Monday, 30 October 2023

తెలంగాణలో హోరా హోరీ: గెలిచేదెవరు, తేల్చేసిన తాజా సర్వే..!!

                             


:తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా నెల రోజుల్లో ప్రజలు తమ తీర్పు ఇవ్వనున్నారు. ఇప్పటికే పార్టీల ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసారు. హోరా హోరీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎన్నికల ఎత్తులకు సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొనేందుకు సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా -నేనా అనే స్థాయిలో పోటీ ఉందని చెబుతున్నారు. మరి, గెలిచేదెవరు..సర్వేలు ఏం తేల్చాయి. హోరా హోరీ పోరు : తెలంగాణలో అధికారం పైన కాంగ్రెస్ - బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నాయి. రాష్ట్రం ఆవిర్భావం నుంచి ప్రజల ఆశల మేరకు పాలన సాగిస్తున్న తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటక తరువాత కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. ఇక దశలో బీజేపీ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగిన తెలంగాణ రాజకీయం కమలం పార్టీ అంతర్గత వ్యవహారాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మరాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కేంద్రం..!! నేరుగా సోనియా గాంధీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేసే గ్యారంటీ పథకాలను ప్రకటించారు. అవే తమకు అధికారం తెచ్చి పెడతాయనే ధీమాలో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీలో మేనిఫెస్టో మొదలు అభ్యర్దుల ఎంపిక వరకు హైకమాండ్ స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇటు కేసీఆర్ అండ్ టీం..తెలంగాణలో ప్రచారంలో ముందున్నారు. Next Stay బీఆర్ఎస్ కే మెజార్టీ : ఇదే సమయంలో తెలంగాణలో పలు సర్వేలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా శ్రీఆత్మ సాక్షి సంస్థ చేసిన తాజా సర్వే ఆసక్తి కర అంచనాలను వెల్లడించింది. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ సర్వేలో తెలంగాణ పబ్లిక్ మూడ్ ఏంటనేది వెల్లడించే ప్రయత్నం చేసింది. అందులో 42.5 శాతం ఓట్ షేర్ తో బీఆర్ఎస్ 64-70 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ 36.5 ఓట్ షేర్ తో దాదాపుగా 37-43 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. బీజేపీ 10.75 శాతం ఓట్ షేర్ తో 5-6 సీట్లు, ఎంఐఎం 2.75 శాతం ఓట్ షేర్ తో 6-7 సీట్లు దక్కించుకొనే ఛాన్స్ ఉందని అంచనా వేసారు. అయితే, ఇక్కడ ఆరు స్థానాల్లో హోరా హోరీ పోటీ ఉంటుందని సర్వే అంచనాకు వచ్చింది. అందులో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, బీజేపీ ఒక్క స్థానంలో ఆధిక్యత కనిపిస్తోందని వెల్లడించింది. నవంబర్‌లో శ్రీవారికి విశేష ఉత్సవాలు- `కార్తీక` శోభ మారుతున్న లెక్కలు : పోలింగ్ కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గం పైన అవగాహన..స్థానిక పరిస్థితులు..సమీకరణాల పైన పూర్తి లెక్కలతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రభావితం చేసే అంశాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ లో సీట్లు రాని ముఖ్య నేతల వద్దకు కేటీఆర్, హరీష్ వెళ్లి తమ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ లో నేతల్లో జోష్ కనిపిస్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఏ మర ప్రభావితం చేయగలుగుతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. బీజేపీ బీసీ అంశంతో ముందుకు వెళ్తోంది. ఇక, సర్వేల్లో బీఆర్ఎస్ కు అనుకూలత కనిపిస్తుంది. హ్యాట్రిక్ విజయం గులాబీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment