Sunday, 22 October 2023

నిర్మాణ లోపమా? మరేదైనా కారణమా?- మేడిగడ్డ ప్రమాదంపై నిపుణుల ఆరా?


నిర్మాణ లోపమా? మరేదైనా కారణమా?- మేడిగడ్డ ప్రమాదంపై నిపుణుల ఆరా?

                 :తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుల్లో ఒకటైన మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీ మూడో బ్లాక్ లోని పిల్లర్లు కుంగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మానవ తప్పిదాలు, టెక్నికల్​ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ

         : తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ​ ప్రమాదంలో పడింది. బ్యారేజీ మూడో బ్లాక్​లోని పిల్లర్లు శనివారం రాత్రి కుంగిపోయాయి. దాదాపు 85 గేట్లు, 16 టీఎంసీల కెపాసిటీతో ఈ బ్యారేజీని నిర్మించగా.. 19, 20, 21 నెంబర్​ పిల్లర్లు కుంగిపోయి గేట్ల నుంచి భారీ శబ్దం వచ్చింది. దీంతో అక్కడి సిబ్బంది అలర్ట్​అయి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బ్యారేజీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపేశారు. శనివారం రాత్రి వరకు బ్యారేజీలో దాదాపు 10 టీఎంసీల నీళ్లు ఉండగా.. ఇరిగేషన్​ ఆఫీసర్లు అక్కడకు చేరుకుని గేట్లను ఎత్తి నీటికి ఖాళీ చేయడం ప్రారంభించారు. కాగా ఆదివారం ఉదయం ఇంజినీరింగ్​ ఆఫీసర్లు కుంగుతున్న బ్యారేజీ పిల్లర్లను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. నిర్మాణ లోపమా.. మరేదైనా కారణమా? అని విశ్లేషించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను వివరిస్తూ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్​చీఫ్​ జస్టిస్​కు లేఖ రాశారు.


No comments:

Post a Comment