Wednesday, 11 October 2023

కొరడా ఝులిపించిన ఈసీ- తెలంగాణలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీ


కొరడా ఝులిపించిన ఈసీ, తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ 

అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ...ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు బదిలీ జాబితాలో ఉన్నారు. నలుగురు కలెక్టర్ల బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. వీరితో పాటు 13 మంది ఎస్పీలు, సీపీలను సైతం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, వరంగల్ సీపీ రంగనాథ్‌ను సైతం బదిలీ చేసింది. ఇటు ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజ్‌ను సైతం ట్రాన్స్‌ఫర్ చేసింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌. విధి నిర్వహణలో అధికారుల అలసత్వంపై ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ యాక్షన్ తీసుకుంది. కీలక శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేసింది. ప్రధాన నగరాల పోలీస్‌ కమిషనర్లకూ స్థానచలనం కలిగింది.

తెలంగాణలోని పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో పాటు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ వీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజుకు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌శాఖ సంచాలకులు ముషారఫ్‌ అలీ బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నులశాఖలకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ కోరింది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ప్యానెల్‌ను పంపాలని ఆదేశాలు జారీ చేసింది.*హైదరాబాద్*


 *బ్రేకింగ్*


 *రాష్ట్ర వ్యాప్తంగా పదిమంది ఎస్పీలు బదిలీ* .


1.సంగారెడ్డి-రమణకుమార్,


2.కామారెడ్డి-శ్రీనివాసరెడ్డి.


3.మహబూబాబాద్-చంద్రమోహన్,


4.జోగులాంబగద్వాల-సృజన


5. *జగిత్యాల-భాస్కర్* ,


6.సూర్యాపేట-రాజేంద్రప్రసాద్,


7.మహబూబ్‌నగర్‌-నర్సింహ,


8.నాగర్ కర్నూల్-మనోహర్,


9.నారాయణపేట-వెంకటేశ్వర్లు


10.భూపాలపల్లి-కరుణాకర్,                                                     11, హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

No comments:

Post a Comment