Sunday, 22 October 2023

అందరితో శబాష్ అని అనిపించుకుంటున్న తెలుగు అమ్మాయి జ్యోతి ఏంటో మీరే చూడండి

 అందరితో శబాష్ అని అనిపించుకుంటున్న తెలుగు అమ్మాయి జ్యోతి ఏంటో మీరే చూడండి





కొండను కదలించాలి అనే ఆలోచన ఉంటే సరిపోదు ముందు చుట్టూ ఉన్న రాళ్లను కూడా పైకి ఎత్త కలగాలి. ఆ ప్రయత్నమే లేకుంటే ఆచరణ అంత సులువు కాదు అని ఒక మహిళా నిరూపించింది.

ఫ్యాబ్రిక్ మాండ్

కుటుంబంలో ఎవరు వ్యపోపరం చేసే వారు లేరు కానీ ఆమెకి మాత్రం వ్యాపారవేత్త కావాలి అని ఆశ దాని నెరవేర్చుకోవడానికి 100 శాతం కష్టపడింది. ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఫ్యాబ్రిక్ మాండ్ అనే పేరుతో ఒక కంపెనీ స్థాపించింది. ఈ కంపెనీ ద్వారా సుమారు 83 ప్రముఖ బ్రాండ్లకు వస్త్రాలు సరఫరా చేయగలుగుతోంది.

గుంటూరు జిల్లా

తనది గుంటూరు జిల్లా నంబూరు గ్రామం తన తండ్రి ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో తన చదువు సాగింది. ఇక వైజాగ్ గీతం యూనివర్సిటీలో తన చదవు పూర్తి చేసింది ఇక బెంగళూరులో టిసిఎస్ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఇలా ఉద్యోగం చేస్తున మనస్సు కి సంతృప్తి ఇవ్వలేదు కారణం అప్పుడప్పుడే ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ వంటి కంపెనీలు స్టార్ట్ అప్ గా మొదలుఅయ్యాయి.

వ్యాపారం చేయడానికి

దాంతో ఏదన్నా చేయాలి అనిపించేది అంటా తనకి వ్యాపారవేత్తగా ఎదగాలి అని బలంగా కోరుకొని ఉద్యోగం చేస్తూనే విద్యార్ధులకి వివిధ రంగాలలో ఎక్సప్లోసర్ ఇచ్చే స్టార్ట్ అప్ కంపెనీ మొదలు పెట్టింది. వివిధ కాలేజీలకు వెళ్లి తన ఉపన్యాసాలు ఇచ్చేది అలాగే ఇండస్ట్రీ టూర్ కే తీసుకువెళ్లి వారికీ చూపించేది. అప్పుడే తాను వ్యాపారం చేయడానికి తనకు ఉన్న నెట్ వర్క్ చాలా చిన్నది అని తెలుసుకొంది .

టెక్స్టైల్ రంగంలో

అప్పుడే MBA చేసింది తాను MBA పూర్తి చేసిన తర్వాత తనకు మేనేజర్ స్థాయిలో ఉద్యోగం వచ్చింది. వచ్చిన ఉద్యోగం చేరడానికి ఇంకా 3 నెలలు ఉంది ఆ సమయంలో వ్యవసాయం, టూరిజం మరియు టెక్స్టైల్స్ రంగాలలో ఇంటర్న్షిప్ చేసింది.అప్పుడే టెక్స్టైల్ రంగంలో ఫ్యాబ్రిక్ గురించి తెలుసుకొంది. ఉద్యోగం చేరే సమయం రావడంతో చేరిపోయింది.

