Wednesday, 11 October 2023

ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి : జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS

 



ఎన్నికల నియమావళిపై అవగాహన ఉండాలి : జిల్లా యస్.పి కె.అపూర్వ రావు IPS 

 అక్రమ మధ్యం,డబ్బు రవాణా పై పటిష్ట నిఘా ...


    తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలనీ,ఎన్నికల నియమావళిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు IPS అన్నారు.  

    

    జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం పరిధిలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు.  సమస్యాత్మక గ్రామాలపై నిరంతర పర్యవేక్షణ  చేయాలి అన్నారు.  ఎన్నికల నియమాలని అమలు చేస్తూ ప్రజలు స్వేచ్ఛావిత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పటిష్టమైన పోలీసు భద్రతను కల్పించడం పోలీస్ ముఖ్య విధి అని  తెలిపినారు. ఇందుకోసం సిబ్బంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక ప్రకారం పని చేయాలని అక్రమ రవాణాను నిరోధించటం కోసం పటిష్టంగా నిఘా పెడ్తూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పరిస్థితులు పోలీసు అదుపులో ఉంటాయని తెలిపినారు.ప్రజా వ్యవస్థకు సమాజానికి భంగం కలిగించేటటువంటి వ్యవస్థీకృతమైన కార్యకలాపాలను పకడ్బందీగా నిరోధించాలని, అలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల నుండి జిల్లాలోకి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా బలోపేతం చేస్తూ పనిచేయాలని కోరారు. అక్రమ మద్యం, రశీదు లు లేనటువంటి విలువైన ఆభరణాలు, అక్రమ డబ్బు ఎట్టి పరిస్థితుల్లో  రవాణా జరగడానికి వీలు లేదని తెలిపారు.  జిల్లాలో  వాహన తనిఖీలను పకడ్బందీగా చేయాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ కె.హనుమంత రావు,యస్.బి డి.యస్.పి సోమ్ నారాయణ్ సింగ్ నల్లగొండ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, మిర్యాలగూడ డిఎస్పీ వెంకటగిరి, డి.సి.ఆర్బి డిఎస్పీ లక్ష్మి నారాయణ, డి.టి.సి డిఎస్పీ విఠల్ రెడ్డి,సిఐలు మరియు యస్.ఐ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment