Wednesday, 29 October 2025

ACB అధికారులకు పట్టుబడ్డ పెద్దఅంబర్ పేట AE..!!*

 *ACB అధికారులకు పట్టుబడ్డ పెద్దఅంబర్ పేట AE..!!*



అబ్దుల్లాపూర్మెట్ మం. పెద్దఅంబర్పేట ఏఈ ప్రభులాల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరెంట్ కనెక్షన్, మీటర్ రీప్లేస్మెంట్, బిల్లింగ్ సమస్యలు పరిష్కరించడానికి ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.AE ప్రభులాల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు..!!

బుధవారం ఆమె మొంథా తుఫాన్ ప్రభావం పై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .


             మొంథా  తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది అందరూ వారి వారి కార్య స్థానాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


           బుధవారం ఆమె మొంథా   తుఫాన్ ప్రభావం పై జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .



           ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరు  సాధ్యమైనంత వరకు ఇళ్లనుండి బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి  రావద్దని చెప్పారు.


          రైతులు పొలం పనుల నిమిత్తం పోలాలకు వెళ్ళవద్దని, అలాగే పంట కోతలు చేయవద్దని, పొలాలకు వెళ్లిన సమయంలో వాన నీటిలో పాముకాటు గురయ్యే అవకాశం ఉందని ,అలాగే  పిడుగుపాటు,ఇతర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. వీటన్నిటి నుండి సురక్షితంగా ఉండేందుకు ఇళ్లలో ఉండాలని చెప్పారు.


          లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం వల్ల తడిసి  పడిపోయేందుకు  సిద్ధంగా ఉన్న ఇళ్లల్లో ఎవరు ఉండకుండా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు అలాంటి  ఇండ్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

            వర్షాల నేపద్యంలో పాఠశాలలకు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించడం జరిగిందని, అయినప్పటికీ కస్తూర్బా గాంధీ  బాలికా విద్యాలయాలు,, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కడగకుండా సంబంధిత ఆర్సివోలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పాఠశాలల్లో పారిశుధ్య,ఆరోగ్య సమస్యలు, విద్యుత్  ప్రమాదాలు,ఇతర సమస్యలు  రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

              రైతులు పశువులను పొలాల్లోకి వదల వద్దని, అలా వెళ్లడం వల్ల పిడుగుపాటుకు పశువులు చనిపోయే ఆస్కారం ఉందని తెలిపారు.

              వర్షాలనేపద్యంలో ప్రజలుప్రత్యేకించి యువత వాగులు, వంకలు, నదుల వద్దకు ఈత కొట్టేందుకు,బట్టలు ఉతికేందుకు, చేపలు పట్టేందుకు ఎవరు వెళ్ళవద్దని, అలాగే లోతట్టు కాజ్ వేలు, పొంగి ప్రవహించే బ్రిడ్జిలు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ఆదేశించారు.

            వర్షాలను దృష్టిలో ఉంచుకొని దాన్యం, పత్తి కోతలు చేయవద్దని రైతులను కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం ,పత్తి పంటలు తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా టార్పాలిన్లు కప్పి ఉంచాలని అన్నారు .

          ఎక్కడైనా రహదారులు దెబ్బ తిన్న  ,కోతకు గురైన, తెగిపోయిన, గుంతలు పడిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టేలా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 


        విద్యుత్ అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ఎక్కడైనా వంగిపోయిన విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు ఉంటే సరిచేయాలని, ఎవరు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

            దేవరకొండ డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనందున ఈ ప్రాంతంలోని మారుమూల, గిరిజన తండాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో నే  అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.

      మొంథ తుఫాన్ కారణంగా భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటలు పని చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆయా శాఖల అధికారులను ఆమె ఆదేశించారు. ప్రజలు  వర్షానికి సంబంధించిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 18004251442 కు తెలియజేయాలని ఆమె కోరారు.


        రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, భారీ వర్షాల సందర్భంగా ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

Monday, 27 October 2025

చిన్న శ్రీశైలం యాదవ్ నీ కలిసిన ఉప్పల*

 *చిన్న శ్రీశైలం యాదవ్ నీ కలిసిన ఉప్పల*


జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్



యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు.


ఈ సందర్భగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన అంశాల మీద చర్చించడం జరిగింది.

Saturday, 25 October 2025

రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి


హుజూర్నగర్ జాబ్ మేళా

          హుజూర్నగర్ జాబ్ మేళా భారతదేశం లోనే అరుదైన కార్యక్రమం అని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సుమారు 275 కంపెనీలు హుజూర్నగర్ కు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరుపొందిన కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరయ్యాయని తెలిపారు.

                శనివారం అయన సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళా ప్రారంభించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మెగా జాబ్ మేళాకు రావాల్సిందిగా తాను స్వయంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగిందని ,ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విస్తృత ప్రచారం కల్పించామని, అందుకు తగ్గట్టుగానే భారీ స్పందన వచ్చిందని, ఇందుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


          రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న విషయం పై ప్రత్యేక శ్రద్ధ వహించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పోస్టులు నింపాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, అందులో భాగంగానే పబ్లిక్ అండర్ టేకింగ్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలల  కాలంలో 75000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,ఈ జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ రంగంలో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు .గ్రామీణ ప్రాంతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, తెలుగు మీడియం లో చదవడం వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అవకాశాలు తక్కువగా ఉంటాయని,ప్రత్యేకించి తండాలు, హరిజన ,గిరిజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరికిందని, ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీసుకురావచ్చని, ఉద్యోగాలు కల్పించడం ద్వారా కుటుంబాలు బాగుపడతాయని ఆయన అన్నారు. జాబ్ మేళాను విజయవంతం చేయడంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్, జిల్లా యంత్రాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రం గాలు, సహకరించిన  అందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 275 కంపెనీలు, 40 వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ,తమ ప్రభుత్వం ప్రైవేటు ద్వారా  ఉద్యోగాలు కల్పించేందుకు చేస్తున్న కృషికి  ఇది నిదర్శనం అని  అన్నారు.ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఉద్యోగాల్లో చేరేవరకు తాము నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి తెలిపారు.

         ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సర్వోత్తమ్ రెడ్డి ,తదితరులు  ఉన్నారు.

తెలంగాణ ఎండోమెంటు డైరెక్టర్‌గా హరీష్ ఐఏఎస్, బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

 తెలంగాణ ఎండోమెంటు డైరెక్టర్‌గా హరీష్ ఐఏఎస్, బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.



నూతనంగా బాధ్యతలు చేపట్టినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాను.

లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు

                             


లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన కొమరం భీం జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు.                                                                     ......                                                                     మంచిర్యాల :బెజ్జూర్ పిఎసిఎస్ లో పనిచేస్తున్న మాజీ సీఈవో వెంకటేశ్వర్ గౌడ్‌ను రెన్యువల్ చేసేందుకు, సహకార అధికారి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, తప్పనిసరి అయి, రెండు విడుదలగా ఇచ్చేందుకు రూ. 8 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు.


దీంతో రూ. 2 లక్షలు,మొదటి విడత డబ్బులు ఇచ్చేందుకు మాజీ సీఈవో వెళ్ళగా, జిల్లా సహకార అధికారి రాథోడ్ దిక్కు నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు కేసును విచారిస్తున్నారు.

Thursday, 23 October 2025

దేవాదాయ శాఖ డైరెక్టర్ గా* భాద్యతలు చేపట్టిన *డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్*

 దేవాదాయ శాఖ డైరెక్టర్ గా* భాద్యతలు చేపట్టిన 

*డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్* 



బొగ్గులకుంటలోని ఆఫీసులో

సాదాసీదాగా దేవాదాయ శాఖ డైరెక్టర్ గా విధుల్లో చేరిన

డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్


అనంతరం *సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం క్యాలెండర్* విడుదల చేసిన డైరెక్టర్ హరీష్


తెలంగాణలో భారీ మద్యం స్కాం!

తెలంగాణలో భారీ మద్యం స్కాం!

అచ్చోసిన ఆంబోతుల్లా తెలంగాణ మీద తెగబడి దోచుకుంటున్న కాంగ్రెస్ దొంగల తాజా నిర్వాకమిది!

వాటాల పంపిణిలో గొడవపడి రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి, కొండా సురేఖ, ఉదంతం మరువక ముందే మరో వాటాల గొడవ ఏకంగా ఒక ఐఏఎస్ అధికారి పదవి పోయేలా చేసింది

తెలంగాణలో రేవంత్ అరాచక, అవినీతి పాలనకు ఇది తాజా ఉదాహరణ. 

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ అకస్మాత్తుగా స్వచ్చంద పదవీవిరమణ తీసుకోవడం వెనుక కారణం ఏమిటి అని ఆరా తీస్తే దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు బయటికి వచ్చినయి. 

మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన వీఆర్‌ఎస్‌కు దారి తీసింది.

మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజ్వీ బలయ్యారు

అటు "బిగ్ బాస్"కు సర్దిచెప్పలేక, ఇటు మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారు అని ఇప్పుడు ఐఏఎస్‌ వర్గాల్లో జరుగుతున్న తీవ్ర చర్చ. 

హైసెక్యూరిటీ హాలోగ్రామ్స్‌, 2డీ బార్‌ కోడింగ్‌ లేబుల్స్‌ తయారీ టెండర్లకు సంబంధించి ఇద్దరు అధికార పక్ష నేతల మధ్య జరిగిన.. జరుగుతున్న కొట్లాటకు రిజ్వీ బలయ్యాడు. రిజ్వీ వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వు

లు జారీ చేసింది. అయితే రిజ్వీ వీఆర్‌ఎస్‌ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సీఎస్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు ధృవీకరించినట్టు అయ్యింది. 

మూడు స్కాములు, ఆరు కుంభకోణాలు అన్న చందంగా సాగుతున్న రేవంత్ సర్కారు మీద ప్రజలు తిరగబడే రోజు ఎక్కువ దూరంలో లేదు....p

Wednesday, 22 October 2025

మారనున్న మురికి వాడల రూపురేఖలు -రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

 🔸పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త


🔸జి ప్లస్1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే అవకాశం


🔸మారనున్న మురికి వాడల రూపురేఖలు


-రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి



పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో  శర వేగంగా సాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా   ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.  


ఇందిర‌మ్మ ఇండ్ల పై బుధవారం నాడు మంత్రిగారు సచివాలయం లోని తన కార్యాలయంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. 


ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ  రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకు స్థలాల్లోనివసిస్తున్న పేద ప్రజలకు పక్కా ఇంటి వసతిని కల్పించేలా ఇందిరమ్మ పథకాన్ని వర్తింప చేస్తున్నామని అన్నారు. 

కనీసం 30 చదరపు  మీటర్ల విస్తీర్ణంలో  జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగులు నిర్మించుకునేలా ఈ మేరకు  జీవో ఎంస్ నె 69 ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.   


🔸పట్టణ ప్రాంతాల్లో పేదలకు పక్కా ఇంటి వసతిని కల్పించాలన్న లక్ష్యంతో పాటు, స్థలాల కొరత ను దృష్టిలో ఉంచుకుని కొన్ని సడలింపులు ఇచ్చామని తెలిపారు. 


🔸పట్టణ ప్రాంతాల్లోని పేదలకు పక్కా ఇంటి వసతి కోసం కొద్ది కాలంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై అధ్యయనం చేశాామని తెలిపారు. 

 🔸రాష్ట్రంలోని అనేక పట్టణాలు, నగరాల్లోని పేదలు సొంత ఇంటిని నిర్మించుకోడానికి తగిన స్థలం లేక , అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అటువంటి వారి కోసం ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 


🔸 అనేక మంది 60 చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలోని రేకుల షెడ్లు, ఇతరత్రా తాత్కాలిక ఏర్పాట్లుతో జీవిస్తున్నారు. వీరికి  ఆర్ సిసి స్లాబుతో పక్కా ఇంటిని నిర్మించాలంటే తగిన స్థలం అందుబాటులో లేదు.  ఈ సమస్యను అధిగమించడానికి పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతినిస్తూ, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందచేస్తున్న రూ .5 లక్షల ఆర్ధిక సహాయాన్ని దశల వారీగా నిర్మాణపు పనుల స్థాయిని బట్టి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.


*పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉండాలంటే....*


జి+1 విధానంలో పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో , 70 అడుగుల విస్తీర్ణంలో వేర్వేరుగా రెండు గదులతోపాటు, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి, ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్ రూంలు తప్పనిసరిగా ఉండాలని, 

🔸ఈ ఇంటి నిర్మాణం ఆర్ సిసి స్లాబ్ తో ఉండాలని, ఇందుకు సంబంధించిన  స్ట్రక్చరల్  డిజైన్లకు డిఇఇ (హౌసింగ్)అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.


*నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లింపు...*


 మొదటి అంతస్తు – రూఫ్  లెవల్ వరకు నిర్మాణం అయితే  రూ. 1 లక్ష , అటు తరువాత గ్రౌండ్ ఫ్లోర్ – రూఫ్ వేసిన తరువాత రూ.1 లక్ష, ఆపైన ఫస్ట్ ఫ్లోర్ లో కాలమ్స్, స్లాబ్, గోడల నిర్మాణాలు పూర్తి అయిన పిదప రూ.2 లక్షలను, ఇంటి నిర్మాణపు పూర్తి అయిన తరువాత మరో లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా పేద‌వాళ్ల ఇంటికోసం ఐదు ల‌క్ష‌ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ ల‌క్ష్యమ‌ని  అన్నారు.

🔸గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, పట్టణ ప్రాంతాల్లో మరో ఎత్తు అని, ఇది ప్రభుత్వానికి ఒక సవాల్ అని దీనిని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.



బంధాలు నిలిపే భోజనం!


 *బంధాలు నిలిపే భోజనం!

             *భగీనీ హస్త భోజనం*

                   ➖➖➖✍️

                భగిని అంటే పురుష సంతానమైన తనతో పాటు అదే తల్లి గర్భంలో పుట్టిన స్త్రీ సంతానం అని అర్థం. దీన్నే సహ ఉదర సహోదర అనే పదంతో వ్యవహరిస్తూ ఉంటారు...


‘భగిని’ అంటే ‘పురుష సంతానమైన తనతో పాటు అదే తల్లి గర్భంలో పుట్టిన స్త్రీ సంతానం ’అని అర్థం. 


దీన్నే ‘సహ+ఉదర’ (సహోదర) అనే పదంతో వ్యవహరిస్తూ ఉంటారు. ‘సోదర’ అనే పదం కూడా ఉంది. సమానం ఉదరం యయోస్తౌ సోదరౌ  తనకు, తన చెల్లెలికి, అక్కకు తల్లి గర్భం ఒకటే అయినప్పుడు ‘సోదర’, ‘సోదరి’ అంటారు. 

ఆ సోదరీమణుల్లో వివాహాలు అయ్యాక, ప్రధాన కుటుంబం నుంచి వేరైపోయి, వేరే చోట ఉన్నప్పుడు... అప్పుడప్పుడు ఒక్క చోట కలుసుకోవడానికి, కలిసి భోజనం చేస్తూ, చిన్ననాటి విశేషాలను ముచ్చటించుకుంటూ, ఒక రోజంతా ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేసిన పండుగ రోజు ఇది.


పుట్టింటి చుట్టమైతే వంటింట్లో, అత్తింటి చుట్టమైతే వరండాలో...’ అని తెలుగులో ఒక సామెత ఉంది. అక్కా చెల్లెళ్ళ ఇంటికి అన్నా తమ్ముళ్ళు వస్తే... కాళ్ళు కడుక్కున్నదే తడవుగా వంట చేస్తున్న అక్క దగ్గరకో, చెల్లెలి దగ్గరకో చేరుతారు. చిన్నప్పుడు బడిలో పెన్సిలు దొంగతనాలు, ఇంట్లో పాలూ పెరుగూ ఎవరికీ తెలియకుండా తాగెయ్యడం, మామయ్యను ఆటపట్టించడం, తాతయ్యతో మొట్టికాయలు తినడం, కలిసి ఎడ్ల బండి మీద పొరుగూరు తిరునాళ్ళకు వెళ్ళడం, అక్కడ కొనుక్కున్న బూరాలు, జడకుప్పెలు... ఇలా ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటే, ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది.```


*దాంపత్యాలకు చికిత్స:*```

ఈ పండుగ ప్రయోజనం అంతమాత్రమే కాదు... ఆ ఇద్దరూ ఉన్నవేళ... బావగారో, బావమరిదో తమ భార్యల మీద విసుక్కున్నా, చిర్రుబుర్రుమన్నా ఆ ఇంటి పరిస్థితి అడగకుండానే తెలిసిపోతుంది. తమ సోదరులకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిష్కరించవచ్చు. కానీ సోదరీమణుల కుటుంబాల్లో అలా కుదరదు. కాబట్టి పరిస్థితిని మౌనంగా గమనించి, తిరిగి వచ్చిన తరువాత ఆ తమ తండ్రికి తెలియజేసేవారు. మనం కూడా ఏదైనా కార్యాలయంలో పని చేస్తున్నట్టయితే.. ఉద్యోగుల మధ్య తలెత్తే వివాదాన్ని సర్వాధికారి సమక్షంలో, అతని అనుమతికి లోబడి పరిష్కరించుకుంటున్నాం కదా! 

ఇదీ అంతే..!

అన్నదమ్ములు ఈ పండుగ రోజున వస్తారని తెలిసి... చెల్లెలు-మరిది, అక్క-బావ జాగ్రత్తపడే అవకాశం ఉంది. కాబట్టి తమ కుమార్తెల సంసారం గురించి కుమారులు గమనించి చెప్పిన సమాచారాన్ని తల్లితండ్రులు మనసులో ఉంచుకొనేవారు. అకస్మాత్తుగా కుమార్తెల ఇళ్ళకు వెళ్ళేవారు. తద్వారా వాళ్ళ కుటుంబాల నిజస్వరూపాలు అర్థమయ్యేవి. వారం పదిరోజుల పాటు అక్కడే ఉండి, చికిత్స ప్రారంభించి, పరిస్థితిని సరి చేస్తూ ఉండేవారు. వెనుకటి రోజుల్లో... సకాలంలో ఇటువంటి చికిత్స జరగడం వల్ల విడాకుల మాట వినబడేది కాదు. అంతేకాదు, అత్తమామలు కబురూ కాకరకాయ లేకుండా ఎక్కడ వచ్చేస్తారో అనే ముందుచూపుతో... ఆ భార్యాభర్తలు కూడా సర్దుకుపోయేవారు.

```


*చెరిగిపోని వాత్సల్యం కోసం...*```

ఈ పండుగ రోజున అన్న చెల్లెలి ఇంటికి వస్తే... చెల్లెలిని ఆశీర్వదించి, ఆ దంపతులకు, మేనల్లుళ్ళకు, మేనకోడళ్ళకు వస్త్రాలు ఇచ్చేవారు. సోదరీమణులు స్వయంగా వంట చేసి సోదరులకు వడ్డించేవారు. ‘భగీనీ హస్త భోజనం’ అంటే... సోదరి స్వహస్తాలతో వండి, వడ్డించిన భోజనం చేయడం. కాబట్టి పనివారికో, కేటరింగ్‌ వాళ్ళకో ఆ బాధ్యత అప్పగించడం సరికాదు. ఇలా పండుగలు, పబ్బాలు అనే వంకతో తరచూ కలుసుకోవడం వల్ల బాంధవ్యం, ప్రేమానురాగాలు, వాత్సల్యాలు చెరిగిపోకుండా ఉంటాయి. పురి(పురం అంటే శరీరం. ఆ శరీరంలో ఉంటాడు కాబట్టి ఆయన పురి(పూరీ) జగన్నాథుడు) క్షేత్రంలో అన్నాదమ్ములైన బలభద్రుడు, శ్రీకృష్ణుల మధ్య సుభద్ర నిత్యం పూజలందుకుంటూ ఉంటుంది. 

భాతృ సంబంధాన్ని ఎప్పటికీ చెడగొట్టుకోవద్దని ఆ విగ్రహాలు సూచిస్తాయి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       

Tuesday, 14 October 2025

డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ: బ్యాలెన్సింగ్ సర్జరీ, స్టిల్నెస్, అండ్ స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్

డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ: బ్యాలెన్సింగ్ సర్జరీ, స్టిల్నెస్, అండ్ స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్




. గత రెండు దశాబ్దాలుగా, హైదరాబాద్ ఆధారిత ఆర్థోపెడిక్ సర్జన్ వేలాది మంది రోగులకు చైతన్యాన్ని పునరుద్ధరించడమే కాక, 30 కంటే ఎక్కువ దేశాలను కూడా అన్వేషించారు, ప్రపంచంలోని అత్యంత ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల ద్వారా ట్రెక్కింగ్. బాలిలోని బాటూర్ పర్వతం మరియు నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుండి పెరూలోని మచు పిచ్చు వరకు, మరియు 300–450 కిలోమీటర్ల ఓర్పును సైకిల్ సఫారి గ్రూపుతో సవారీ చేస్తుంది - ప్రతి ప్రయాణం, medicine షధం గురించి జీవితం గురించి తనకు చాలా నేర్పించిందని ఆయన చెప్పారు.


"నాకు, ఓర్పు, వినయం మరియు దృక్పథం నేను ఆపరేటింగ్ థియేటర్‌లో లేదా పర్వత శిఖరంపై ఉన్నానా అనేది సార్వత్రిక ధర్మాలు" అని గ్లోబల్ ఇండియన్‌తో సంభాషణలో హైదరాబాద్‌లోని నానక్రమ్‌గుడాలోని స్టార్ హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ చెప్పారు. "సంక్లిష్టమైన విధానాల సమయంలో నేను ధ్యాన మోడ్‌లోకి వెళ్తాను - లోతైన దృష్టి మరియు ప్రవాహం ఉన్న స్థితి." యాత్రికుడిగా మరియు ట్రెక్కర్‌గా అతని అనుభవాలు అతని ప్రపంచ దృష్టికోణాన్ని రూపొందించడమే కాక, శస్త్రచికిత్స పట్ల అతని విధానాన్ని కూడా వారు నిర్వచించారు-ప్రశాంతంగా, స్థిరంగా మరియు స్పష్టమైన తల.


డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ

డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ


గందరగోళంలో ప్రశాంతత

గాయం మరియు ఆర్థోపెడిక్స్‌లో, సెకన్లలో మరియు ఫలితాలలో నిర్ణయాలు తీసుకునే చోట, 1,500 హిప్ మరియు మోకాలి పున ments స్థాపనలను (పునర్విమర్శలతో సహా) ప్రదర్శించిన డాక్టర్ ప్రవీణ్ మరియు సుమారు 2,000 గాయం శస్త్రచికిత్సలు అతని సాంకేతిక ఖచ్చితత్వం మరియు ప్రశాంతత కోసం నిలుస్తాయి. "ప్రతి కేసు, ముఖ్యంగా గాయం మరియు పునర్విమర్శ పనులు, ఒత్తిడిలో మొత్తం దృష్టిని మరియు ప్రశాంతతను కోరుతాయి. ఆర్థోపెడిక్స్ గందరగోళంలో కంపోజ్ చేయడానికి, స్ప్లిట్-సెకండ్ నిర్ణయాలు తీసుకోవటానికి మీకు నేర్పుతుంది" అని ఆయన వివరించారు.


డాక్టర్ ప్రవీణ్ కోసం, శస్త్రచికిత్స సైన్స్ కంటే ఎక్కువ. ఇది ధ్యాన కళ, ఇది స్టిల్ మైండ్ మరియు స్థిరమైన చేతులను కోరుతుంది. "ప్రతి కోత బాధ్యత యొక్క చర్య," అతను ప్రతిబింబిస్తాడు. "మీరు ఉమ్మడిని మరమ్మతు చేయడం మాత్రమే కాదు; మీరు విశ్వాసం, గౌరవం మరియు ఆశను పునరుద్ధరిస్తున్నారు." కాలక్రమేణా, అతను ఓర్పు క్రీడలు మరియు శస్త్రచికిత్సల మధ్య సమాంతరాలను చూడటానికి వచ్చాడు, రెండింటికీ లయ, సహనం మరియు అలసట సెట్ చేసినప్పుడు కంపోజ్ చేసే సామర్థ్యం అవసరం. “సుదీర్ఘ ట్రెక్ లేదా మారథాన్ శస్త్రచికిత్స మధ్యలో, మీరు శబ్దం వినడం మానేస్తారు. అది దృష్టి తీసుకున్నప్పుడు, మరియు మీరు మీ ఉత్తమమైన పనిని చేసినప్పుడు.”


ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రతి రోగి స్థితిస్థాపకత, నమ్మకం మరియు వైద్యం యొక్క హక్కు గురించి క్రొత్తదాన్ని బోధిస్తారనే నమ్మకం అతన్ని గ్రౌన్దేడ్ చేస్తుంది. "ఈ రోజువారీ పాఠాలు మరియు రోగి అవగాహన మరియు దైహిక మద్దతులో నేను చూసే అంతరాలు, ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే పెద్ద మిషన్‌ను నిరంతరం గుర్తుచేస్తాయి, ఇది అధునాతనమైనంత దయగలది."


ఆపరేటింగ్ గదికి మించిన సవాళ్లు

ఆర్థోపెడిక్స్‌లో, గొప్ప సవాళ్లు తరచుగా శస్త్రచికిత్సా నైపుణ్యానికి మించి విస్తరిస్తాయి. "సాంకేతిక ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది, కాని సర్జన్‌ను నిజంగా పరీక్షిస్తున్నది ఏమిటంటే, అంచనాలను నిర్వహించడం, స్పష్టంగా కమ్యూనికేట్ చేయడం మరియు రోగులను వారి స్వంత కోలుకోవటానికి ప్రేరేపించడం" అని ఆయన చెప్పారు. రోగి సమ్మతి నిరంతర ఫిజియోథెరపీ మరియు పునరావాసం నిర్ధారించే పునరావృత సవాలుగా మిగిలిపోయింది. "చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ యొక్క విజయం తరచుగా సర్జన్ యొక్క నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ రోగి యొక్క క్రమశిక్షణపై వ్యాయామాలు మరియు జీవనశైలి సర్దుబాట్లను అనుసరిస్తుంది."


మరొక అడ్డంకి అవగాహనలో ఉంది. "కొన్నిసార్లు, రోగులు క్రియాత్మక ఫలితాల కంటే ఎక్స్-కిరణాలు లేదా ఖర్చుల పరంగా రికవరీని కొలుస్తారు. వైద్యం అనేది జీవశాస్త్రం, సహనం మరియు పట్టుదల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ప్రక్రియ అని అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడటం సమయం, తాదాత్మ్యం మరియు నమ్మకం అవసరం."


డాక్టర్ ప్రవీణ్ మెరెడ్డీ


స్పెషలిస్ట్ మరియు అతని క్రాఫ్ట్

డాక్టర్ ప్రవీణ్ హిప్ మరియు మోకాలి పునర్విమర్శ శస్త్రచికిత్సలు మరియు పెల్వి-ఎసిటాబ్యులర్ గాయం లో ప్రత్యేకత కలిగి ఉండగా, అతని నైపుణ్యం సంక్లిష్టమైన, అధిక-ఖచ్చితమైన విధానాల యొక్క విస్తృత వర్ణపటాన్ని కలిగి ఉంది. అతని పనిలో పెల్వి-ఎసిటాబ్యులర్ ట్రామా మరియు కాంప్లెక్స్ ఫ్రాక్చర్ పునర్నిర్మాణం, రివిజన్ హిప్ మరియు మోకాలి పున replace స్థాపన శస్త్రచికిత్సలు మరియు సంక్లిష్టమైన ప్రాధమిక మరియు పాక్షిక మోకాలి పున ments స్థాపన ఉన్నాయి.

మూలాలు మరియు ప్రారంభ స్పార్క్

కరీంనగర్‌లో జన్మించిన డాక్టర్ ప్రవీణ్ విలువలు మరియు క్రమశిక్షణలో ఉన్న ఇంటిలో పెరిగారు. అతని తండ్రి 84 వరకు సూత్రప్రాయమైన జీవితాన్ని గడిపాడు, అతని తల్లి బలం మరియు ప్రేరణకు మూలంగా కొనసాగుతోంది. ప్రారంభం నుండి ఒక ప్రకాశవంతమైన విద్యార్థి, అతను కేవలం రెండు సంవత్సరాలు మరియు మూడు నెలల్లో పాఠశాలను ప్రారంభించాడు, తెలంగానా అంతటా ఉన్న సంస్థలలో విద్యాపరంగా రాణించాడు. "నేను ఎల్లప్పుడూ ఆసక్తిగా మరియు నేర్చుకోవటానికి ఆసక్తిగా ఉన్నాను, తరచూ అరవై తరగతిలో మొదటి ఐదుగురిలో ఉన్నారు" అని డాక్టర్ ప్రవీణ్ గుర్తుచేసుకున్నాడు, అతను వరుసగా మూడు సంవత్సరాలు రాష్ట్ర స్కాలర్‌షిప్ సంపాదించాడు మరియు హరిత విప్లవంపై వ్యాస పోటీలో మొదటి బహుమతిని కూడా గెలుచుకున్నాడు.


క్రీడల పట్ల సమానంగా మక్కువ చూపిన అతను ఖో-ఖో, క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడాడు మరియు అథ్లెటిక్స్లో రాణించాడు. సెకండరాబాద్‌లోని లయోలా అకాడమీలో, అతను తన అథ్లెటిక్ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చాడు, అతని విద్యా పనులతో పాటు మానసిక చురుకుదనాన్ని శారీరక ఓర్పుతో సమతుల్యం చేస్తుంది, ఇది తరువాత అతని వైద్య వృత్తిని నిర్వచిస్తుంది.


విధి ద్వారా డాక్టర్

మెడిసిన్, అతను చెప్పాడు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈసారి కాస్త ముందుగానే వార్షిక పరీక్షలు..

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈసారి కాస్త ముందుగానే వార్షిక పరీక్షలు..

           తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ఇంటర్ బోర్డు రెండు రకాల టైం టేబుళ్లను సమర్పించింది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ ఫీజును కూడా పెంచాలని బోర్డు ప్రతిపాదించింది.

