Monday, 2 October 2023

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి


. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు  కొట్టి  ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. నేను ఇప్పుడు అనవసరంగా 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇది నా ఒక్కడికి జరుగుతున్నది కాదు.

  AE, DE & SE levelలో వొస్తున్న అదేశాలనుసరంగా బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. మీరు కూడా అందరికి షేర్ చేయండి. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. ఐన మనం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నాం. మరి ఈ మోసమును ఆపడానికి మీరు సపోర్ట్ చేయండి.. మీకు ఈ లాంటి ఇబ్బంది రావద్దు.. అనుకున్నవారు. సపోర్ట్ చెయ్యండి. నేను ఈ మోసాన్ని ఆపడానికి పోరు చెయ్యడానికి  నేను సిద్ధం. ఈ పోరులో కలిసి వచ్చు వారు. ఇట్టి విషయాన్ని అందరికి తెలియజేయండి. నా వంతుగా నేను అందరికి తెలియజేయడానికి షేర్ చేస్తూ కృషి చేస్తాను.

అందరికి తెలియజేయుటకు మీరు షేర్ చెయ్యండి.

No comments:

Post a Comment