Tuesday, 17 October 2023

సీఎం అయ్యే అవకాశం రావొచ్చు, మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి

 తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమన్న రాజ్‌నాథ్‌ సింగ్

హుజురాబాద్ జనగర్జన సభలో రాజ్‌నాథ్‌ సింగ్

హుజురాబాద్ జనగర్జన సభలో రాజ్‌నాథ్‌ సింగ్

        : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. బీజేపీ జనగర్జన సభలో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ బిఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ధ రణి పోర్టల్ పేరుతో లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టారన్నారు.

            : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం లేకుండా ఉండలేరని, తెలంగాణా ప్రభుత్వం అంటే లీకేజీల ప్రభుత్వమని కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మండిపడ్డారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిథిలోని జమ్మికుంటలో భారతీయ జనతా పార్టీ జనగర్జన పేరిట భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

       హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ 2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం రెండు పర్యాయాలు కేసీఆర్ కు ప్రజలు అవకాశం ఇచ్చినా ఏమాత్రం అభివృద్ది చేయలేదన్నారు.

    బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వెనుకబడిందో ప్రజలు ఆలోచించాలన్నారు.తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని,ప్రజలు కేసీఆర్ పాలనలో సంతృప్తిగా లేరన్నారు.

            ధరణి పోర్టల్ తీసుకువచ్చి రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.కల్వకుంట్ల కుటుంబ అవినీతి ఢిల్లీవరకు చేరిందని,తెలంగాణా రాష్ట్రసాధన కోసం కేసీఆర్ ఒక్కడే ఉద్యమించలేదని,యావత్ తెలంగాణా ప్రజలు చేసిన ఉద్యమానికి బీజేపీ కూడా అండగా నిలిచిందని గుర్తు చేసారు.

                వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు...బేకార్ అవుతుందని, బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు హ్యండ్ ఇవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ ఫలాలకు రూపాయి కేటాయిస్తే ప్రజలకు ఇరవై పైసలే వచ్చాయని, కాంగ్రెస్ నాయకుల దోపిడిని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

                        


కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమని,కమలం పువ్వు పై లక్ష్మీదేవి కూర్చుని ప్రజలను ఆశీర్వదిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటు పలువులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment