Wednesday, 8 July 2026

సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్






 సర్ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరం

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్


          జిల్లాలో ఓటరు జాబితా  ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు.


         బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 15 లక్షల 16 వేల 253 మంది ఓటర్లు ఉన్నారని ,ఇందులో 15 లక్షల 12 వేల 548 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పటివరకు 99.76 శాతం ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. మిగిలిన ఫారాల పంపిణీని కూడా త్వరలో పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపారు.

ఇప్పటివరకు సుమారు 33.58 శాతం ఫారాలను తిరిగి స్వీకరించామని, ఇంకా సుమారు 66 శాతం ఫారాలను సేకరించాల్సి ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్  సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రారంభ రోజుల్లో బీఎల్ఓల పనితీరులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం బిఎల్ఓలు అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ  సహకరిస్తున్నారని తెలిపారు. బీఎల్ఓలు ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి ఫారాల సేకరణ చేపడుతున్నారని పేర్కొన్నారు.

2002 ఓటరు జాబితాకు సంబంధించి ఫారాలను ఎలా నింపాలనే సందేహాలపై ఎన్నికల కమిషన్‌కు వివరించామని, 2002 ఓటరు జాబితాను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇప్పటివరకు 88 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, ప్రతి బీఎల్ఓ వద్ద సంబంధిత జాబితా అందుబాటులో ఉందన్నారు.

మరణించిన ఓటర్ల పేర్లను తొలగించాలని, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. డబుల్ ఓట్లను తొలగించేందుకు ఓటర్లు సహకరించాలని కోరారు. గ్రామంలో ఓటు ఉంచుకోవాలా లేదా పట్టణంలో ఉంచుకోవాలా అనే విషయంలో ఓటర్లు ఒక నిర్ణయం తీసుకొని,  . ఎక్కడైనా ఒకఓటును ఉంచుకోవాలని తెలిపారు.

సర్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలని,  పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఇళ్లు తాళం వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల బీఎల్ఏలు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

కొన్ని కుటుంబాలకు చెందిన ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదై ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అటువంటి సందర్భాల్లో ఫారం-8 ద్వారా కుటుంబ సభ్యుల ఓట్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకునే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఆమోదం తీసుకున్న తర్వాత, జిల్లా స్థాయిలో కూడా ఆమోదం పొంది తుది జాబితాను ప్రదర్శిస్తామని తెలిపారు.

పనిభారం ఎక్కువగా ఉన్న లేదా పనితీరు బలహీనంగా ఉన్న బీఎల్ఓలకు సహాయకులను నియమించామని కలెక్టర్ తెలిపారు. ప్రతి బీఎల్ఓ ఇంటింటికీ తిరిగి ఫారాలు నింపాలని సూచించారు. ప్రతి ఫారంపై సంబంధిత బీఎల్ఓ ఫోన్ నంబర్ ఉంటుందని, ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా సంప్రదించాలని సూచించారు.

అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇచ్చే సూచనలను పరిశీలించి, అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. సర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

            ఈ సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్  జె శ్రీనివాస్ ,రెవెన్యూ అధికారి దశరథ, కాంగ్రెస్ పార్టీ  ప్రతినిధి ముంతాజ్ అలీ ,బి ఆర్ఎస్ నుండి బక్క పిచ్చయ్య ,బిజెపి తరఫున లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ధర్మసమాజ్ పార్టీ ప్రతినిధి రవికుమార్, ఆప్  పార్టీ నుండి రవీందర్,ఎంఐఎం. నుండి కలీం ,

టిడిపి  నుండి రవి తదితరులు పాల్గొన్నారు .

____________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home