రేపు తెలంగాణకు అమిత్‌షా ..కేంద్ర హోంమంత్రి టూర్ షెడ్యూల్ ఇదే
: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి షాక్.. మారిన రూల్స్
తెలంగాణ(Telangana)లో ఎన్నికల నగారా మోగిందో లేదో పొలిటికల్ హడావుడి మొదలైంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్న బీజేపీ అందుకు తగినట్లుగానే పార్టీ అగ్రనేతలు హైదరాబాద్(Hyderabad) పర్యటనకు వస్తున్నారు. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah ) హైదరాబాద్ రానున్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకుంటారు. అక్కడ మల్టీ పర్పస్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించే ఆదిలాబాద్ జనగర్జన సభకు హాజరవుతారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో మేధావుల సదస్సులో పాల్గొంటారు. తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం అవుతారు అమిత్‌షా. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి అనుసరించాల్సిన అంశాలపై లోతుగా చర్చ జరపనున్నారు.
ఎన్నికల ప్రచారమే ప్రధాన ఎజెండా..
తెలంగాణలో పొలిటికల్ హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు వారి వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణలో పాగా వేయడానికి విసృతంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ..అందుకు తగినట్లుగానే అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో బాగంగానే బుధవారం అనగా అక్టోబర్ 10న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి ఆదిలబాాద్ డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే జనగర్జన బహిరంగసభలో పాల్గొంటారు.
: ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వేసే వారికి షాక్.. మారిన రూల్స్
మేధావులతో సమావేశం..
మధ్యాహ్నం ఆదిలాబాద్ సభ ముగియగానే సాయంత్రం సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. 6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది. అదేవిధంగా సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో రెండు గంటలపాటు ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
ఒకరి తర్వాత మరొకరు..
ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది.
No comments:
Post a Comment