బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station)లో ఏసీబీ సోదాలు(ACB RAIDS) నిర్వహిస్తోంది. స్కై లాంజ్ పబ్(Sky Lounge Pub) నుంచి బంజారాహిల్స్ సీఐ నరేందర్(BANJARAHILLS CI NARENDER) డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ACB RAIDS: బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ సోదాలు.. కారణమేంటంటే..?
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station)లో ఏసీబీ సోదాలు(ACB RAIDS) నిర్వహిస్తోంది. స్కై లాంజ్ పబ్(Sky Lounge Pub) నుంచి బంజారాహిల్స్ సీఐ నరేందర్(BANJARAHILLS CI NARENDER) డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ పబ్ ఓనర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి బంజారాహిల్స్ పీఎస్‌లో తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. A1గా బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, A2గా ఎస్సై నవీన్‌రెడ్డి, A3 గా హోమ్ గార్డ్ హరి లను ఈ కేసులో చేర్చారు. జూన్ 18వ తేదీన మూడు నెలలకుగానూ 4.5 లక్షలు మాములు ఇవ్వాలని స్కై లాంచ్ పబ్ ఎండీ రాజేశ్వర్ లక్ష్మణ్ రావును సీఐ నరేందర్ టీం బెదిరింపులకు పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు. హోమ్‌గార్డ్ హరి 10 వేలు వ్యక్తిగతంగా డబ్బులు స్కై లాంచ్ పబ్ ఎండీని డిమాండ్ చేశాడు.
సీఐ నరేందర్ ఆదేశాలతో స్కై లాంజ్ పబ్‌కి హోంగార్డ్ హరి వెళ్లాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలని పలుమార్లు వాట్సాప్ కాల్స్‌లో పబ్ ఓనర్‌ను నరేందర్ టీం వేధింపులకు గురి చేశారు. డబ్బులు ఇవ్వక పోవడంతో స్కై లాంజ్ పబ్ ఓనర్‌పై సీఐ నరేందర్ తప్పుడు కేసు పెట్టాడు. సీఐ నరేందర్‌తో కలిసి పబ్ ఓనర్‌ను ఎస్సై నవీన్‌రెడ్డి కూడా పలుమార్లు వేధించారని ఏసీబీ అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీన పబ్ ఓనర్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి సీఐ నరేందర్ టీవ వేధించింది. వీరి వేధింపులకు తాళాలేక ఏసీబీకి బాధితుడు ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.
కాగా.. ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే ఇన్స్‌పెక్టర్ నరేందర్‌కు చాతిలో నొప్పి వచ్చింది. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఇన్స్‌పెక్టర్ నరేందర్ వాహనంలోనే సిటీ న్యూరో ఆస్పత్రికి ఏసీబీ అధికారులు తరలించారు. హోంగార్డ్ హరిని అరెస్ట్ చేసి ఏసీబీ ఆఫీస్‌కి తరలించారు.
No comments:
Post a Comment