఇప్పుడు

*నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి.

*అనంతరం పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.

*క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి.

దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి.

చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది.

మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్ అందజేస్తుంది.

పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది.


రూ. 500ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల అమ‌లు దేశానికి ద‌శ దిశ నిర్ధేశం చేయ‌నుంది.*

 *రాష్ట్ర స‌చివాల‌యం లో రూ. 500 ల‌కే గ్యాస్ సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల‌ను ప్రారంభించిన‌ సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌ గారు మరియు రహదారులు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.‌‌..*


*రెండు గ్యారెంటీలను ప్రకటించిన ఈ రోజు చాలా చారిత్రాత్మ‌క‌మైన రోజు.*


*రూ. 500ల‌కే గ్యాసు సిలిండ‌ర్‌, 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత‌ గృహ విద్యుత్తు గ్యారంటీల అమ‌లు దేశానికి ద‌శ దిశ నిర్ధేశం చేయ‌నుంది.*





*విప్ల‌వాత్మ‌కంగా చేసిన ఆలోచ‌న నిర్ణ‌యాల్లో భాగ‌మే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు*


*పేద‌, మధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తారా?  లేదా అనే ఆలోచ‌న‌తో దేశం ఎదురు చూస్తున్న‌ది.*


*అమ‌లుకు సాధ్యం కాని 6 గ్యాంర‌టీలు ప్ర‌ట‌కించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌దు, చేయ‌బోద‌ని కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల నుంచి బిఆర్ఎస్ అసత్య ప్ర‌చారం చేసింది.*


*గ‌త 10 సంవ‌త్స‌రాలు ప‌రిపాల‌న చేసిన బిఆర్ఎస్ ప్ర‌భుత్వం ధ‌నిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది.*


*ఉద్యోగులకు జీతాలు ఇవ్వ‌లేని దుస్థితికి ఈ రాష్ట్రాన్ని గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకెళ్లింది.*


*బ్యాంకుల నుంచి ఓ.డి లు తెచ్చి జీతాలు ఇచ్చే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం తీసుకెళ్లింది.*


*బిఆర్ఎస్ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా అప్పులు చేయ‌డం వ‌ల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ వాట‌న్నింటిని అధిగ‌మించి 6 గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ప్ర‌తి రోజు క‌స‌ర‌త్తు చేస్తున్నాము.*


*రాష్ట్రంలో ఒక వైపు నిధుల‌ను సమీక‌రించుకుంటూ.. మ‌రో వైపు దుబారా ఖ‌ర్చుల‌ను పూర్తిగా త‌గ్గించి నెల‌లో మొద‌టి వారంలో ఉద్యోగుల‌కు వేత‌నాలు ఇచ్చే స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకువ‌చ్చాము.*


*అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలు అమ‌లు చేశాము. ఈ రోజు నుంచి మ‌రో 2 గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాము.*


*వినియోగ ‌దారుల‌కు నేరుగా ప్ర‌భుత్వం నుంచి గ్యారంటీల ల‌బ్ధి అంద‌డానికి కేంద్ర ప్ర‌భుత్వంతో కూడ ప్ర‌ణాళిక చేసుకొని ఈ 2 గ్యారంటీల అమ‌లు కార్యాక్ర‌మానికి నాంధి ప‌లికాము.*


*ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయ‌డ‌మే ఇందిర‌మ్మ రాజ్య సంక‌ల్పం, ల‌క్ష్యం.*


*ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న, అప్పులు ఎన్ని ఉన్న, ఎన్ని ఒడిదుడుకులు ఉన్న, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల హామీల లను తూచా తప్పకుండా అమలు చేస్తాం.*


*200 యూనిట్ల వరకు అందించే ఉచిత గృహ విద్యుత్తు విషయంలో అనేక కోతలు ఆంక్షలు పెడుతారని బిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేసింది*


*రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే పథకం ఈరోజు లాంచనంగా ప్రారంభించాం*


*వచ్చే మార్చి నెలలో జీరో బిల్ ఇస్తాం. 200 యూనిట్ల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు*


*తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని దశా దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్నికల ప్రచార సభలో గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారికి ధన్యవాదాలు*

మేడారం జాతరపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌..


Medaram Jatara | మేడారం జాతరపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌..

 

Medaram Jatara | మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింద.

Medaram Jatara | మేడారం జాతరపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్వీట్‌..

Medaram Jatara | మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని.. మొక్కులు సమర్పించుకున్నారని తెలిపారు. బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకున్నారన్నారు.

మేడారం జన జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ కుటుంబానికి అభినందనలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు. ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నతస్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరిచారన్నారు.

లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్టమైన పనిని సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రయాణ సమయంలో భక్తులు ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించారని.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నామని, ప్రోత్సహిస్తున్నామని మరోసారి నిరూపించారంటూ కొనియాడారు. మేడారం మహాజాతరలో ఆర్టీసీ సేవలను వినియోగించుకుని, సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు

ఆంగ్లేయులపాలిట సింహ స్వప్నం


 ఆంగ్లేయులపాలిట సింహ స్వప్నం

దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి వారిలో చంద్ర శేఖర్ ఆజాద్ ఒకరు.సాయుధ పోరాటం చేసి అమరుడైన  చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాడు.


భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఆయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు. 1857 తరువాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.


1919 లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకి ఆయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారిపోయారు.

ఒకానొక దశలో ఆజాద్ బ్రిటీష్ పోలీసులకు సింహస్వప్నంలా నిలిచారు. పోలీసుల హిట్‌లిస్ట్‌ను తయారు చేసుకున్న ఆయన వారిని చంపేదాకా వదిలిపెట్టలేదు. పదిహేనేళ్ల ప్రాయంలో అరెస్టయిన తరువాత బయటికి వచ్చి పోరాటంలో పాలుపంచుకున్న ఆజాద్... ఆ తరువాత తన మరణం దాకా కూడా ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు.


అయితే 1931, ఫిబ్రవరి 27న తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

కకోరి కుట్రగా పేరు పొందిన , ఆగష్టు 9, 1925న ఇప్పుడు మధ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉత్తర-మధ్య భారతదేశంలో రైలులో జరిగిన సాయుధ దోపిడీ లోప్రమేయం ఉందని ఆరోపించబడిన 20కి మందికి పైగా వ్యక్తులపై బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం కేసులు పెట్టి విచారణ చేస్తున్న సమయంలో చంద్ర శేఖర్ ను నీ పేరెంటీ అని ఓ బ్రిటిష్ న్యాయవాది అడగగా నా పేరు ఆజాద్ అని ఆయన చెప్పారు.అప్పటి నుంచి ఆయన చంద్ర శేఖర్ ఆజాద్ గా పేరు పొందారు.


ఫిబ్రవరి 27 చంద్ర శేఖర్ ఆజాద్ వర్ధంతిని పురస్కరించుకుని

కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి జీకే, గ్రూప్-1, గ్రూప్-2 ప్రిపరేషన్ బుక్స్అందజేశారు

 కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్ర గ్రంథాలయానికి జీకే, గ్రూప్-1, గ్రూప్-2 ప్రిపరేషన్ బుక్స్ ను ఫౌండేషన్ సీఈవో ఎం.వి. గోనారెడ్డి అందజేశారు



. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మధుసూదన్ రెడ్డి, గ్రంథాలయ సీనియర్ అసిస్టెంట్ నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.

Monday, 26 February 2024

వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల*

 వికలాంగుల పెళ్లికి అండగా ఉప్పల*



*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం,మెట్టెలు,చీర, గాజులు విరాళంగా అందజేత.*


సంగారెడ్డి కి చెందిన తండ్రి లేని, నిరు పేద వికలాంగురాలు, *ప్రవళిక వివాహం కోసం..*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో..* తెలంగాణp రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ మరియు ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ *శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు వారి సతీమణి ఉప్పల ఫౌండేషన్ కో చైర్ పర్సన్ ఉప్పల స్వప్న గార్ల చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు,చీర, గాజులు విరాళంగా ఇవ్వడం జరిగింది.*


 *ఈ కార్యక్రమంలో..* పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు, మరియు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ కుమార్, అమ్మ ఫౌండేషన్ అధినేత నాగమళ్ల అనిల్ కుమార్ అరుణ,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివ కృష్ణ,తుల్జమ్మ, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.

మేడారం జాతరలో డ్యూటీలో ఉన్న ఎస్సైని కొట్టిన ఎస్పీ.. కారణం ఏంటంటే..!


 

మేడారం జాతరలో డ్యూటీలో ఉన్న ఎస్సైని కొట్టిన ఎస్పీ.. కారణం ఏంటంటే..!

మేడారం జాతరలో తన కుటుంబసభ్యులతో కలిసి సమ్మక్క దర్శనానికి వెళ్తున్న ఏఆర్ ఎస్సై రవికుమార్ ను అతని ఫ్యామిలీ మెంబర్స్​ ముందే ఆదిలాబాద్ ఎస్పీ ఆలం గౌష్ చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై కిందిస్థాయి పోలీసు సిబ్బందితో పాటు ఆయన కు.           మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారి చేయిచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడం చర్చనీయాంశమైంది. విధుల్లో ఉన్న పోలీసులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు కల్పించుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మేడారంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ మేడారంలో జాతరలో డ్యూటీ చేస్తున్నారు. జాతరలో రోప్ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను క్యూలో పంపించే ప్రయత్నం చేస్తున్న రవికుమార్‌పై అక్కడ డ్యూటీలో ఉన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు. డ్యూటీ వదిలేసి ఫ్యామిలీని.. లోపలికి పంపుతావా అంటూ కుటుంబ సభ్యుల ముందే రవికుమార్‌పై చేయి చేసుకున్నారు.

దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. తన భర్తను మర్డర్ చేసిన నేరస్థుడిలాగా ట్రీట్ చేశారని ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. కాలర్ పట్టుకొని నేరస్థుడిలా లాక్కొని వెళ్లారన్నారు. ఎస్పీకి హోదా ఉందని కాలు మీద కాలేసుకొని కూర్చొని తన భర్తను నేలపై కూర్చోబెట్టారన్నారు. తాను ఓ బెగ్గర్‌లాగా ఎస్పీ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా వినకుండా ఆయన పాస్ లాక్కొని నీచంగా ప్రవర్తించారన్నారు. ఆడబిడ్డ కాళ్లు పట్టుకున్నా.. కనికరించలేదని రవి కూమార్ భార్య మీడియా ముందు వాపోయారు.