హైదరాబాద్:
వైశ్య గర్జన విజయవంతం అయ్యింది. నిర్వాహకులు శ్రమ ఫలించిందని, కుట్రలు చేసిన వారికి దిమ్మ తిరిగే జవాబు వైశ్యులు ఇచ్చారని పాల్గొన్న పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ గర్జన లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైశ్యులు డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకు వెళ్లి , వారికి అండగా ఉంటా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
అన్నారు.ఆదివారం సరూర్ నగర్ స్టేడియం లో వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో వైశ్యుల ఆత్మగౌరవం -హక్కుల సాధనకై ఏర్పాటు చేసిన" వైశ్య గర్జన కార్యక్రమం కు ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి హాజరు అయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో కూడా ఎంతోమంది ఆర్యవైశ్యులు అండగా ఉన్నారని గుర్తుకు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు వైశ్యులకు కొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.నియోజక వర్గంలో ఇప్పటికే 11 కేటాయించామని , మరికొన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా కూడా ఎల్బీనగర్లో భవిష్యత్తులో సీట్లు కేటాయిస్తము అని అన్నారు. అనంతరం కాచం సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వైశ్య జాతి కోసం ఐక్యత గా పోరాడుదాం అని, ఉప్పల్ బాగాయత్ లో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమి పై కమిటీ వేసి అధికారిని నియమించాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త అన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ, వైశ్య జాతి కోసం కంకణ బడ్డులై పని చేస్తాం అని , ఏ పార్టీ కో ,సంగానికో వ్యతిరేఖం కాదు అని అన్నారు. రాజకీయం గా మనం ఎక్కడున్నారో ఆలోచించాలి అని ,గతంలో 15 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు అని అన్నారు. కుల గనన చేయాల్సిన పని ఆర్య వైశ్య మహా సభ పై ఉంది అన్నారు. వారు చేయకుంటే వైశ్య వికాస వేదిక నిర్వహించడానికి సిద్దంగా ఉన్నదని అన్నారు. వైశ్య గర్జన సభ విఫలం చేయడానికి ఆర్య వైశ్య మహా సభ ఎంతో ప్రయత్నం చేసింది అని అన్నారు. పదవులు అనుభవించి , సన్మానాలు పొంది పదవి విరమణ తర్వాత దొంగ దీక్షలు చేస్తున్నారు అని అన్నారు. జాతిని కించ పరిస్తే ఖబర్దార్ అని హెచ్చ రించారు. పేద వైశ్యలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇండ్లు కేటాయించాలి అని అన్నారు. ఈ గర్జన లో చేసిన డిమాండ్ లు 1. వైశ్య కమిషన్ ను స్థాపించాలి. 2. జనాభా దామశా ప్రకారం రాజకీయాల్లో వాటా కల్పించాలి. 3.వైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి. 4. ఈ డబ్లు ఎస్ లో వర్గీకరణ తేవాలి. 5.విదేశీ విద్యా సహాయ నిధిని ఏర్పాటు చేసి వైశ్య విద్యార్థులకు తోడుపాటు అందించాలి. 6.వైశ్య బందును ప్రారంభించాలి. 7.సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో అగ్ర వర్ణాల వివరాలు, జన సంఖ్య , గణాంకాలు ప్రకటించాలి.8.వైశ్య ఇండియన్ ఛాంబర్ ఆఫ్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు కు ఆర్ధిక చట్ట పరమైన వెసులు బాటు కల్పించాలి.9. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ కారిడార్లలో వైశ్య పారిశ్రామిక వేత్తలకు 25 శాతం కేటాయించాలి.10. వైశ్య ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉమెన్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమం లో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ గత 10 సంవత్సరముల నుండి కార్పొరేషన్ కొరకు పోరాటం చేస్తున్నానని ప్రభుత్వం వెంటనే కార్పొరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైశ్య వికాస వేదిక ప్రధాన కార్యదర్శి నంగునూరు రమేష్. కోశాధికారి కండె రామ్ నరేష్. గౌరవ సలహాదారులు కోటగిరి దైవదీనం బుక్క ఈశ్వరయ్య. కోదుమూరి దయాకర్ రావు. కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా, గార్లపాటి జితేంద్ర కుమార్, కల్వ సుజాత పాల్గొన్నారు.
No comments:
Post a Comment