బెంగుళూరు ఐఐయం

వారాంతంలో ఎక్సిబిషన్ నిర్వహించేది అలాగే చీరలను టాప్పర్ వేర్ మోడల్ అమ్మడానికి ప్రయోగం చేసింది. అక్కడ విజయం సాధించలేకపోయింది. అప్పుడే తనకు ఇంకో ఆలోచన వచ్చింది. అదే చేనేత వస్త్రాలను బ్రాండెడ్ కంపెనీలకు అమ్మాలి అని నిర్ణయించుకొంది అన్నిటికి అప్లై చేసిన తర్వాత బెంగుళూరు ఐఐయం ఆసక్తి చూపించింది. తన ప్రసంగం విన్నాక ఆమెకి అక్కడ స్థానం కల్పించింది. అలాగే మెంటార్ షిప్ కూడా ఇచ్చింది ఇక కొన్ని మార్పులు సూచించింద

జూనియర్ హేమలత

ఇక ఆమె దేశం అంత తిరిగి చేనేత దుస్తుల ప్రాముఖ్యత తెలుసుకొంది మంగళగిరి, కర్ణాటకలోని హెక్ కోడు ఇలా అనేక ప్రాంతాలు తిరిగి వారితో కలిసి మాట్లాడి ఇక పూర్తి స్థాయిలో ద్రుష్టి దీనిపై పెట్టాలి అని ఉద్యోగం మానేసింది. అప్పటి వరకు సంపాధించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి తన వ్యాపారం మొదలు పెట్టింది. దింతో పటు బెంగుళూరు ఐ ఐ యం వారు రూ.15 లక్షలు ఫండింగ్ గా ఇచ్చారు. ఇక తన జూనియర్ హేమలత కూడా కలిసింది. ఇద్దరు వ్యాపార భాగస్వాములుగా మరి మరో ముగ్గురు విద్యార్థులని పనిలో పెట్టుకున్నారు.

ర్కెటింగ్

ఇక మన చేనేత వస్త్రాలను పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలకు వెళ్లారు నిజానికి పెద్ద బ్రాండ్ల దగ్గరకు వెళ్లి అడగడం అంత సులువు కాదు అందుకే ఇప్పుడు ఉన్న ట్రేండింగ్ స్టైల్ కి అనుగుణంగా చేనేత వస్త్రాలకు న్యాచురల్ కలర్ వేసి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టారు.

ఫ్లైయింగ్ మెషిన్

మొదట వీరికి అవకాశం ఇచ్చింది AZIO సంస్థ ఇక ఆపై అరవింద్, యూ.ఎస్. పోలో , ఫ్లైయింగ్ మెషిన్ , ఫ్యాబ్ ఇండియా ఇలా సుమారు 83 బ్రాండ్లకు వేరు సరఫరా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 150 చేనేత యూనిట్ల నుండి వీరు ఉత్పత్తులు సేకరిస్తున్నారు. దీనికోసం,ప్రధానంగా డేటా కూడా నిర్వహిస్తున్నారు. వారితో నిత్యం చర్చలు జరిపేందుకు ఆరుగురితో కలిసి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

ఏకలవ్య ఫౌండేషన్

ఇక వ్యాపారం పెరిగే కొద్దీ డబ్బులతో అవసరం ఉంటుంది కనుక ఐఐయం కలకత్తా నిర్వహించిన స్టార్ట్ అప్ స్మార్ట్ 50 లో రూ.4 లక్షలు గెలుచుకున్నారు. అలాగే అహమ్మదాబాద్ కి చెందిన ఒక ప్రొఫెసర్ ఒకరు ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా రూ.50 లక్షలు ఇప్పించారు. ఒక్కప్పుడు వ్యాపారం గురించి ఏమి తెలియదు దానికోసం ఉద్యోగం మానేస్తున్నావా అన్నవారు ఇప్పుడు శబాష్ అంటుంటే చాలా సంతోషంగా ఉంది అంటోంది మన తెలుగు అమ్మాయి జ్యోతిర్మయి ఢక్కామల.

అనుకొన్నది

నెలకి రూ.2 లక్షల జీతం వదులుకొని వ్యాపారమే మేలు అనుకొంది చివరికి అనుకొన్నది సాధించింది చూసారుగా కృషితో నాస్తి దుర్భిక్షం.

No comments:

Post a Comment