హైదరాబాద్ అభివృద్ధి, సీఎం కేసీఆర్‌పై జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు Jaya Prakash Narayana | ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థికాభివృద్ధిని, సంపద సృష్టిని ఆపకూడదని, అదే సమయంలో సంక్షేమం ద్వారా సామాన్యుడిని ఆదుకోకుంటే ప్రజాస్వామ్యం నడవదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ సమతూకాన్ని పాటించే ప్రయత్నాలు విజయవంతంగా చేసిందని అభినందించారు.
ఇది గర్వించాల్సిన విషయం..
కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో సామరస్యాన్ని పెంచడంతోపాటు హైదరాబాద్ నగరాన్ని మరింత వేగంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేసిందని చెప్పారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంలో సఫలమయ్యారని పేర్కొన్నారు. చాలామంది ఉత్తరాదివారు కూడా హైదరాబాద్‌లో ఆస్తులు కొంటున్నారని, ఇది ఎంతో గర్వించాల్సిన విషయమని చెప్పారు.
ఇంతకాలం వాళ్లను పురుగుల్లా చూశారు
అర్బన్ డెవలప్‌మెంట్ అనేది ఎంతో క్లిష్టమైనదని, మన దేశంలో పెట్టుబడి పెట్టి సంపద సృష్టిస్తే అది పాపం చేశారనే భావన ఎంతో కాలంగా ఉందని అన్నారు. పదిమందికి ఉపాధి కల్పించేవాడు దేవుడని, ఆత్మవిశాసాన్ని, సంపదను పెంచి, ఆదాయాన్ని తెచ్చేవాడు దేవుడని, అటువంటివాళ్లకు ఇప్పుడు గౌరవం లభిస్తున్నదని తెలిపారు. ఇంతకాలం వాళ్లను పురుగుల్లా చూశారని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజంలో రిస్క్ తీసుకొని తాను కొంత సంపాదించి, నలుగురికి ఉపాధి చూపించేవాడు దేశానికి అవసరమని చెప్పారు. దానికోసం మౌలిక సదుపాయాలు, అర్బనైజేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ అవసరమని, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ైక్లెమేట్ ఉండాలని, ఇవి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులవల్ల దేశం బాగుపడుతుందనే భ్రమనుంచి బయటపడాలని సూచించారు. తెలంగాణలో ఒక ప్రోయాక్టిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేశారని కితాబిచ్చారు.
No comments:
Post a Comment