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్. ఈసారి వార్షిక పరీక్షలు ఫిబ్రవరి నెలాఖరులోనే ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం దస్త్రాన్ని పంపింది. 2026 ఫిబ్రవరి 23 లేదా 25 తేదీల నుంచి పరీక్షలు మొదలయ్యేలా రెండు రకాల టైం టేబుళ్లను బోర్డు ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే విద్యాశాఖ కూడా ఉన్నందున.. ఆయన తుది ఆమోదం తర్వాతే అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 24తో ముగియనున్నాయి. ఏపీ కంటే ముందే తెలంగాణలో పరీక్షలు పూర్తయ్యేలా బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది.

 వాల్‌మార్ట్‌లో రోజూ అదే పని.. అమెరికాలో భారతీయ యువకుడు అరెస్ట్

టూరిస్టులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి ఈ ఏరియాలకు హెలికాప్టర్ సేవలు.. ఎప్పటినుంచంటే..

TG: రైతులకు తీపికబురు.. వాటిపై 100 శాతం సబ్సిడీ..

వాస్తవానికి గతంలో కరోనా మహమ్మారి ప్రభావానికి ముందు ఫిబ్రవరి నెలాఖరులోనే ఇంటర్ పరీక్షలు మొదలయ్యేవి. అయితే కరోనా కారణంగా షెడ్యూల్ మార్చి నెలకు మారింది. తిరిగి ఫిబ్రవరిలోనే పరీక్షలు మొదలుపెట్టడం వలన, జేఈఈ మెయిన్, ఎప్‌సెట్, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కొంత వెసులుబాటు లభిస్తుందని ఇంటర్‌బోర్డు భావిస్తోంది. ఉదాహరణకు.. గత ఏడాది మార్చి 5న ఇంటర్ పరీక్షలు మొదలవగా.. జేఈఈ మెయిన్‌ తుది విడత ఏప్రిల్‌ 2 నుంచి ప్రారంభమైంది. దీంతో విద్యార్థులకు మధ్యలో కేవలం 12 రోజులు మాత్రమే మిగలడంతో వారు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.



ఇదే సమయంలో.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ఫీజును పెంచాలని కూడా ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రాక్టికల్స్ లేని కోర్సులకు రూ.520, ప్రయోగ పరీక్షలుండే ఎంపీసీ, బైపీసీ, జువాలజీ గ్రూపులతోపాటు ఒకేషనల్ కోర్సులకు అదనంగా మరో రూ.230 కలిపి మొత్తం రూ.750 వసూలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఏపీతోపాటు సీబీఎస్‌ఈ, ఇతర బోర్డుల ఫీజులు అధికంగా ఉన్నాయని పేర్కొంటూ తెలంగాణలో కూడా కొంత మొత్తం పెంచాలని బోర్డు ప్రతిపాదించింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రాక్టికల్స్ లేని కోర్సులకు ఫీజు రూ.600 వరకు, ప్రాక్టికల్స్ ఉన్న వాటికి సుమారు రూ.875 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Sunday, 12 October 2025

హాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం

 

హాసభ ప్రక్షాళన కమిటీ జిల్లాల కన్వీనర్ & కమిటీల ఎంపిక సమావేశం


హైద్రాబాద్: 


తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ మీడిదొడ్డి శ్యామ్  ఆధ్వర్యంలో ఉపేందర్ మొగుళ్లపల్లి చైర్మన్ గా సమావేశం అక్టోబర్ 12, ఆదివారం ఉదయం హైద్రాబాద్ లోని ఖర్మన్ ఘాట్ వేడుక ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు.


ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైశ్య మహాసభ పూర్వ అధ్యక్షులు గంజి రాజమౌళి గుప్తా, ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వల సుజాత, కార్పొరేన్ మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, ఉప్పల శ్రీనివాస్, బొల్లం సంపత్ లు,  యాదా నాగేశ్వరరావు లు హాజరు అవుతారని నిర్వాహకులు సోషల్ మీడియాలో తెలిపారు. 


వివిధ జిల్లా ల పోరాట యోధులు మహాసభ అభివృద్ధి కాంక్షించే వారు అన్యాయం ను ఎదురించే వారు కాబోయే జిల్లా కన్వీనర్ లు ఇతర పదవులు పొందే వారు మహాసభ ప్రక్షాళన కోసం ఎన్నికల నిర్వహణ కోసం బైలా రక్షణ కోసం ఆస్తుల పరిరక్షణ కోసం అన్యాయం ను ఎదురుకొనుట కోసం అన్నిటికి అన్నివిధాలా సిద్ధంగా ఉంటే నాయకుల తొలి సమావేశం కు అందరు హాజరై జయప్రదం చేయగలరనీ ఉపేందర్ మొగుళ్లపల్లి కోరారు.

రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*

 *రాజన్న సిరిసిల్ల జిల్లా:://*


*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*


*వేములవాడ రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు..*


*​అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు..*




​​ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శనాల్లో, సేవల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు..


*రేపటి నుండి ​శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం..*


​ఈ అభివృద్ధి పనుల నేపథ్యంలో, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. నేటి (11-10-2025) శనివారం నుండే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి..


*​*రాజన్న సిరిసిల్ల జిల్లా:://*


*రేపటి నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం..*


*వేములవాడ రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు..*


*​అభివృద్ధి పనుల దృష్ట్యా భక్తులకు తాత్కాలిక ఏర్పాట్లు.


​​ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా భక్తుల దర్శనాల్లో, సేవల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు..


*రేపటి నుండి ​శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనం..*


​ఈ అభివృద్ధి పనుల నేపథ్యంలో, భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. నేటి (11-10-2025) శనివారం నుండే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి..


*​నిత్య కైంకర్యాలు యథావిధిగా..*​


రేపటి (12-10-2025) ఆదివారం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని సాధారణ దర్శనాలను నిలిపివేయడం జరుగుతున్నప్పటికీ, ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని ఈవో స్పష్టం చేశారు..


​ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు, ప్రజలు సహకరించి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు..


రేపటి (12-10-2025) ఆదివారం నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని సాధారణ దర్శనాలను నిలిపివేయడం జరుగుతున్నప్పటికీ, ఆలయంలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు మాత్రం యథావిధిగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయని ఈవో స్పష్టం చేశారు..


​ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు, ప్రజలు సహకరించి, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నుండి రాజన్న దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు..

Saturday, 11 October 2025

మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో 221వ ఉచిత వివాహం

 p                    మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్ ఆధ్వర్యంలో 221వ ఉచిత వివాహం శివకుమార్ అనూష లకు హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని వస్తువులు హాల్ పందిరి రెండు బంగారం పుస్తెలు మట్టెలు బట్టలు స్టీల్ సామాను విందు భోజనం తో వైభవం గా శ్రీ వీర వెంకట సత్యనారాయణ దేవాలయం లో జరిగింది..

దాతలు మా స్నేహితులు మహేష్ తిరుమల గారు సూరిశెట్టి శ్రీనివాస్ బొగ్గారము వెంకటేష్ గారు అంకిశెట్టి సత్యనారాయణ పెద్ది చంద్ర మౌళి బాల్ రెడ్డి తుమ్మల ch రమేష్ రామిని విజయ్ బస్సా శ్రీనివాస్ hyd అంజనేయులు C V రెడ్డి గారు నర్సింహా మిత్రులు మొగుళ్ళ పల్లి యువ సేన అధ్యక్షులు Ch పవన్ రాఘవ రెడ్డి y. సత్యనారాయణ వినోద్ గార.బొడ్ల S. కిషన్ రావు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు..



హడలెత్తిస్తున్న పేషీ పెత్తనం

హడలెత్తిస్తున్న పేషీ పెత్తనం


*_🫵యువ మంత్రి బద్నామ్._*

*_👉ప్రమాదంలో మంత్రి రాజకీయ భవిష్యత్తు.._*





        *( ఎస్.ఎం.ఎం.అలీ✍️)*

        *_సహజంగా ఏ శాఖ పేషీపై అయినా మంత్రుల పెత్తనం ఉంటుంది. కానీ కార్మిక శాఖలో అందుకు భిన్నమైన పరిస్థితి. మంత్రి సొంత నియోజకవర్గ పన్యటనలు, జిల్లా ఇన్చార్జి బాధ్యతలు, శాఖాపరమైన బాధ్యతలతో తలమునలకయిన అవకాశాన్ని పేషీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్న వైచిత్రి._*

         *పేషీలో పనిచేసే ఓ కీలక అధికారి ఓ చిన్న స్థాయి ఉద్యోగితో కలసి సాగిస్తున్న దందా.. చివరకు కార్మికమంత్రి ఇమేజీ డామేజీ అయ్యేందుకు కారణమవుతోంది. అయినా వారిపై ఎలాంటి చర్యలు లేవు. ఇదంతా మంత్రికి తెలిసి జరుగుతోందా? తెలియకుండా ఆయన పేరుతో నడుస్తున్న దందానా? ఇప్పటికే కార్మికశాఖపై పుంఖానుపుంఖాల కథనాలు వస్తుంటే పేషీ ప్రక్షాళనకు ఎందుకు నడుంబిగించలేదు? తనను అప్రతిష్ఠపాలు చేస్తున్న అక్రమార్కులపై మంత్రి ఎందుకు చర్యలుకొరడా ఝళిపించడం లేదు? .. ఇదీ ఇప్పుడు సచివాలయంలో హాట్ టాపిక్...*

       *కార్మిక శాఖ పేషీ.. గోకర్ణ గజకర్ణ టక్కుటమార* కళలకు కేంద్రమయిందన్న విమర్శలు అటు పారిశ్రామికవర్గాల్లో, ఇటు ఏపీ సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. యువమంత్రి వాసంశెట్టి సుభాష్ అటు తన సొంత రామచంద్రాపురం నియోజకర్గ వ్యవహారంతోపాటు.. ఇటు జిల్లా ఇన్చార్జి మంత్రిగా బిజీగా ఉంటున్నారు. ఇక శాఖపరమైన సమీక్షలు ఎలాగూ ఉండనే ఉంటాయి.

       *ఇటీవలి కాలంలో కార్మిక శాఖలో* పలు సంస్కరణలకు తెరలేపిన మంత్రి సుభాష్ ఇమేజీని, సొంత పేషీ వారే దారుణంగా డామేజీచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎంతోపాటు, సీఎంఓలో ఆ శాఖ చూస్తే కార్యదర్శి కార్తికేయ మిశ్రాకూ ఫిర్యాదుల రూపంలో వెళ్లినట్లు సమాచారం.

       *ముఖ్యంగా ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్* విభాగంలో మంత్రి పేరుతో జరుగుతున్న దందా, ఆయన ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బాగా ఆదాయం ఉన్న జిల్లాలకు డెప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్లుగా తమ సామాజికవర్గానికి, తమ చేతులు తడిపిన వారికే మంత్రితో తెలివిగా పోస్టింగులు ఇప్పిస్తున్న పేషీ అతి తెలివి తేటలు, మంత్రిని బద్నామ్ చేస్తున్నాయి.కాగా మంత్రి బిజీని అడ్డుపెట్టుకుని ఈ పేషీ అధికారులు.. పెద్ద కంపెనీలకు నేరుగా ఫోన్లు చేసి, ఆయన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రాపురం, అచ్యుతాపురం, పరవాడ, నెల్లూరు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో జరిగిన ప్రమాదాలను అడ్డుపెట్టుకుని, పేషీలోని కొందరు యాజమాన్యాలకు నేరుగా ఫోన్ చేసి.. మంత్రి పేరిట డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు చివరకు సీఎంఓ వరకూ చేరాయి.

అయితే చివరకు ఆరా తీస్తే అసలు మంత్రికి అక్కడ ప్రమాదం జరిగిన ఘటన కూడా తెలియదట. అసలు ఆ ఫిర్యాదులేవీ ఆయన దృష్టికే రాలేదట. అంటే మంత్రి పేరు అడ్డుపెట్టుకుని పేషీ సిబ్బంది ఏ స్థాయిలో బరితెగిస్తున్నారో అర్ధమవుతోంది.

      *కాగా.. రామచంద్రాపురం ప్రాంతంలో జీడిపిక్కల ఫ్యాక్టరీలపై..*  పేషీ సిబ్బందే ఆకాశరామన్న పేరుతో ఫిర్యాదులు చేసిన వైనం మంత్రికీ తెలియదట. ఆ జీడిపిక్కల ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించడం లేదు కాబట్టి, వాటిపై చర్యలు తీసుకోవాలన్నది ఆ ఆకాశరామన్న ఫిర్యాదుల సారాంశం.

       *అదే ప్రాంతంలో కొద్దిరోజుల క్రితం* ఒక ఫ్రోజన్ ఫుడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని, పేషీ నుంచి ఒకరు నేరుగా కంపెనీ యజమానికి ఫోన్ చేసి, లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం.ఆ విషయాన్ని సదరు కంపెనీ యజమాని అక్కడి ఫ్యాక్టరీస్ ఉన్నతాధికారికి ఫోన్ చేసి.. ఫలానా వ్యక్తి మంత్రిగారి పేషీ నుంచి ఫోన్ చేసి ఇంత కావాలని అడిగారు. ఆయన ఎవరు అని ఆ కంపెనీ యాజమాన్యం ఆరా తీస్తే.. ఆ పేషీ సిబ్బంది సిఫార్సుతో అక్కడ పోస్టింగు తెచ్చుచుకున్న ఆ ఫ్యాక్టరీ అధికారి.. ‘‘అబ్బో ఆయన మంత్రి గారికి చాలా కావాలసిన మనిషి. షీషీ అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన చెప్పింది చేయండి’’ అని ఉచిత సలహా ఇచ్చారట. ఇదే కంపెనీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలని పేషీలోని ఓ కీలక అధికారి, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కార్యాలయంపై ఒత్తిడి చేస్తున్నట్లు కార్మికశాఖ వర్గాలు చెబుతున్నాయి. పేషీలో పనిచేసే ఆ అధికారికి సైలెంట్ కిల్లర్ అన్న పేరుందని కార్మిక శాఖ ఉద్యోగులు చెబుతున్నారు.కాగా అసలు ఆ కంపెనీకి ప్రొహిబిటరీ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడు క్యాన్సిల్ చేశారన్న సమాచారం చివరకు డైరక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ ఆఫీసుకూ తెలియకపోవడం విచిత్రం. అంటే ఇదంతా కేవలం అక్కడి ఫ్యాక్టరీస్ అధికారి-కంపెనీలు-పేషీకి తప్ప, డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆఫీసుకూ తెలియనంత గుంభనంగా జరుగుతోందని అర్ధమవుతోంది.

      *కాగా ఫ్యాక్టరీస్ విభాగంలో* తమ మాట వినని ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా.. పేషీలోని వారే మీడియా-సోషల్‌మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నట్లు సమాచారం. ఇటీవల శాఖాపరమైన కథనానికి సంబంధించి.. అసలు కార్మికశాఖతో ఎలాంటి సంబంధం లేని ఓ జర్నలిస్టు ద్వారా మంత్రి-కమిషనర్‌పై వ్యతిరేక కథనాలు రాయించడం కలకలం రేపింది.

      *చివరకు ఆ కథనం రాసిన జర్నలిస్టును విచారిస్తే..* పేషీలో డిప్యుటేషన్‌పై పనిచేసే ఒకరు, సదరు జర్నలిస్టును తన వద్దకు తీసుకువచ్చి.. వారిపై వ్యతిరేక కథనాలు రాయించారని కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. నిజానికి కార్మిక శాఖకు ఎంతమంది పీఆర్వోలు? అన్న సందేహం సచివాలయ మీడియా వర్గాల్లో లేకపోలేదు.

      *జీతం బత్తెం లేని షాడో పీఆర్వోను..* పేషీలో పనిచేసే ఓ ఉద్యోగి, సచివాలయ మీడియావర్గాలకు ఆయనే మా పీఆర్వో అని పరిచేయం చేస్తున్నారట. మంత్రి ప్రెస్‌మీట్‌కూ ఆ జీతం బత్తెం లేని జర్నలిస్టు పీఆర్వోగా వస్తుండటం, ఆయన ఇచ్చిన ప్రెస్‌నోట్‌నే పేషీ కూడా విడుదలు చేస్తుండటంతో అసలు పీఆర్వో ఎవరన్న గందరగోళం మొదలయింది. నిజానికి ఇప్పటికే కార్మికశాఖలో ఒక పీఆర్వో పనిచేస్తున్నారు. దానితో కార్మిక శాఖకు ఎంతమంది పీఆర్వోలు? ఒకరా?ఇద్దరా? అన్న గందరగోళం మీడియా వర్గాల్లో మొదలయింది.

      *అయితే నిజానికి ఆ జర్నలిస్టుకు,* కార్మిక శాఖలో జరిగే వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా.. పేషీలో పనిచేసే ఒక ఉద్యోగి.. ‘తాను మంత్రితో చెప్పి నీకు పీఆర్వో ఉద్యోగం ఇప్పిస్తా’నని ఆశ పెట్టి.. ఆ జర్నలిస్టుతో కార్మిక శాఖలో తనకు గిట్టని అధికారులపై, ఆ జర్నలిస్టులతో వ్యతిరేక థనాలు రాయిస్తున్నట్లు తెలుస్తోంది. విచిత్రంగా కార్మికశాఖ ఉన్నతాధికారులపై చిన్నా చితకా పేపర్లు, వాట్సాప్ పేపర్లన్నీ కాకినాడ కేంద్రంగా ఉండటం గమనార్హం.

        *ఈవిధంగా మంత్రి అనుభవరాహిత్యం* -పర్యటనలు-సమీక్షలతో బిజీగా ఉండే అవకాశంగా వాడుకుని.. ఆయన పేరు చెప్పి ఫ్యాక్టరీలను బెదిరించి పిండేస్తున్న పేషీతో, మంత్రి సుభాష్‌కు ఎప్పటికయినా ప్రమాదమేనంటున్నారు. దీనిపై ఆయన దృష్టి సారించి.. పేషీని ప్రక్షాళన చేయకపోతే.. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఆయన పొలిటికల్ కెరీర్ కూడా ప్రమాదంలో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు.

     *_‘వజ్ర’ వైచిత్రి! (BOX)_*

     *కార్మికశాఖలోని ఫ్యాక్టరీస్ విభాగంలో ఆ విభాగపు అధికారుల* అసమర్థత ఏ స్ధాయిలో ఉంది? కన్సల్టెంట్లకు ఎంత లోకువయ్యారు? వారితో ఏ స్థాయిలో అంటకాగుతున్నారో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. కొద్దిరోజుల క్రితం కాకినాడ పరిథిలోని అవంతి ఫ్రోజెన్స్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అదే కంపెనీలో ఒక ప్రమాదం జరిగితే, అధికారులు దానికి నోటీసులు జారీ చేశారట. కంపెనీ ఆవరణలో అమ్మోనియా లేదు. ఇకపై ఇలాంటివి జరగవంటూ ఒక లేఖను కన్సల్టెన్సీ ఏజెన్సీ కాకినాడ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు 16-9- 2025న రాశారు. నిజానికి అలాంటి లేఖ రాయాల్సింది తప్పు చేసిన కంపెనీ తప్ప, దానికి వకాల్తా పుచ్చుకునే కన్సల్టెన్సీ కాదు. ఇలాంటి చిత్రవిచిత్రాలు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటులో బోలెడు. కాకినాడ, అనకాపల్లి, అచ్యుతాపురం, పరవాడ, ఏలూరు ప్రాంతాల్లోని ఫ్యాక్టరీస్ అధికారులకు పేషీలో పనిచేసే ఆ ఇద్దరితో బాదరాయణ బంధం ఉందట. కారణం.. ఆ ఇద్దరి సిఫార్సులతోనే వారంతా అక్కడికి బదిలీ అయ్యారట.

     *ఇదిలాఉండగా.. ఆ కంపెనీలో జరిగిన ప్రమాదం గానీ..* దానికి ప్రొహిబిటరీ ఆర్డర్ ఇచ్చిన విషయం గానీ, దానికి క్యాన్సిల్ చేసిన విషయం గానీ తమకు తెలియదని డైరక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. అంటే దీన్ని బట్టి.. ఈ లోపాయికారీ సర్దుబాట్లన్నీ, ఎక్కడికక్కడ పేషీలోని ఆ ఇద్దరు-ఫ్యాక్టరీస్ జిల్లా అధికారులు-కంపెనీల మధ్య గుంభనంగా జరుగుతున్నట్లు అర్ధమవుతుంది.

Friday, 10 October 2025

తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది కూడా AVCI (ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్) ఆధ్వర్యంలో వైభవంగా యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడ్డాయి.

 తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ






సంబరాలు ఈ ఏడాది కూడా AVCI (ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్) ఆధ్వర్యంలో వైభవంగా యూసుఫ్‌గూడా పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించబడ్డాయి.


25 రకాల పువ్వులతో అలంకరించిన 25 ఫీట్ల ఎత్తైన బతుకమ్మ అంబరాన్నంటే ఉత్సవాన్ని అందించింది. ఈ వేడుకకు హైకోర్టు జడ్జి శ్రీమతి సూరే పెళ్లి నందా గుప్త గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు, పోలీస్ కమాండర్ మురళి కృష్ణ గారు, సెల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు గారు, విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ గారు సహా పలువురు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు.


ఈ కార్యక్రమం బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.


ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా సహకరించిన విశిష్ట గోల్డెన్ డైమండ్స్ చైర్మన్ పలబట్ల ఆనంద్ బాబు గారికి, అసోసియేట్ స్పాన్సర్‌గా తోడ్పడిన సెల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు గారికి, అలాగే వకుల సిల్క్స్, శారద సారీస్, Aditya Birla ఇంద్రియ, జిగిని శ్రీనివాస్ వారికి అంతేకాక, ఈ వేడుక విజయానికి తోడ్పడిన టీమ్ సభ్యులందరికీ 

కె. ఎస్. ఆర్. మూర్తి – (AVCI ఫౌండర్ & చైర్మన్) డా. సరాఫ్ తులసి గుప్తా – (AVCI నేషనల్ సెక్రటరీ) డా. సిద్ధి స్వాతి – (AVCI తెలంగాణ సెక్రటరీ) వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఎలక్షన్ కోడ్ జూబ్లీహిల్స్ వరకే.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

 ఎలక్షన్ కోడ్ జూబ్లీహిల్స్ వరకే.. ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి

       జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనిహెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులపై ప్రకటనలు నిషేధమని, ప్రైవేట్ ఆస్తులపై అనుమతితోనే ప్రచురించాలని సూచించారు. ఈవీఎంలలో అభ్యర్థుల రంగుల ఫోటోలు ఉంటాయని, 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ జూబ్లీహిల్స్ వరకే అమలువుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

              జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. పార్టీలన్ని అభ్యర్థుల ప్రకటన, ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈక్రమంలో తాజాగా బుధవారం నాడు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేలా చూడాలని.. రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ఆ వివరాలు..


జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ బుధవారం హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ పార్టీలకు పలు కీలక సూచనలు చేశారు. ఎవరైనా సరే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులపై రాజకీయ ప్రకటనలు ప్రచురించవద్దన్నారు. అలానే ప్రైవేట్ ఆస్తుల మీద ప్రకటనలు ప్రచురించాలంటే.. ముందుగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. పర్మిషన్ లేకుండా ప్రకటనలు ప్రచురిస్తే.. వాటిని తామే తొలగించి.. ఆ ఖర్చును పార్టీ ఖాతాల్లో జమ చేస్తామని హెచ్చరించారు.

       జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని.. ఇందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం.. తెలంగాన రాష్ట్ర రాజధాని, మెట్రోపాలిటన్ నగరంలో ఉన్నందున.. ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎన్నికల కోడ్) కేవలం ఆ నియోజకవర్గానికి మాత్రమే వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని కర్ణన్‌ వివరించారు.



ఈ ఎన్నిక నేపథ్యంలో షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశామని కర్ణన్ తెలిపారు. రాజకీయ ప్రచార ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి తప్పనిసరి అని ఆయన స్పష్టం చెప్పారు. జీహెచ్‌ఎంసీ మెయిన్ ఆఫీసులోని సీపీఆర్వో విభాగంలో ఎంసీఎంసీ, మీడియా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.



ఎన్నికల ప్రచారంలో భాగంగా.. పోటీ చేయబోయో అభ్యర్థులతో పాటుగా రాజకీయ పార్టీలన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను.. నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కర్ణన్‌ కోరారు. ఎలక్షన్ కోడ్‌కి లోబడే ఎన్నికల ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా.. ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకుగాను.. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అక్టోబర్ 13 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఇందుకోసం దీనికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జాయింట్ పోలీసు కమిషనర్ ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అస‌లు మ‌న‌కు క్యాల్షియం ఎందుకు అవ‌స‌రం..? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది..?

 అస‌లు మ‌న‌కు క్యాల్షియం ఎందుకు అవ‌స‌రం..? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది..?

               


 : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాల్లో క్యాల్షియం కూడా ఒక‌టి. ఇది మిన‌ర‌ల్స్ జాబితాకు చెందుతుంది. శ‌రీరంలో అనేక విధులు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డేందుకు స‌హాయం చేస్తుంది. ఎముక‌ల నిర్మాణానికి దోహ‌దం చేస్తుంది. కండ‌రాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌న శ‌రీరంలో 99 శాతం మేర క్యాల్షియం ఎముక‌లు, దంతాల్లోనే ఉంటుంది. అయితే క్యాల్షియం లోపం ఉంటే ఎముక‌లు, దంతాలు బ‌ల‌హీనంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధ వ్యాధులు వ‌స్తాయి. దీంతో ఎముక‌లు బ‌ల‌హీనంగా మారి విరిగిపోయే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక మ‌న శ‌రీరంలో క్యాల్షియం స్థాయిలు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ‌య‌స్సు మీద ప‌డుతున్న‌వారు క్యాల్షియం ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటుండాలి. లేదంటే శరీరం బ‌ల‌హీనంగా మారుతుంద

ఎన్నో ప‌నుల‌కు క్యాల్షియం అవ‌స‌రం..

క్యాల్షియం వ‌ల్ల కండ‌రాలు ప్ర‌శాంతంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీరంలో త‌గినంత క్యాల్షియం లేక‌పోతే కండ‌రాలు సైతం బ‌ల‌హీనంగా మారుతాయి. కండ‌రాల నొప్పులు వ‌స్తాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ‌కు, మెద‌డు ప‌నితీరుకు కూడా క్యాల్షియం దోహ‌దం చేస్తుంది. రక్త‌నాళాల్లో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా ఉండేందుకు, శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌కుండా ఉండేందుకు క్యాల్షియం స‌హాయం చేస్తుంది. మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే హార్మోన్ల‌కు, ఎంజైమ్‌ల చ‌ర్య‌లకు కూడా క్యాల్షియం ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. క‌నుక క్యాల్షియం లోపం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంద‌కు గాను క్యాల్షియం ఉండే ఆహారాల‌ను రోజూ తింటుండాలి. దీంతో అన్ని జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.


రోజూ ఎంత మోతాదులో కావాలి..?

క్యాల్షియం మ‌న‌కు అనేక ఆహారాల్లో ల‌భిస్తుంది. పాలు, చీజ్‌, పెరుగు, సోయా పాలు, బాదం పాలు, ఓట్స్ పాలు, ఆవు పాలు, పాల‌కూర‌, తోట‌కూర‌, బ‌చ్చ‌లికూర‌, చేప‌లు, సోయా టోఫు, ప‌ప్పు దినుసులు, గ‌స‌గసాలు, నువ్వులు, చియా విత్త‌నాలు, బాదంప‌ప్పుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. క‌నుక వీటిని రోజూ తింటుంటే క్యాల్షియం లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక 4 నుంచి 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న చిన్నారుల‌కు రోజుకు 1000 మిల్లీగ్రాముల మోతాదులో క్యాల్షియం అవ‌స‌రం ఉంటుంది. అలాగే 9 నుంచి 18 ఏళ్లు ఉన్న‌వారికి 1300 మిల్లీగ్రాములు, 19 నుంచి 50 ఏళ్లు ఉన్న‌వారికి 1000 మిల్లీగ్రాములు, 51 ఏళ్లు పైబ‌డిన వారికి రోజుకు 1200 మిల్లీగ్రాముల మోతాదులో క్యాల్షియం అవ‌స‌రం ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు రోజుకు 1300 మిల్లీగ్రాముల మేర క్యాల్షియం ల‌భించేలా చూసుకోవాలి.


డాక్ట‌ర్ సూచ‌న‌తోనే..

క్యాల్షియం లోపం ఉన్న‌వారికి వైద్యులు ప‌రీక్ష‌లు చేసి నిర్దారణ చేస్తారు. క్యాల్షియం లోపం ఉంటే ఎముక‌లు త‌ర‌చూ విర‌గ‌డం లేదా నొప్పులు ఉంటాయి. కిడ్నీ స్టోన్లు త‌ర‌చూ ఏర్ప‌డుతాయి. క్యాల్షియం లోపం ఉన్న‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలితే వైద్యులు ట్యాబ్లెట్ల‌ను సైతం ఇస్తారు. రోజుకు 2000 మిల్లీగ్రాముల మోతాదులో లేదా అంత‌క‌న్నా త‌క్కువ మోతాదులో వైద్యులు సూచించిన కాలం పాటు క్యాల్షియం ట్యాబ్లెట్ల‌ను వాడాల్సి ఉంటుంది. క్యాల్షియం ట్యాబ్లెట్ల‌ను డాక్ట‌ర్ సూచ‌న లేకుండా వాడ‌కూడ‌దు. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి. తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీసే ప్ర‌మాదం ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉంటే క‌డుపు నొప్పి, విరేచ‌నాలు, కిడ్నీ స్టోన్లు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఇలా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూ ఆయా ఆహారాల‌ను తీసుకుంటే క్యాల్షియం లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

దీపావళి ఎప్పుడు ? ఈ నెల 20నా.. 21నా..: అసలు ముహూర్తం..!!


 దీపావళి ఎప్పుడు ? ఈ నెల 20నా.. 21నా..: అసలు ముహూర్తం..!! 

             దీపావళి. ప్రతీ ఇంటి సంతోషంగా.. వైభవంగా జరుపుకునే పండుగ. ప్రపంచ దేశాల్లోనూ భారతీయులు ఉన్న ప్రతీ చోట ఈ పండుగ నిర్వహిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని, గణేశుడిని పూజిస్తారు, కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కోసం పూజలు నిర్వహిస్తారు. ప్రతీ ఏటా ఈ పండుగను ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే, ఈ సారి ఈ పండుగ జరుపుకునే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీంతో.. దీపావళి ముహూర్తం.. శుభ సమయం పైన పండితులు స్పష్టత ఇస్తున్నారు. దృక్ పంచాంగం ప్రకారం.. ఆశ్వయుజ మాసం 2025 అమావాస్య తిథి అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 3.44 గంటలకు ప్రారంభం అవుతన్నట్లు పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5.54 గంటలకు ముగుస్తుందని వెల్లడించారు. దీంతో, అక్టోబర్‌ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ జరుపుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఈరోజునే లక్ష్మీ పూజ ఆచరించటం మంచిదని చెబుతున్నారు. ఇక లక్ష్మీ పూజ ఆచరించడానికి సాయంత్రం 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు శుభ ముహూర్తంగా వెల్లడించారు. మరిన్ని కనుగొనండి సినిమా గాసిప్స్ రాజకీయ విశ్లేషణ మనీ టిప్స్ తెలుగు వార్తా సేవలు జ్యోతిష్యం సేవలు వీడియో వార్తల సేవలు అదే విధంగా.. ప్రదోష కాలం సాయంత్రం 5.46 గంటల నుంచి రాత్రి 8.18 గంటల వరకు.. అదే వృషభ కాలం రాత్రి 7.08 నుంచి 9.03 గంటల వరకు ఉంటుందని వివరిస్తున్నారు. ఇక చాలా మంది దీపావళి రోజున లక్ష్మీదేవిని , గణేశుడిని పూజించే ముందు.. ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి. ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి. పూజా స్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీటం మీద లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలను ప్రతిష్టించి యధావిధిగా పూజ చేస్తారు. ఆ పూజా సమయంలో కొత్త ఖాతా పుస్తకాలు, ఇనప్పెట్టెలు, సంపదను కూడా పూజిస్తారు. పూజ సమయంలో 11, 21, లేదా 51 దీపాలను వెలిగించటం ఆనవాయితీగా వస్తోంది.

            ఇక ఇంటి వద్దకే..!! ఇక, దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇది ఇంటి నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని, లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. దీపావళి నాడు పలు ప్రాంతాల్లో వారి సంప్రదాయాలకు అనుగుణంగా.. పూజలు చేస్తారు. అయితే, ముహూర్త విషయంలో ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. దీంతో... సాధారణంగా పండితులు చెబుతున్న అంశాల విషయంలోనూ ఎవరి అభిప్రాయాల మేరకు వారు పండుగ నిర్వహిస్తారు. ఇక.. ఇప్పటికే దీపావళి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు మొదలయ్యాయి.

ప్రసార భారతి గుడ్ న్యూస్.. రూ.80 వేల జీతంతో ఉద్యోగాలు !!

 


ప్రసార భారతి గుడ్ న్యూస్.. రూ.80 వేల జీతంతో ఉద్యోగాలు !!



   

దేశంలో అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అయిన ప్రసార భారతి నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. జర్నలిజం, ఎడిటింగ్, వీడియో ప్రొడక్షన్ వంటి విభాగాల్లో ఉన్న 59 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. కాగా మీడియా, బ్రాడ్‌కాస్ట్ రంగంలో కెరీర్ కోరుకునే యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21లోపు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.


నియామకాలు ఎక్కడెక్కడంటే..


ఈ పోస్టులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, సిమ్లా, రాంచీ వంటి నగరాల్లోని వివిధ ప్రసార భారతి కేంద్రాల్లో భర్తీ చేయబడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సేవలను మరింత బలోపేతం చేయడం, డిజిటల్ మీడియా విస్తరణను వేగవంతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశ్యమని స్పష్టం చేస్తున్నారు.


prasar-bharati-notification-for-59-posts-across-india

పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు - 59..


సీనియర్ కరస్పాండెంట్ - 2

యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2 - 7

యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-3 - 10

బులిటెన్ ఎడిటర్ - 4

బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్ - 4

వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ - 2

అసైన్‌మెంట్ కోఆర్డినేటర్ - 3

కంటెంట్ ఎగ్జిక్యూటివ్ - 8

కాపీ ఎడిటర్ - 7

కాపీ రైటర్ - 1

ప్యాకింగ్ అసిస్టెంట్ - 6

వీడియోగ్రాఫర్ - 5

అర్హతలు..


ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ లేదా జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మీడియా, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, టెలివిజన్ బ్రాడ్‌కాస్టింగ్ రంగాల్లో కనీసం 2 నుండి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

కాపీ ఎడిటర్, కంటెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలపై పట్టు తప్పనిసరి.

వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటింగ్ పోస్టులకు టెక్నికల్ నైపుణ్యాలు, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి.. పోస్టును బట్టి వయోపరిమితి 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం.. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. పోస్టు స్వభావాన్ని బట్టి టెక్నికల్ టెస్ట్ లేదా డెమో కూడా నిర్వహించే అవకాశం ఉంది. తుది ఎంపికకు అర్హత, అనుభవం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ప్రదర్శన ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. జీతభత్యాలు.. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 నుండి రూ.80,000 వరకు వేతనం లభిస్తుంది. అదనంగా, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీలు వంటి సౌకర్యాలు కూడా ప్రసార భారతి అందిస్తుంది. అనుభవం ఆధారంగా వేతనం పెరగనుంది. దరఖాస్తు విధానం.. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు.. చివరి తేదీ: అక్టోబర్ 21, 2025 మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.prasarbharati.gov.in ను సంప్రదించవచ్చు. అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి "Careers" సెక్షన్‌లో Prasar Bharati Recruitment 2025 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫారమ్ నింపేటప్పుడు ఫోటో, సంతకం, సర్టిఫికేట్‌లను అప్లోడ్ చేయాలి.


ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర - ఒకేసారి 11,000+, ఏ కేటగిరీలో ఎన్ని..!!


 ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర - ఒకేసారి 11,000+, ఏ కేటగిరీలో ఎన్ని..!!

   

ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తయింది. రానున్న జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ లో టెట్ నిర్వహించనుంది. ఏపీపీఎస్సీ సైతం నోటిఫికేషన్ల జారీ పైన కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన కీలక అడుగు పడింది. దాదాపు 11 వేల పోస్టులు భర్తీ కానున్నాయి. ఖాళీల వివరాలపైనా స్పష్టత వచ్చింది.


ఏపీ పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన కీలక అడుగు పడింది. పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాసారు. పెరుగుతున్న నేరాల నియంత్రణలకు పోలీసు సిబ్బంది ఇంకా అవసరమని వివరించారు. దీంతో.. భర్తీకి అవకాశాలు పరిశీలించగలరని ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు పోలీసు శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో ఆయన లేఖ రాశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్‌, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్‌ పోలీస్‌ విభాగంలో 315 ఎస్‌ఐలు, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. కాగా, వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయాలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటుగా పోలీసు శాఖ పైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హతలు, వయసు పరిమితి, పరీక్షా విధానం వంటి అంశాలు పూర్వ నియామకాల మాదిరిగానే ఉండే అవకాశముంది. జనవరి సంక్రాంతి వేళ ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Thursday, 9 October 2025

అమెరికాతో ట్రేడ్ డీల్.. అంతా మోదీ చేతుల్లోనే.. ట్రంప్‌ను కలుస్తారా లేదా?

 అమెరికాతో ట్రేడ్ డీల్.. అంతా మోదీ చేతుల్లోనే.. ట్రంప్‌ను కలుస్తారా లేదా?




                            : భారత్- అమెరికా మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రష్యాతో చమురు కొనుగోలు నుంచి మొదలైన ప్రతిష్టంభన మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై వరుసగా ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. ఇప్పుడు వాణిజ్య ఒప్పందం కొలిక్కిరావాలన్నా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కావాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం భావిస్తోంది. ఆసియాన్ సదస్సు సందర్భంగా ఇది కుదిరే అవకాశం కనిపిస్తోంది.

         : ఇండియా- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు. కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నా.. ఇప్పటికీ ఒక కొలిక్కిరాలేదు. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన తొలగించేందుకు, వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసేందుకు.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భేటీ అవసరం అని అమెరికా భావిస్తోంది. 'వాణిజ్య ఒప్పందం ప్రకటనకు ముందు.. ప్రధాని మోదీతో భేటీ కావాలని ట్రంప్ బృందం బలంగా కోరుకుంటోంది.' అని అధికారులు వెల్లడించారు.

                 >> భారత విధానాలు దీనికి అడ్డుపడే అవకాశం ఉంది. సాధారణంగా ట్రేడ్ డీల్‌పై రెండు దేశాల ప్రతినిధులు ఒక ఏకాభిప్రాయానికి, అంగీకారానికి వచ్చిన తర్వాత మాత్రమే ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు.. ట్రంప్- మోదీ భేటీ ఎలా సాధ్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ 'కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు కావొచ్చు. ఎందుకంటే చాలా కాలంగా అనుసరిస్తున్న ప్రోటోకాల్స్‌ను ట్రంప్ పలుమార్లు పక్కనబెట్టేశారు.' అని అధికారులు అంటున్నారు. అందుకే ఈసారి ట్రేడ్ డీల్ కుదరకముందే.. ట్రంప్- మోదీ భేటీపై చర్చ నడుస్తోంది.

             ప్రస్తుతం అమెరికా- భారత్ వాణిజ్య చర్చలు సాగుతుండగా.. భారత్ తరఫున వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వం వహిస్తున్నారు. గోయల్ బృందం.. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రోర్‌తో పలుమార్లు సమావేశమైంది. ఇప్పుడు తదుపరి దశలో ట్రంప్- మోదీ కూడా దీనిపై నేరుగా చర్చించాలని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

                    అక్టోబర్ 26- 28 మధ్య మలేషియా కౌలాలంపూర్ వేదికగా.. ఆసియాన్, ఈస్ట్ ఇండియా నేతల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో భాగంగానే.. సైడ్‌లైన్స్‌లో మోదీ- ట్రంప్ భేటీ అవ్వొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సమావేశానికి మోదీ హాజరవుతారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. మోదీ పర్యటన ఇప్పటివరకు ఖరారు కూడా కాలేదు. దీనిపై చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

           భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదానిపై ఆగ్రహించిన ట్రంప్ సర్కార్.. ఒక్కసారిగా మన దేశంపై 25 శాతం దిగుమతి సుంకాల్ని విధించింది. తర్వాత దీనిని డబుల్ చేసి.. 50 శాతానికి చేర్చింది. ఇటీవల భారతీయుల వాటా ఎక్కువగా ఉన్న.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును అక్కడ ఏకంగా 1 లక్ష డాలర్లకు పెంచారు ట్రంప్. ఇంకా వేర్వేరు సుంకాలు విధిస్తున్నారు. ఇదే సమయంలో మధ్యలో.. భారత్- పాక్ మధ్య తానే శాంతి నెలకొల్పానని పలుమార్లు ట్రంప్ ప్రకటించుకోగా.. భారత్ దీనిని ఖండించింది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ ఆగ్రహంతో ఇవన్నీ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

బ్యాంక్ శుభవార్త.. సేవింగ్స్ ఖాతా, FD వడ్డీ పెంపు.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?


 బ్యాంక్ శుభవార్త.. సేవింగ్స్ ఖాతా, FD వడ్డీ పెంపు.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

                         FD Rates: బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని చూస్తున్న వారికి బంపర్ ఆఫర్. ప్రస్తుత వడ్డీ రేట్ల కోత సమయంలో ఈ బ్యాంక్ అదిరే శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు సహా సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను సైతం సవరించింది. సవరించిన వడ్డీ రేట్లను అక్టోబర్ 8 నుంచే అమలులోకి తెచ్చింది. ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలపై గరిష్ఠంగా 7.75 శాతం, ఎఫ్‌డీలపై 8.10 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. మరి రూ.5 లక్షలు ఎఫ్‌డీ చేస్తే ఎంతొస్తుంది? తెలుసుకుందాం.

FD Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను భారీగా తగ్గించిన క్రమంలో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రాబడులు తగ్గిపోయాయి. చాలా మంది ఆ డబ్బులను ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక కొత్తగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునే వారు మంచి రాబడి ఇచ్చే బ్యాంకుల కోసం వెతుకుతున్నారు. అలాంటి వారందరికీ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అదిరే శుభవార్త చెప్పింది. రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అక్టోబర్ 8 నుంచి, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను అక్టోబర్ 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది.


సూర్యోదయ ఎస్ఎఫ్‌బీ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

ప్రస్తుతం సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 8.05 శాతం వరకు ఉన్నాయి. గరిష్ఠ వడ్డీ రేట్లను 5 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై కల్పిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 4.20 శాతం నుంచి 8.10 శాతం వరకు ఉన్నాయి.

7 రోజుల నుంచి 14 రోజుల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 4 శాతం వడ్డీ ఇస్తోంది.

15 రోజుల నుంచి 45 రోజులకు 4.25 శాతం, 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 4.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.

91 రోజుల నుంచి 6 నెలల వరకు 5 శాతం, 6 నెలల 1 రోజు డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ ఇస్తోంది.

6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు 5.50 శాతం, 9 నెలల నుంచి 1 ఏడాది లోపు 6 శాతం వడ్డీ ఇస్తోంది.

ఏడాది టర్మ్ డిపాజిట్లకు 7.40 శాతం, ఏడాది నుంచి 15 నెలల వరకు 7.25 శాతం ఇస్తోంది.

15 నెలల నుంచి 36 నెలల వరకు 7.25 శాతం మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది.

3 ఏళ్ల నుంచి 5 సంవత్సరాల లోపు అయితే 6.75 శాతం వడ్డీ ఇస్తోంది.

5 సంవత్సరాల డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీ రేటు 8.05 శాతం ఇస్తోంది.

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.25 శాతం వడ్డీ ఇస్తోంది.


సేవింగ్స్ అకౌంట్లపై 7.75 శాతం ఆఫర్

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రకారం లెక్కిస్తారు. డొమెస్టిక్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ కేటగిరీ అకౌంట్లకు వడ్డీ రేట్ల మార్పు వర్తిస్తుంది. రూ.1 లక్షలోపు బ్యాలెన్స్ ఉంటే 2.50 శాతం వడ్డీ ఇస్తారు. రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉంటే 3 శాతం, రూ.5 లక్షల నుంచిరూ.10 లక్షలు ఉంటే 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు అయితే 7.50 శాతం, రూ.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు అయితే గరిష్ఠంగా 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు.. కారణం ఏంటంటే..

బీపీ తగ్గేందుకు సద్గురు చెప్పిన చిట్కా, నాలుగు రకాల ఫుడ్స్ తింటే మొత్తం కంట్రోల్

దీపావళి వేళ అదృష్టం పెరగనున్న రాశులివే.. ఈ జాబితాలో మీ రాశి ఉందా?

ఉల్లిపాయ, మిర్చి, నిమ్మకాయ ఉంటే చాలు, ఎలుకలు మీ ఇంటి నుంచి పరార్

రూ.5 లక్షలు ఎఫ్‌డీ చేస్తే ఎంతొస్తుంది?

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం 5 ఏళ్ల టెన్యూర్‌పై గరిష్ఠ వడ్డీ రేట్లు ఇస్తోంది. జనరల్ కస్టమర్లకు 8.05 శాతం, సీనియర్లకు 8.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో రూ.5 లక్షలు సాధారణ కస్టమర్ డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 7 లక్షల వరకు వస్తాయి. అదే ఒక సీనియర్ సిటిజన్ అయితే 8.10 శాతం వడ్డీ లభిస్తుంది. వీరికి రూ.5 లక్షలపై అసలు, వడ్డీ కలిపి రూ. 7,01,600 వరకు లభిస్తాయి.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి*

 *మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి*








*TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు*
👉 *IVF మహిళా విభాగ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేత 😘
1) గీత గుప్త ( పొలిటికల్ చైర్ పర్సన్)
2) ఏపూరీ జయలక్మి
3) భువన ( స్టేట్ అడ్వైజర్ )
4) భువన ( స్టేట్ అడ్వైజర్)
👉 *EC కమిటీ సభ్యులు:*
5) మంజుల
6) సౌమ్య
7) రంగ సంతోష రాణి
😎 రేణుక
9) శైలజ
10) రేణుక
11) సాధన
12) సునీత
13) వాణి
14) జ్యోతి
15) నీలిమ
16) రాణి గుప్త
👉 *నాగోల్ డివిజన్:*
17)జయశ్రీ, అధ్యక్షురాలు
18) నీల జ్యోతి, ప్రధాన కార్యదర్శి
👉 వారందరికీ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా *నియామక పత్రాలు* అందజేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు అన్నారు.
👉 బుధ వారం నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో మహిళ విబాగ్ నాయకురాల్లకు నియామక పత్రాలు అందజేశారు.
👉ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్య వైశ్య మహిళ సోదరీ మణులు జెడ్పీటీసీ,ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ లు గా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున మీకు నేను అండగా ఉంటాను అని ఆయన అన్నారు.
ఇంటికే పరిమితం కాకుండా వ్యాపారంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి అని మరెన్నో సేవలు అందించాలని ఆయన సూచించారు.
👉 ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న గారు, మహిళ విభాగం అధ్యక్షురాలు చందా భాగ్య లక్ష్మి, ప్రధాన కార్యదర్శి మంజుల , కోశాధికారి నళిని ,అడ్వై జర్ మనిమల తదితరులు పాల్గొన్నారు.