*IVF తెలంగాణ ఆధ్వర్యంలో ఘనంగా ఫౌండేషన్ డే వేడుకలు*
ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్టం శ్రీ గంజి రాజమౌళి గారి ఆధ్వర్యంలో 14 వ ఫౌండేషన్ డే ముషీరాబాద్ వాసవి హాస్టలో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి గుప్త గారు మాట్లాడుతూ ఐవిఎఫ్ స్తాపించి 13 సంవత్సరాలు గడిచి 14 ఏట అడుగుపెట్టిన సందర్భంగా కీర్తిశేషులు రామ్ దాస్ దాస్ అగర్వాల్ గారిని గుర్తుచేశారు.పదమూడేళ్ళ క్రితం రామ్ దాస్ అగర్వాల్ గారు నాటిన ఐవిఎఫ్ అనే మొక్క ఎంతో ఎదిగి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నిర్విరామంగా సేవలందిస్తుందని కొనియాడారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి నాయకత్వంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటుందని కొనియాడారు.యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఫౌండేషన్ డే సందర్భంగా ముషీరాబాద్ వాసవి హాస్టల్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ బట్టలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వాసవి సేవకేంద్రం అధ్యక్షులు, ఐ వి ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రయ్య గారు, అడ్వైసర్ ముత్యాల సత్తయ్య గారు, సీనియర్ ఫౌండర్ మెంబర్ ఉడుత పురుషోత్తం గారు,యూత్ అధ్యక్షులు కట్ట రవి కుమార్, యూత్ ట్రెజరర్ నరేష్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ అడిషనల్ ట్రెజరర్ సూర్య ప్రకాష్ గుప్తా,హైదరాబాద్ అధ్యక్షులు పబ్బ మల్లేష్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కాచం కృష్ణమూర్తి,GHMC యూత్ అధ్యక్షులు నవీన్ ,వైస్ ప్రెసిడెంట్ నీలా శ్రీధర్, హైదరాబాద్ జనరల్ సెక్రటరీ చిన్నం సత్యం ప్రవీణ్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.









0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home